త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BJP Ramchandar Rao | రాష్ట్ర‌మంతా బీజేపీ శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోంది.. నెక్స్ట్‌ అధికారం మాదే

BJP Ramchandar Rao | అర్బ‌న్ న‌క్స‌లైట్లు దేశాన్ని విడ‌గొట్టాల‌ని చూస్తున్నార‌ని.. వారి వ‌ల్లే దేశ ఐక్య‌త‌కు, స‌మ‌గ్ర‌త‌కు తీవ్ర ముప్పు పొంచి ఉంద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఎన్ని శ‌క్తులొచ్చినా భార‌త్‌ను విడ‌గొట్ట‌లేర‌న్నారు. ఇప్ప‌టికే ఎంతోమంది విదేశీయులు భార‌త్‌ను పాలించినా ఇక్క‌డి సంస్కృతిని ఏం చేయ‌లేక‌పోయార‌ని నొక్కి చెప్పారు.

S

Telangana | Published On Jul 28, 2026, 3.45 pm IST

BJP Ramchandar Rao | రాష్ట్ర‌మంతా బీజేపీ శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోంది.. నెక్స్ట్‌ అధికారం మాదే
Advertisement
  • అర్బన్ నక్సలైట్లు దేశాన్ని విడ‌గొట్టాల‌ని చూస్తున్న‌రు.. వారితోనే దేశ సమగ్రతకు ముప్పు ఉంది
  • భార‌త్‌ను ముక్క‌లు చేయ‌డం ఎవ‌రిత‌రం కాదు
  • ఎంతమంది విదేశీయులు భార‌త్‌ను పాలించినా ఇక్క‌డి సంస్కృతిని ఏం చేయ‌లేక‌పోయారు
  • కాంగ్రెస్-ఎంఐఎం అక్రమ ఓటు బ్యాంక్ కుట్రలను తిప్పికొడ‌తాం
  • హుజూర్‌న‌గ‌ర్ సంఘ్ ప‌రివార్ ఆత్మీయ స‌మ్మేళ‌నంలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు వ్యాఖ్య‌లు

BJP Ramchandar Rao | త్రినేత్ర‌.న్యూస్‌: అర్బ‌న్ న‌క్స‌లైట్లు దేశాన్ని విడ‌గొట్టాల‌ని చూస్తున్నార‌ని.. వారి వ‌ల్లే దేశ ఐక్య‌త‌కు, స‌మ‌గ్ర‌త‌కు తీవ్ర ముప్పు పొంచి ఉంద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఎన్ని శ‌క్తులొచ్చినా భార‌త్‌ను విడ‌గొట్ట‌లేర‌న్నారు. ఇప్ప‌టికే ఎంతోమంది విదేశీయులు భార‌త్‌ను పాలించినా ఇక్క‌డి సంస్కృతిని ఏం చేయ‌లేక‌పోయార‌ని నొక్కి చెప్పారు. తెలంగాణ అంతా బీజేపీ శ‌ర‌వేగంగా విస్త‌రిస్తుంద‌ని.. భ‌విష్య‌త్‌లో అధికారం మాదేన‌న్నారు. కాంగ్రెస్-ఎంఐఎం అక్ర‌మ ఓటు బ్యాంక్ కుట్ర‌ల‌ను ఉపేక్షించ‌మ‌ని హెచ్చ‌రించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో మంగ‌ళ‌వారం నిర్వహించిన సంఘ్ పరివార్ అనుబంధ సంస్థల ఆత్మీయ సమ్మేళనంలో ఆయ‌న పాల్గొని ప్రసంగించారు.

మొఘలుల నుంచి బ్రిటిషర్ల వరకు ఎన్నో దండయాత్రలు జరిగాయి. అయినా భారతీయ సంస్కృతిని గానీ, సనాతన ధర్మాన్ని గానీ ఏ శక్తి నాశనం చేయలేకపోయింది. కాలక్రమేణా అనేక ప్రాచీన నాగరికతలు కనుమరుగైనప్పటికీ దృఢమైన ఆధ్యాత్మిక, నాగరిక విలువల పునాదులపై భారత్ అచంచలంగా నిలిచింది. విదేశీ నిధులతో పనిచేసే సంస్థల ద్వారా దేశంలో అశాంతి, అస్థిరత సృష్టించేందుకు మరోసారి కుట్రలు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘నేషన్ ఫస్ట్’ సిద్ధాంతంతో బీజేపీ ముందుకు సాగుతోంది. పార్టీలో కొత్తగా చేరే వారిని పార్టీ కార్యకర్తలు సాదరంగా ఆహ్వానించి, పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను వివరించాలి అని కార్య‌క‌ర్త‌ల‌కు, నాయ‌కులకు సూచించారు.

కాంగ్రెస్-MIM అక్రమ ఓటు బ్యాంక్ కుట్రలను ఉపేక్షించేది లేదు. బంగ్లాదేశీయులు, రోహింగ్యాల ఓట్లను కాపాడేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం MIM ఆదేశాలకు లొంగిపోయింది. ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ల పేరుతో అక్రమ చొరబాటుదారులను ఓటర్ల జాబితాలో చేర్చే యత్నం త‌గ‌దు అని ఆయ‌న హెచ్చ‌రించారు.

పలువురు సీనియర్ సంఘ్ పరివార్ కార్యకర్తలను చూసినప్పుడు నా ఏబీవీపీ రోజుల నాటి మధుర జ్ఞాపకాలతో పాటు, నా ప్రజా జీవిత ప్రయాణంలోని ఎన్నో సందర్భాలు గుర్తుకొచ్చాయి. దక్షిణ తెలంగాణతో సహా రాష్ట్రమంతటా బీజేపీ శరవేగంగా విస్తరిస్తోంది. తెలంగాణలో తదుపరి ప్రభుత్వం బీజేపీదే. మాతృభూమి సేవలో సంఘ్ పరివార్ కార్యకర్తలు ప్రదర్శిస్తున్న అసాధారణ అంకితభావం, నిస్వార్థ సేవ తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. జాతీయ పునర్నిర్మాణం పట్ల వారి అచంచల నిబద్ధతే మన సంస్థకు నిజమైన బలం అని రాంచంద‌ర్‌రావు పేర్కొన్నారు.

ఈ సమ్మేళనంలో శ్రీ శాంతికుమార్ గారితో పాటు పలువురు సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement