Pink Driver Lalitha | లలిత స్కూటీపై రాహుల్ రైడ్.. ఆమె ఏమన్నారంటే..?
Pink Driver Lalitha | హైదరాబాద్ నగరంలో శనివారం ఉదయం నిర్వహించిన గిగ్ వర్కర్ల ర్యాలీలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ కూడా ర్యాపిడో బైక్‌లపై ప్రయాణించారు. పింక్ డ్రైవర్ లలిత( Pink Driver Lalitha ) అనే మహిళ స్కూటీ నడుపుతుండగా.. రాహుల్( Rahul Gandhi ) వెనుక కూర్చొని ర్యాలీలో పాల్గొన్నారు.
Pink Driver Lalitha | త్రినేత్ర న్యూస్ : హైదరాబాద్ నగరంలో శనివారం ఉదయం నిర్వహించిన గిగ్ వర్కర్ల ర్యాలీలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ కూడా ర్యాపిడో బైక్‌లపై ప్రయాణించారు. పింక్ డ్రైవర్ లలిత( Pink Driver Lalitha ) అనే మహిళ స్కూటీ నడుపుతుండగా.. రాహుల్( Rahul Gandhi ) వెనుక కూర్చొని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లలిత.. తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
లలిత ఏమన్నారంటే..?
రాహుల్ గాంధీని నా యాక్టివా మీద తీసుకెళ్లడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. చాలా సంతోషంగా కూడా ఉంది. వందల మంది గిగ్ వర్కర్లను చూసి.. రాహుల్‌ను కలిస్తే చాలు అనుకున్నాను. కానీ ఊహించని విధంగా నా స్కూటీపై ఆయన ఎక్కడ ఆశ్చర్యపోయాను. ఇది గొప్ప అచీవ్‌మెంట్‌లా ఫీలవుతున్నాను. దాదాపు పది నిమిషాల పాటు ర్యాలీ కొనసాగింది. అయితే ఈ మధ్యలోనే రాహుల్ నన్ను హలో అంటూ పలుకరించారు. నా కుటుంబ వివరాలతో పాటు గిగ్ వర్కర్‌గా నా జర్నీ గురించి అడిగి తెలుసుకున్నారు. పింక్ బైక్ రాపిడో వల్ల నాకు ఈ అవకాశం వచ్చినట్లు ఆయనకు వివరించాను. ఇక గిగ్ వర్కర్ల సంక్షేమంపై ప్రభుత్వ చిత్తశుద్ధికి రుణపడి ఉంటాం. సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని లలిత సంతోషం వ్యక్తం చేశారు.


తాజావార్తలు
- ●School Bus | డ్రైవర్‌కు ఫిట్స్.. 40 మంది స్కూల్ విద్యార్థులు సురక్షితం
- ●U19 Asia Cup 2026 | ఉత్కంఠ పోరులో పాక్‌పై భారత్ సంచలన విజయం
- ●Satvika Veeravalli | ఇంజినీర్ నుంచి హీరోయిన్గా - "కాంత" కోసం ఆడిషన్ ఇచ్చా కానీ - సాత్విక వీరవల్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- ●Road Accident | డివైడర్‌ను ఢీకొట్టి అంటుకున్న కారు.. డ్రైవర్ బయటికొచ్చేలోపే ఏం జరిగిందంటే!
- ●BM Sandeep | తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జిగా బీఎం సందీప్
- ●Vemulawada | రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశం

School Bus | డ్రైవర్‌కు ఫిట్స్.. 40 మంది స్కూల్ విద్యార్థులు సురక్షితం

U19 Asia Cup 2026 | ఉత్కంఠ పోరులో పాక్‌పై భారత్ సంచలన విజయం

Satvika Veeravalli | ఇంజినీర్ నుంచి హీరోయిన్గా - "కాంత" కోసం ఆడిషన్ ఇచ్చా కానీ - సాత్విక వీరవల్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Road Accident | డివైడర్‌ను ఢీకొట్టి అంటుకున్న కారు.. డ్రైవర్ బయటికొచ్చేలోపే ఏం జరిగిందంటే!




