త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | దరఖాస్తులు లేకుండా ఎట్ల‌యితే నిషేధిత జాబితాలో చేర్చారో.. అట్లనే ఆ భూముల‌ను తొలగించాలే

Harish Rao | ద‌ర‌ఖాస్తులు లేకుండానే ఎట్ల‌యితే నిషేధిత జాబితాలో భూముల‌ను చేర్చారో.. అట్ల‌నే వాటిని తొల‌గించాల‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రిశ్‌రావు డిమాండ్ చేశారు. ప్ర‌భుత్వం చేసిన త‌ప్పుకు ప్ర‌జ‌ల‌కు శిక్ష ఎందుక‌ని ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Aug 18, 2026, 1.02 pm IST

Harish Rao | దరఖాస్తులు లేకుండా ఎట్ల‌యితే నిషేధిత జాబితాలో చేర్చారో.. అట్లనే ఆ భూముల‌ను తొలగించాలే
Advertisement
  • సారీ చెప్తే నేరం మాఫీ అయిపోతుందా? త‌ప్పుకు శిక్ష ప‌డాల్నా వ‌ద్దా?
  • పొంగులేటి.. నువ్‌ త‌క్ష‌ణ‌మే మంత్రి ప‌ద‌వికి రాజీనామా చెయ్‌
  • మల్కాజ్‌గిరిలో 22A నిషేధిత భూముల బాధితుల సభలో మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్‌

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్: ద‌ర‌ఖాస్తులు లేకుండానే ఎట్ల‌యితే నిషేధిత జాబితాలో భూముల‌ను చేర్చారో.. అట్ల‌నే వాటిని తొల‌గించాల‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రిశ్‌రావు డిమాండ్ చేశారు. ప్ర‌భుత్వం చేసిన త‌ప్పుకు ప్ర‌జ‌ల‌కు శిక్ష ఎందుక‌ని ప్ర‌శ్నించారు. చోరీ చేసి సారీ చెప్తే స‌రిపోద‌ని.. దానికి త‌గిన శిక్ష ప‌డాల‌న్నారు. మంత్రి పొంగులేటి ఉద్దేశ‌పూర్వకంగా చేసిన త‌ప్పుకు ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌లు ఆగ‌మ‌య్యార‌ని వాపోయారు. ఇది ముమ్మాటికీ 30 శాతం క‌మీష‌న్ గ‌వ‌ర్న‌మెంటే అని ధ్వ‌జ‌మెత్తారు.

30 శాతం క‌మీష‌న్ అడుగుతున్నార‌ట‌..

దొంగతనం చేసిన దొంగ దొరికిపోయాక.. సారీ చెబితే చేసిన నేరం మాఫీ అయిపోతుందా? తప్పుకు శిక్ష పడాల్నా వద్దా? ఈరోజు నువ్వు చేసిన ఉద్దేశపూర్వక తప్పుకు లక్షల మంది ప్రజలు ఆగమయ్యారు. నిషేధిత జాబితా నుంచి ఆస్తులను తొలగించాలంటే 30 శాతం కమీషన్ అడుగుతున్నారట.. ఇది ముమ్మాటికీ 30 పర్సెంట్ కమీషన్ గవర్నమెంట్. లక్షల మందిని ఆగం చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తక్షణమే నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.

పొంగులేటి బ్లాక్ చేయించారు..

2008లో ULC రద్దయిన తర్వాత, మళ్లీ ఇప్పుడు ఈ భూములను రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో ఎందుకు పెట్టారు? ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 7,500 జీవోలతో, మేడ్చల్ జిల్లాలో 6,000 జీవోలతో లక్షలాది ఆస్తులను అడ్డగోలుగా నిషేధిత జాబితాలో చేర్చారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు తన చేతిలోకి రావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా అధికారులను ఆదేశించి రాత్రికి రాత్రే ఈ ఆస్తులను బ్లాక్ చేయించారు. ఈ నిర్ణయంతో లక్షలాది అపార్ట్మెంట్లు, ఇళ్లు, ప్లాట్లను నిషేధిత జాబితాలో చేర్చి కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్య ప్రజలను ఆగం చేసింది.

కుక్క తోకను ఆడిస్తదా.. లేదంటే తోక కుక్కను ఆడిస్తదా?

పైగా ఆస్తులను 22A నుంచి తీయాలంటే, ల్యాండ్ డెవలప్మెంట్ కూడా తమకే అప్పజెప్పాలని బ్లాక్ మెయిల్ చేస్తూ కండిషన్లు పెడుతున్నారు. అసలు నిషేధిత జాబితాలో భూములను పెట్టాలని చెప్పింది ఎవరు? దీనికి బాధ్యులు ఎవరు? తక్షణమే తేల్చాలి. ప్రజల ఈ కష్టానికి కారణమైన మంత్రులు.. అధికారుల పేరు చెప్పి తప్పించుకుంటామంటే మేము చూస్తూ ఊరుకోం. కుక్క తోకను ఆడిస్తదా లేక తోక కుక్కను ఆడిస్తదా? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెబితేనే అధికారులు భూములను నిషేధిత జాబితాలో పెట్టారు తప్ప వాళ్లంతట వాళ్లు చేయలేదు అని హ‌రీశ్‌రావు ఆరోపించారు.

Advertisement
Advertisement