TPCC | తెలంగాణ కాంగ్రెస్ సంస్థాగత పనితీరుపై కేసీ వేణుగోపాల్ సమీక్ష
TPCC | తెలంగాణ కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్ సమీక్ష నిర్వహించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచిందని ఆయన ప్రశంసించినట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ తెలిపారు.
TPCC | తెలంగాణ కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్ సమీక్ష నిర్వహించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచిందని ఆయన ప్రశంసించినట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంస్థాగత కార్యక్రమాలపై కేసీ వేణుగోపాల్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. సమీక్షలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ), మండల కాంగ్రెస్ కమిటీల అధ్యక్షుల పనితీరు, పార్టీ విస్తరణ కార్యక్రమాలపై చర్చ జరిగినట్లు వెల్లడించారు.
అదే సమయంలో ఎస్‌ఐఆర్ అంశంపై మరింత లోతుగా పనిచేయాలని ఏఐసీసీ సూచించినట్లు తెలిపారు. ఎస్‌ఐఆర్‌పై తదుపరి కార్యాచరణపై ఎల్లుండి ఉదయం 10 గంటలకు ఢిల్లీలో తెలంగాణ సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. ఏఐసీసీ నేత మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు సమన్వయ కమిటీ సభ్యులు హాజరుకానున్నారు. రాష్ట్రంలో పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓటు హక్కులను పరిరక్షించడమే కాంగ్రెస్ లక్ష్యమని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. ఒక్క ఓటు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. పార్టీలో సమన్వయానికి సంబంధించిన అంశాలపై కూడా త్వరలో విస్తృతంగా చర్చించనున్నట్లు మహేశ్ గౌడ్ తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Telangana CEO Form 7 Order | ఓట్ల తొలగింపునకు నకిలీ ఫారం-7 కుట్ర: బల్క్ దరఖాస్తులపై ఎన్నికల సంఘం కొరడా.. సెక్షన్ 31 కింద కేసులకు ఆదేశం
అక్టోబర్ 5, 2026

Next CM of Telangana | నెక్స్ట్ సీఎం ఎవరు?
అక్టోబర్ 5, 2026

KP Vivekananda | సీఎం రేవంత్ అవినీతిపై రాష్ట్రపతి తక్షణమే జోక్యం చేసుకోవాలి
అక్టోబర్ 5, 2026
తాజావార్తలు
- ●Telangana CEO Form 7 Order | ఓట్ల తొలగింపునకు నకిలీ ఫారం-7 కుట్ర: బల్క్ దరఖాస్తులపై ఎన్నికల సంఘం కొరడా.. సెక్షన్ 31 కింద కేసులకు ఆదేశం
- ●Bheemgal SI Tirupati | పీఎస్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం: ఎస్సై వేధింపులే కారణమంటూ వేముల ఫైర్.. రేపు 'భీమ్‌గల్ బంద్'కు పిలుపు
- ●Justice PS Koshy Telangana High Court | హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ పీఎస్ కోషి: సుప్రీంకోర్టుకు జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్
- ●Mehdipatnam GHMC Raid | జీహెచ్ఎంసీ ఆఫీసులో ఏసీబీ మెరుపు దాడి: 4 లక్షలు లంచం తీసుకుంటూ చిక్కిన టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్
- ●Next CM of Telangana | నెక్స్ట్ సీఎం ఎవరు?
- ●Janhvi Kapoor | పారిస్ ఫ్యాషన్ షోలో జాన్వీకపూర్ అందాల విందు

Telangana CEO Form 7 Order | ఓట్ల తొలగింపునకు నకిలీ ఫారం-7 కుట్ర: బల్క్ దరఖాస్తులపై ఎన్నికల సంఘం కొరడా.. సెక్షన్ 31 కింద కేసులకు ఆదేశం

Bheemgal SI Tirupati | పీఎస్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం: ఎస్సై వేధింపులే కారణమంటూ వేముల ఫైర్.. రేపు 'భీమ్‌గల్ బంద్'కు పిలుపు

Justice PS Koshy Telangana High Court | హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ పీఎస్ కోషి: సుప్రీంకోర్టుకు జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్

Mehdipatnam GHMC Raid | జీహెచ్ఎంసీ ఆఫీసులో ఏసీబీ మెరుపు దాడి: 4 లక్షలు లంచం తీసుకుంటూ చిక్కిన టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్



