Ramlila Ground | రామ్‌లీలాలో నిరసనలకు ఢిల్లీ పోలీసులు కొత్త రూల్స్.. 50,000 మందికి మాత్రమే అనుమతి
Ramlila Ground | రామ్‌లీలా మైదానం (Ramlila Ground)లో నిరసనలు, ప్రదర్శనలు, ర్యాలీలు, బహిరంగ సభల నిర్వహణ కోసం ఢిల్లీ పోలీసులు (Delhi Police) కొత్త మార్గదర్శకాలను (SOP) రూపొందించారు. నిరసనలకు ఇకపై గరిష్ఠంగా 50,000 మందికి మాత్రమే అనుమతి ఇవ్వాలని ప్రతిపాదించారు.
Ramlila Ground | త్రినేత్ర న్యూస్ : రామ్‌లీలా మైదానం (Ramlila Ground)లో నిరసనలు, ప్రదర్శనలు, ర్యాలీలు, బహిరంగ సభల నిర్వహణ కోసం ఢిల్లీ పోలీసులు (Delhi Police) కొత్త మార్గదర్శకాలను (SOP) రూపొందించారు. దీని ప్రకారం.. మైదానంలో నిరసనలకు ఇకపై గరిష్ఠంగా 50,000 మందికి మాత్రమే అనుమతి ఇవ్వాలని ప్రతిపాదించారు. అది కూడా నిరసన కార్యక్రమాలకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మాత్రమే అనుమతించనున్నట్లు స్పష్టం చేశారు. నిర్దేశిత ఏడు గంటల్లోనే కార్యక్రమాలు ముగించాల్సి ఉంటుంది.
నిర్వాహకులు తాము తలపెట్టిన కార్యక్రమాలకు కనీసం 10 రోజుల ముందే దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అంతకంటే ముందు తమ కార్యక్రమానికి వేదిక అందుబాటులో ఉందో లేదో నిర్ధారించుకోవాలి. మైదానం అందుబాటుపై మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (Municipal Corporation of Delhi) నుంచి అనుమతి తీసుకోవాలి. సభలు, నిరసన కార్యక్రమాలకు హాజరయ్యే ప్రజల భద్రత పూర్తిగా నిర్వాహకుల బాధ్యతే. తాగునీరు, వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్యం, పార్కింగ్ ఏర్పాట్లను నిర్వాహకులే చూసుకోవాలి. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లపై నిర్వాహకులు పోలీసులతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. అత్యవసర వాహనాల రాకపోకలకు, సాధారణ ప్రజలకు, వాహనాల రాకపోలకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిర్వాహకులే చూసుకోవాలి.
అంతేకాదు, నిరసనల సమయంలో మైదానంలోకి కత్తులు, కటార్లు, తుపాకులు, పదునైన ఆయుధాలు, మండే స్వభావం ఉన్న వస్తువులు వంటివాటిని అనుమతించరు. ఈవెంట్‌లో డ్రోన్‌ల వినియోగానికి సంబంధించి నిర్వాహకులు ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఈ కొత్త మార్గదర్శకాలకు సంబంధించిన ముసాయిదా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ను ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయానికి పంపినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. ప్రస్తుతం ఇది ప్రాథమిక దశలోనే ఉందని, సంబంధిత అధికారుల పరిశీలన, ఆమోదం తర్వాత తుది మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని తెలిపారు. జంతర్ మంతర్‌కు ప్రత్యామ్నాయంగా రామ్‌లీలా మైదానం, బురారీ మైదానం, సీబీడీ మైదానాలను గత అక్టోబర్‌లో ఢిల్లీ పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్‌లీలా మైదాన్‌లో కొత్త నిబంధనలు తీసుకొస్తున్నారు.
Also Read..
గిగ్ వర్కర్లకు పెన్షన్ ఇస్తాం.. ఇక మీ ఫోన్‌లోనే మీ డేటా ఉంటది
గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల జీవిత బీమా.. గుర్తింపు కార్డులిచ్చి ఆదుకుంటాం: సీఎం రేవంత్
25 ఏళ్ల పెట్టుబడి లక్ష్యం.. ఈపీఎఫ్, ఎన్‌పీఎస్‌లలో ఏది బెస్ట్?
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Delhi Narela Firecracker Accident | ఢిల్లీలో పండగ పూట పెను విషాదం: చాతీలోకి దూసుకెళ్లిన పటాకులు.. 10 ఏళ్ల బాలుడు మృతి
నవంబర్ 9, 2026

Harry Boxer | రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడు హ్యారీ బాక్సర్ అరెస్ట్
నవంబర్ 7, 2026

Meta | సోషల్ మీడియాలో బాలల లైంగిక వేధింపుల కంటెంట్.. మెటాపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు
నవంబర్ 5, 2026
తాజావార్తలు
- ●Silent Heart Attack Causes | గుండెపోటు సడన్‌గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!
- ●Gold Price | వరుసగా నాలుగో రోజూ తగ్గిన బంగారం ధర.. తులంపై రూ.2,500 డౌన్..!
- ●IAS Rajiv Hanumanthu Road Accident | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తెలంగాణ ఐఏఎస్ రాజీవ్ హనుమంతు.. ఫోన్లో పరామర్శించి భరోసా ఇచ్చిన పొంగులేటి
- ●Bharat Summit Hyderabad Visa Row | అప్పుడు రేవంత్ టూర్.. ఇప్పుడు హైదరాబాద్ 'భారత్ సమ్మిట్'! మళ్లీ తెరపైకి వీసా వివాదం
- ●Sreeleela | సాయిపల్లవి వర్సెస్ శ్రీలీల - "ఓం" సినిమా కోసం ఎవరి రెమ్యూనరేషన్ ఎక్కువంటే?
- ●FAA Flight Outage | అమెరికా విమానాలకు సడెన్ బ్రేక్: రోజుకు 44,000 ఫ్లైట్స్, గాల్లో 5,500.. అసలు యూఎస్ గగనతలం ఎలా పనిచేస్తుందంటే?

Silent Heart Attack Causes | గుండెపోటు సడన్‌గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!

Gold Price | వరుసగా నాలుగో రోజూ తగ్గిన బంగారం ధర.. తులంపై రూ.2,500 డౌన్..!

IAS Rajiv Hanumanthu Road Accident | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తెలంగాణ ఐఏఎస్ రాజీవ్ హనుమంతు.. ఫోన్లో పరామర్శించి భరోసా ఇచ్చిన పొంగులేటి

Bharat Summit Hyderabad Visa Row | అప్పుడు రేవంత్ టూర్.. ఇప్పుడు హైదరాబాద్ 'భారత్ సమ్మిట్'! మళ్లీ తెరపైకి వీసా వివాదం



