Mallikarjun Kharge | నేను తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు అమిత్ షా చిన్న పిల్లాడు.. మీరా మాకు దేశభక్తి పాఠాలు చెప్పేది..? ఖర్గే
Mallikarjun Kharge | తాను తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయానికి అమిత్ షా (Amit Shah) ఇంకా చిన్నపిల్లాడని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తెలిపారు. ఇప్పుడు ఆయన మాకు దేశభక్తి గురించి పాఠాలు చెబుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు.
Mallikarjun Kharge | త్రినేత్ర.న్యూస్ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)పై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయానికి అమిత్ షా ఇంకా చిన్నపిల్లాడని తెలిపారు. అలాంటిది ఇప్పుడు ఆయనా తమకు దేశభక్తి గురించి పాఠాలు చెప్పేది..? అంటూ విమర్శలు గుప్పించారు. స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ నేతల పాత్రను ఈ సందర్భంగా ఖర్గే ప్రస్తావించారు. దేశభక్తి గురించి తమకు పాఠాలు చెప్పే హక్కు బీజేపీకి లేదని వ్యాఖ్యనించారు. గోవాలో జరిగిన ఒక బహిరంగ సభలో ఖర్గే మాట్లాడారు. "మా నాయకురాలు సోనియా గాంధీ, గాంధీ కుటుంబంపై అమిత్ షా విమర్శలు చేస్తున్నారు. నేను తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు అమిత్ షా ఒక చిన్న పిల్లాడు. ఇప్పుడు ఆయన మాకు దేశభక్తి గురించి పాఠాలు చెబుతున్నారు" అని ఖర్గే వ్యాఖ్యానించారు.
కాగా, ఇటీవలే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సోనియా గాంధీ (Sonia Gandhi) వందేమాతర (Vande Mataram) గేయాలాపనను మధ్యలోనే ఆపారంటూ అమిత్ షా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షా వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆ సమయంలో ఖర్గే కోసం కుర్చీ తేవాలని మాత్రమే సోనియా కోరారని వివరించింది. జాతీయ గేయాన్ని పూర్తిగా ఆలపించినట్లు వెల్లడించింది. అయితే, ఈ వివాదంపై బీజేపీ తన విమర్శలను కొనసాగించడంతో ఖర్గే తాజాగా తీవ్ర స్థాయిలో స్పందించారు. అమిత్ షాను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.
"దేశ స్వాతంత్య్రం కోసం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పోరాడారు. మరి బీజేపీ, ఆర్ఎస్ఎస్ నుంచి ఏ నాయకుడు స్వాతంత్య్రం కోసం పోరాడారు..? మీరు దేశభక్తి గురించి మాకు పాఠాలు చెబుతున్నారా..? మేము దేశభక్తులం కాదని మీరు అంటున్నారు. నిజానికి మీరే దేశ వ్యతిరేకులు. నేను ఉత్తరాఖండ్‌లో లక్షలాది మంది ప్రజల ముందు ప్రసంగిస్తే.. ఆ ప్రదేశాన్ని పవిత్రం చేయడానికి రెండు రోజుల తర్వాత అక్కడ మీరు హవనం చేశారు. ఈ ఘటన దేశానికే సిగ్గు చేటుకాదా..? ఇది ఏ మతం బోధించే విలువ. నిజానికి మీరే అతిపెద్ద పాపాత్ములు. మొదట మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. కాంగ్రెస్ నాయకుల దేశభక్తిని ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీకి లేదు" అంటూ ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Also Read..
విరాళాల చోరీ కేసులో చంపత్ రాయ్‌కి సిట్ క్లీన్ చిట్
ఉరిశిక్షకు ప్రత్యామ్నాయం కోరుతూ పిటిషన్.. సుప్రీంకోర్టు ఏమన్నదంటే..?
ఎన్నికల నిర్వహణపై భారత్‌ను ఉదాహరణగా తీసుకోవాలి : అమెరికా అధ్యక్షుడు ట్రంప్
సంబంధిత వార్తలు

Ramchandar Rao | వందేమాతర గేయాన్ని అవమానించారు.. కాంగ్రెస్‌వాళ్లకు సిగ్గు మిగిలి ఉంటే క్షమాపణ చెప్పాలి
ఆగస్టు 17, 2026

Ponnam Prabhakar | ఎలక్ట్రిక్ ఆటోలు నడుపనున్న ఆర్టీసీ.. అది దుష్ప్రచారమేనన్న మంత్రి పొన్నం ప్రభాకర్
ఆగస్టు 17, 2026

Harish Rao | ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది.. ప్రచారం కాంగ్రెస్‌ది: హరీశ్ రావు
ఆగస్టు 17, 2026
తాజావార్తలు
- ●Peddi Sudarshan Reddy | కూల్చిన చోటే పెద్ది విగ్రహాన్ని పెట్టాలి : బీఆర్ఎస్ నేతల డిమాండ్
- ●Ram Temple Donation Theft Case | విరాళాల చోరీ కేసులో చంపత్ రాయ్‌కి సిట్ క్లీన్ చిట్
- ●Niranjan Reddy | బీఆర్ఎస్ను చూస్తే కాంగ్రెస్ సర్కార్‌కు వణుకు : నిరంజన్ రెడ్డి
- ●Harish Rao | దరఖాస్తులు లేకుండా ఎట్లయితే నిషేధిత జాబితాలో చేర్చారో.. అట్లనే ఆ భూములను తొలగించాలే
- ●Peddi Sudarshan Reddy | 1500 మంది పోలీసుల పహారా మధ్య పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు
- ●Dhruv Vikram | అనుపమ పరమేశ్వరన్ ఆరోపణలపై ధ్రువ్ విక్రమ్ క్లారిటీ - విమర్శలు ఏం చేయలేవంటూ కామెంట్స్

Peddi Sudarshan Reddy | కూల్చిన చోటే పెద్ది విగ్రహాన్ని పెట్టాలి : బీఆర్ఎస్ నేతల డిమాండ్

Ram Temple Donation Theft Case | విరాళాల చోరీ కేసులో చంపత్ రాయ్‌కి సిట్ క్లీన్ చిట్

Niranjan Reddy | బీఆర్ఎస్ను చూస్తే కాంగ్రెస్ సర్కార్‌కు వణుకు : నిరంజన్ రెడ్డి

Harish Rao | దరఖాస్తులు లేకుండా ఎట్లయితే నిషేధిత జాబితాలో చేర్చారో.. అట్లనే ఆ భూములను తొలగించాలే



