Peddi Sudarshan Reddy | కూల్చిన చోటే పెద్ది విగ్రహాన్ని పెట్టాలి : బీఆర్ఎస్ నేతల డిమాండ్
Peddi Sudarshan Reddy | నర్సంపేట దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపుపై బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, గండ్ర వెంకటరమణారెడ్డి, సత్యవతి రాథోడ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పెద్ది విగ్రహం కూల్చిన చోటనే మళ్లీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Peddi Sudarshan Reddy | త్రినేత్ర.న్యూస్ : నర్సంపేట దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపుపై బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, గండ్ర వెంకటరమణారెడ్డి, సత్యవతి రాథోడ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పెద్ది విగ్రహం కూల్చిన చోటనే మళ్లీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని రాత్రికి రాత్రే తొలగించారు. ఎలాంటి నోటుసులు లేకుండా విగ్రహాన్ని తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ కూల్చివేతలకు కాంగ్రెస్సే కారణం. కలెక్టర్, సీపీలకు విగ్రహ ఏర్పాటుపై ముందే సమాచారమిచ్చాం. భూ యజమాని విద్యాసాగర్ అనుమతితోనే విగ్రహ ఏర్పాటు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం పెద్ది అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించినపుడు విగ్రహాన్ని ఎందుకు కూలగొడుతారు? కాంగ్రెస్ నేతలకు సిగ్గుండాలి. విగ్రహాన్ని కూల్చిన చోటే పెట్టాలి. రేపు మేం నర్సంపేట వెళ్తున్నాం. నర్సంపేటలో ప్రతీ గ్రామంలో పెద్ది విగ్రహం ఏర్పాటు చేస్తాం. నర్సంపేట మెడికల్ కాలేజీకి పెద్ది పేరు పెట్టాలి. పెద్ది విగ్రహం యథాస్థానంలో పెట్టకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి.
- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ కూల్చివేతకు ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డే కారణం. పెద్ది విగ్రహం కూల్చి కాంగ్రెస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారు. తాత్కాలికంగా కాంగ్రెస్ నేతలు ఆనందం పొందుతుండవచ్చు.. కానీ కుమిలి కుమిలి ఏడవక తప్పదు. మాధవ రెడ్డి తన పుట్టిన రోజు నాడే పెద్ది విగ్రహాన్ని కూల్చి సంతోషపడొచ్చు. రాబోయే ఎన్నికల్లో ఆయనకు డిపాజిట్ కూడా రాదు. తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు పెద్ది పేరు చిరస్థాయిగా ఉంటుంది. ప్రైవేటు భూమిలో పెద్ది విగ్రహం పెడితే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నొప్పేమిటీ? ములుగులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా మంత్రి సీతక్క అబద్దాలు మాట్లాడారు. ములుగు అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో తేల్చుకోవడానికి సీతక్క బహిరంగ చర్చకు రావాలి. సీతక్క నోరు తెరిస్తే అబద్దాలే మాట్లాడుతోంది.
- మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
పెద్ది సుదర్శన్ రెడ్డి చరిత్ర లేని మనిషి కాదు. చనిపోయిన నేత విగ్రహం పెడితే కాంగ్రెస్ నేతలకు ఏం నొప్పి? అనవసరంగా శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నారు. విగ్రహాలు గౌరవంతో ఏర్పాటు చేస్తారు. అనుమతులు అవసరం లేదు. పెద్ది విగ్రహం అక్కడే ఏర్పాటు చేయకపోతే గ్రామగ్రామాన విగ్రహాలు ఏర్పాటు చేస్తాం.
- మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకట రమణా రెడ్డి
నర్సంపేటను మరోసారి సమస్యాత్మక ప్రాంతంగా మారుస్తున్నారు. పరిస్థితి చేయి దాటక ముందే ప్రభుత్వం స్పందించి పెద్ది విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలి.
- మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
పెద్ది సుదర్శన్ రెడ్డిని చనిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం వేధిస్తోంది. పేలని తుపాకులతో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఇప్పుడు పెట్టిన విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహ కూల్చివేత నర్సంపేట ప్రజలకు అవమానం. వెంటనే పెద్ది విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలి.
- కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై సతీశ్ రెడ్డి
సంబంధిత వార్తలు

Niranjan Reddy | బీఆర్ఎస్ను చూస్తే కాంగ్రెస్ సర్కార్కు వణుకు : నిరంజన్ రెడ్డి
ఆగస్టు 18, 2026

Harish Rao | దరఖాస్తులు లేకుండా ఎట్లయితే నిషేధిత జాబితాలో చేర్చారో.. అట్లనే ఆ భూములను తొలగించాలే
ఆగస్టు 18, 2026

Peddi Sudarshan Reddy | 1500 మంది పోలీసుల పహారా మధ్య పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు
ఆగస్టు 18, 2026
తాజావార్తలు
- ●Ram Temple Donation Theft Case | విరాళాల చోరీ కేసులో చంపత్ రాయ్కి సిట్ క్లీన్ చిట్
- ●Niranjan Reddy | బీఆర్ఎస్ను చూస్తే కాంగ్రెస్ సర్కార్కు వణుకు : నిరంజన్ రెడ్డి
- ●Harish Rao | దరఖాస్తులు లేకుండా ఎట్లయితే నిషేధిత జాబితాలో చేర్చారో.. అట్లనే ఆ భూములను తొలగించాలే
- ●Peddi Sudarshan Reddy | 1500 మంది పోలీసుల పహారా మధ్య పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు
- ●Dhruv Vikram | అనుపమ పరమేశ్వరన్ ఆరోపణలపై ధ్రువ్ విక్రమ్ క్లారిటీ - విమర్శలు ఏం చేయలేవంటూ కామెంట్స్
- ●Supreme Court | ఉరిశిక్షకు ప్రత్యామ్నాయం కోరుతూ పిటిషన్.. సుప్రీంకోర్టు ఏమన్నదంటే..?

Ram Temple Donation Theft Case | విరాళాల చోరీ కేసులో చంపత్ రాయ్కి సిట్ క్లీన్ చిట్

Niranjan Reddy | బీఆర్ఎస్ను చూస్తే కాంగ్రెస్ సర్కార్కు వణుకు : నిరంజన్ రెడ్డి

Harish Rao | దరఖాస్తులు లేకుండా ఎట్లయితే నిషేధిత జాబితాలో చేర్చారో.. అట్లనే ఆ భూములను తొలగించాలే

Peddi Sudarshan Reddy | 1500 మంది పోలీసుల పహారా మధ్య పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు



