Supreme Court | ఉరిశిక్షకు ప్రత్యామ్నాయం కోరుతూ పిటిషన్.. సుప్రీంకోర్టు ఏమన్నదంటే..?
Supreme Court | అత్యంత క్రూరమైన నేరాల్లో దోషులుగా తేలిన వారికి న్యాయస్థానాలు విధించే ఉరిశిక్ష (death by hanging) అత్యంత బాధాకరంగా ఉంటోందని.. అందుకు ప్రత్యామ్నాయంగా తక్కువ వేదన కలిగించే పద్ధతులను అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు (Supreme Court)లో పిల్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. ఉరి తీయడం బాధాకరమైనదే అయినప్పటికీ, ప్రస్తుతానికి ఈ పద్ధతిలోనే శిక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
Supreme Court | త్రినేత్ర.న్యూస్ : అత్యంత క్రూరమైన నేరాల్లో దోషులుగా తేలిన వారికి న్యాయస్థానాలు మరణశిక్ష (death by hanging) విధిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఖైదీలను ఉరి తీసే ప్రక్రియ అత్యంత బాధాకరంగా ఉంటోందని.. అందుకు ప్రత్యామ్నాయంగా తక్కువ వేదన కలిగించే పద్ధతులను అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు (Supreme Court)లో పిల్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఉరి తీయడం బాధాకరమైనదే అయినప్పటికీ, ప్రస్తుతానికి ఈ పద్ధతిలోనే శిక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉరిశిక్షకు ప్రత్యామ్నాయ పద్ధతులను అమలు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది.
ఉరిశిక్షకు ప్రత్యామ్నాయంగా ప్రాణాంతక ఇంజెక్షన్ (lethal injection), షూటింగ్, విద్యుదాఘాతం లేదా గ్యాస్ ఛాంబర్ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను పరిశీలించాలని కోరుతూ న్యాయవాది రిషి మల్హోత్రా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇలాంటి పద్ధతుల ద్వారా దోషి కేవలం కొన్ని నిమిషాల్లోనే మరణించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఉరిశిక్ష అత్యంత బాధాకరమైన, అమానుషం, క్రూరమైనదిగా పేర్కొన్నారు. అందుకే ఉరిశిక్ష విధించడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద గౌరవప్రదమైన మరణం పొందే హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించాలని పిటిషనర్ కోరారు. ఉరిశిక్ష తర్వాత వ్యక్తి మరణించినట్లు నిర్ధారించడానికి దాదాపు 40 నిమిషాల సమయం పడుతోందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అదే షూటింగ్, ప్రాణాంతక ఇంజెక్షన్ పద్ధతిలో శిక్ష అమలు చేస్తే కేవలం 5 నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక మండలి (UN ECOSOC) ఆమోదించిన తీర్మానాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. మరణశిక్షను అమలు చేయాల్సి వస్తే, ఆ ప్రక్రియ నిందితుడికి సాధ్యమైనంత తక్కువ శారీరక, మానసిక వేదనను కలిగించేలా, త్వరగా ముగిసేలా ఉండాలని మల్హోత్రా స్పష్టం చేశారు.
అయితే పిటిషనర్ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఉరి తీయడం బాధాకరమైనదే అయినప్పటికీ, ప్రస్తుతానికి ఈ పద్ధతిలోనే శిక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే ఈ విషయంలో తమ తీర్పు అంతిమం కాదని తెలిపింది. మరణశిక్ష అమలుకు ప్రత్యామ్నాయ పద్ధతులపై బలమైన శాస్త్రీయ ఆధారాలు లభిస్తే భవిష్యత్తులో ఈ అంశాన్ని మళ్లీ ప్రస్తావించొచ్చని పేర్కొంది. శాస్త్రీయ విధానాల్లో మరణశిక్షను అమలు చేసే అంశంలో కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని స్వేచ్ఛగా తీసుకోవచ్చు అని కోర్టు అభిప్రాయపడింది.
Also Read..
ఘోర ప్రమాదం.. 8 మంది కూలీలు మృతి
ఎన్నికల నిర్వహణపై భారత్‌ను ఉదాహరణగా తీసుకోవాలి : అమెరికా అధ్యక్షుడు ట్రంప్
సీఎం విజయ్ కొడుకు డెబ్యూ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ - వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాతో పోటీ!
సంబంధిత వార్తలు

Ram Temple Donations Case | రామ మందిరం విరాళాల దుర్వినియోగంపై దర్యాప్తు వేగవంతం చేయాలి
ఆగస్టు 17, 2026

Supreme Court | ఎఫ్ఎస్ఎస్ఏఐపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం.. ప్రజారోగ్యంపై పట్టింపు లేదని విమర్శలు..
ఆగస్టు 14, 2026

Supreme Court | ఉప్పు..చక్కెర.. ఫ్యాట్ ఎంతుందో.. జనానికి తెలిసేలా డిస్ ప్లే చేయండి? ప్యాకేజ్డ్ ఫుడ్ అంశంలో కేంద్రానికి సుప్రీం అల్టిమేటం
ఆగస్టు 13, 2026
తాజావార్తలు
- ●Road Accident | ఘోర ప్రమాదం.. 8 మంది కూలీలు మృతి
- ●Donald Trump | ఎన్నికల నిర్వహణపై భారత్‌ను ఉదాహరణగా తీసుకోవాలి : అమెరికా అధ్యక్షుడు ట్రంప్
- ●Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు డెబ్యూ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ - వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాతో పోటీ!
- ●IOCL | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో భారీగా ఉద్యోగాలు.. వివరాలివే..
- ●Traffic Restrictions | ఇవాళ సాయంత్రం ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
- ●KBR Park | నేటి నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు.. రూట్ మ్యాప్ ఇదే

Road Accident | ఘోర ప్రమాదం.. 8 మంది కూలీలు మృతి

Donald Trump | ఎన్నికల నిర్వహణపై భారత్‌ను ఉదాహరణగా తీసుకోవాలి : అమెరికా అధ్యక్షుడు ట్రంప్

Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు డెబ్యూ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ - వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాతో పోటీ!

IOCL | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో భారీగా ఉద్యోగాలు.. వివరాలివే..



