Ponnam Prabhakar | ఎలక్ట్రిక్ ఆటోలు నడుపనున్న ఆర్టీసీ.. అది దుష్ప్రచారమేనన్న మంత్రి పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar | ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. త్వరలో ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆటో చార్జీల పెంపుపై ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.
Ponnam Prabhakar | త్రినేత్ర.న్యూస్: ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. త్వరలో ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆటో చార్జీల పెంపుపై ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ఎలక్ట్రిక్ ఆటోలను (Electric Autos) ఆర్టీసీ నడుపనుందనేది దుష్ప్రచారమే తప్ప అందులో వాస్తవం లేదని స్పష్టం చేశారు. మినిస్టర్ క్వార్టర్స్‌లో తెలంగాణ కేకేసీ యూనియన్ ప్రతినిధులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆటో కార్మికుల సమస్యలను ఇప్పటికే కేబినెట్‌లో చర్చించామన్నారు. త్వరలోనే రవాణా శాఖ తరఫున కార్మిక శాఖతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఆటో కార్మికుల సంక్షేమం కోసం హామీ ఇచ్చిన విధంగా వీలైనంత త్వరలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. చార్జీలను పెంచాలని ఆటో కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయన్నారు. చివరగా 2012లో ఆటో చార్జీలు పెరిగాయని, దాదాపు 14 ఏండ్లుగా పెంపు జరగలేదని చెప్పారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వాహనాల ధరలు, నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఆటో కార్మికుల ఇబ్బందులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని వెల్లడించారు. అయితే ప్రయాణికులపై అదనపు భారం పడకుండా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి చార్జీల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.
ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలపై దుష్ప్రచారం చేయొద్దు
ఆర్టీసీ తరఫున ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేసి ఆర్టీసీనే ఆటోలు నడుపుతుందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. ఆటో కార్మికుల ఉపాధిని దెబ్బతీసేలా ఆర్టీసీకి ఎలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేయదన్నారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ, రైల్వే, మెట్రో వంటి ప్రజా రవాణా వ్యవస్థలను పరస్పరం అనుసంధానం చేసి ప్రయాణికులకు ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి తిరిగి ఇంటికి చేరే వరకు సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థను రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఆర్టీసీ రైళ్లు కొనుగోలు చేయదని, రైల్వే సంస్థలు ఆటోలు కొనుగోలు చేయవని, అదే విధంగా ఆర్టీసీ కూడా ఆటోల కొనుగోలుకు వెళ్లదని స్పష్టం చేశారు.
ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు..
ఆటో కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం వినియోగంలో ఉన్న పెట్రోల్, డీజిల్ ఆటోలను రెట్రో ఫిట్‌మెంట్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ఒక్కో ఆటోకు రూ.1.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. ఆటో కార్మికులకు మరింత మేలు చేసేలా త్వరలోనే శుభవార్త చెబుతామని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ఆటో కార్మికుల ఉపాధికి పూర్తి రక్షణగా ప్రభుత్వం ఉంటుందని స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

Harish Rao | ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది.. ప్రచారం కాంగ్రెస్‌ది: హరీశ్ రావు
ఆగస్టు 17, 2026

Chinnareddy | తప్పుడుగాండ్లను పార్టీ నుంచి బయటకు పంపాలి.. లేదంటే నేను మరో జీవన్ రెడ్డి కావాల్సివస్తది: చిన్నారెడ్డి
ఆగస్టు 17, 2026

Ponnam Prabhakar | జాతీయ జనగణనలో బీసీలు ఏరి? 40 ప్రశ్నల్లో ఓబీసీ కాలమ్ తొలగింపుపై కేంద్రంపై మంత్రి పొన్నం ఫైర్
ఆగస్టు 16, 2026
తాజావార్తలు
- ●Harish Rao | ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది.. ప్రచారం కాంగ్రెస్‌ది: హరీశ్ రావు
- ●Anil Ravipudi | రామాయణం ఆధారంగా అనిల్ రావిపూడి సినిమా - జననాయగన్ మేకర్స్‌తో డీల్
- ●e-rickshaw battery blast | ఈ రిక్షా బ్యాటరీ పేలి భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి
- ●Gold And Silver Prices Today | మళ్లీ పరుగులు పెడుతున్న పసిడి.. పెట్టుబడిదారుల ఆసక్తి..
- ●Chinnareddy | తప్పుడుగాండ్లను పార్టీ నుంచి బయటకు పంపాలి.. లేదంటే నేను మరో జీవన్ రెడ్డి కావాల్సివస్తది: చిన్నారెడ్డి
- ●IPO | ఈ వారంలో ఐపీఓల జోరు.. రూ.6,400 కోట్లకు పైగా ఇష్యూలు..

Harish Rao | ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది.. ప్రచారం కాంగ్రెస్‌ది: హరీశ్ రావు

Anil Ravipudi | రామాయణం ఆధారంగా అనిల్ రావిపూడి సినిమా - జననాయగన్ మేకర్స్‌తో డీల్

e-rickshaw battery blast | ఈ రిక్షా బ్యాటరీ పేలి భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి

Gold And Silver Prices Today | మళ్లీ పరుగులు పెడుతున్న పసిడి.. పెట్టుబడిదారుల ఆసక్తి..



