Donald Trump | ఎన్నికల నిర్వహణపై భారత్‌ను ఉదాహరణగా తీసుకోవాలి : అమెరికా అధ్యక్షుడు ట్రంప్
Donald Trump | భారత ఎన్నికల వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రశంసలు కురిపించారు. భారత్‌లో ప్రతీ ఒక్కరి వద్దా కచ్చితంగా చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డు ఉంటుందని ప్రశంసించారు. కేవలం 1 శాతం కంటే తక్కువ మంది మాత్రమే మెయిల్ ద్వారా ఓటు వేశారని గుర్తు చేశారు. ఎన్నికల నిర్వహణపై భారత్‌ను ఉదాహరణగా తీసుకోవాలని కొనియాడారు.
International | Published On Aug 18, 2026, 11.48 am IST
Donald Trump | త్రినేత్ర.న్యూస్ : అమెరికా ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు తేవాలని, ఓటరు గుర్తింపు నిబంధనలను మరింత కఠినతరం చేయాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన భారత ఎన్నికల వ్యవస్థపై ప్రశంసలు కురిపించారు. భారత ఎన్నికల వ్యవస్థను ఆదర్శంగా తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. అమెరికా ఎన్నికల్లో ఓటు వేయడానికి చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డును (photo identification for voters) తప్పనిసరి చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందుకోసం 'సేవ్ అమెరికా యాక్ట్' (SAVE America Act) బిల్లును తక్షణమే ఆమోదించాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు.
ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్‌లో ట్రంప్ పోస్టు పెట్టారు. సరైన ఫొటో ఐడీ లేకుండా అమెరికాలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (Chief Election Commissioner) జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) ఇటీవలే తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు ట్రంప్ తెలిపారు. భారతదేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో 64.6 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారని చెప్పారు. భారత్‌లో ప్రతీ ఒక్కరి వద్దా కచ్చితంగా చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డు ఉంటుందని ప్రశంసించారు. కేవలం 1 శాతం కంటే తక్కువ మంది మాత్రమే మెయిల్ ద్వారా ఓటు వేశారని గుర్తు చేశారు. కానీ అమెరికాలో మెయిల్-ఇన్ ఓటింగ్ వివాదాస్పదంగా మారిందని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణపై భారత్‌ను ఉదాహరణగా తీసుకోవాలని కొనియాడారు. ఫెడరల్ ఎన్నికల్లో ఓటర్ల నమోదు, గుర్తింపు నిబంధనలను కఠినతరం చేసే లక్ష్యంతో రూపొందించిన 'ది సేవ్ అమెరికా యాక్ట్' (The Save America Act) చట్టాన్ని వెంటనే ఆమోదించాలని ట్రంప్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
Also Read..
సీఎం విజయ్ కొడుకు డెబ్యూ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ - వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాతో పోటీ!
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో భారీగా ఉద్యోగాలు.. వివరాలివే..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Road Accident | ఘోర ప్రమాదం.. 8 మంది కూలీలు మృతి
- ●Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు డెబ్యూ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ - వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాతో పోటీ!
- ●IOCL | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో భారీగా ఉద్యోగాలు.. వివరాలివే..
- ●Traffic Restrictions | ఇవాళ సాయంత్రం ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
- ●KBR Park | నేటి నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు.. రూట్ మ్యాప్ ఇదే
- ●Zodiac Signs | ఈ నాలుగు రాశుల వారు.. భర్తలను అదుపులో పెడుతారట..! మరి మీ రాశి ఉందా..?

Road Accident | ఘోర ప్రమాదం.. 8 మంది కూలీలు మృతి

Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు డెబ్యూ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ - వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాతో పోటీ!

IOCL | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో భారీగా ఉద్యోగాలు.. వివరాలివే..

Traffic Restrictions | ఇవాళ సాయంత్రం ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు






