Ramchandar Rao | వందేమాతర గేయాన్ని అవమానించారు.. కాంగ్రెస్‌వాళ్లకు సిగ్గు మిగిలి ఉంటే క్షమాపణ చెప్పాలి
Ramchandar Rao | వందేమాతర గేయానికి జరిగిన అవమానాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని.. కాంగ్రెస్ నాయకుల్లో కనీసం కొంచెమైనా సిగ్గు మిగిలి ఉంటే బంకించంద్ర చట్టోపాధ్యాయ అమరాత్మకు క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్రా అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్ చేశారు.
- కేరళ అసెంబ్లీలో గేయాన్ని పాడలేదు
- కాంగ్రెస్ నాయకులకు దేశమంటే గౌరవం లేదు
- అడవి నక్సల్స్ పోయి దిమాగీ నక్సల్ తయారవుతున్నారు
- కాంగ్రెస్ పార్టీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తీవ్ర ఆరోపణలు
Ramchandar Rao | త్రినేత్ర.న్యూస్: వందేమాతర గేయానికి జరిగిన అవమానాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని.. కాంగ్రెస్ నాయకుల్లో కనీసం కొంచెమైనా సిగ్గు మిగిలి ఉంటే బంకించంద్ర చట్టోపాధ్యాయ అమరాత్మకు క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్రా అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. దేశ ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. వందేమాతరం ఆలపించే సమయంలో సోనియాగాంధీ ఆపమని అసహనం వ్యక్తం చేశారని ఆరోపించారు. కేరళ అసెంబ్లీలో కూడా వందేమాతరం పాడకపోవడం దేశాన్ని అవమానించడమేనన్నారు. సోమవారం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
స్వాతంత్య్ర దినోత్సవం నాడు కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో వందేమాతరం పట్ల కాంగ్రెస్ నాయకత్వం ప్రదర్శించిన వైఖరి తీవ్ర వేదనకు గురిచేసింది. వందేమాతరం ఆలపించే సమయంలో సోనియాగాంధీ ఆపమని చెప్పి అన్నారు. ఖర్గే, రాహుల్ గాంధీ అటు ఇటూ చూస్తా ఉన్నారు. దేశమంటే వీళ్లకు గౌరవం లేదు. నెహ్రూ కుటుంబం ఒక్కటే అనుకుంటరు వాళ్లు. వందేమాతరం గేయాన్ని అవమానించినందుకు కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలి.
కేరళ అసెంబ్లీలో వందేమాతం పాడకపోవడం అనేది దేశాన్ని అవమానించడమే. ఇది చాలా ఘోరమైన విషయం. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. అందుకే విద్యార్థులను రెచ్చగొడుతున్నరు. అడవిలో ఉంటే నక్సలైట్లు అయిపోయారు. ఇక అర్బన్ నక్సల్స్ తయారయ్యారు. దిమాగి నక్సల్ ఉన్నారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులను దేశ వ్యతిరేకులుగా తయారు చేస్తున్నారు. దేశ వ్యతిరేకంగా పని చేసే శక్తులను డెవలప్ చేస్తున్నరు అని రాంచందర్‌రావు ఆరోపించారు.
ఒక్క ఓబీసీ సీఎం కూడా లేరు..
కాంగ్రెస్ పార్టీ చారిత్రకంగా ఓబీసీ సమాజాన్ని మోసం చేస్తూనే వచ్చింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను పక్కనబెట్టి ముస్లిం రిజర్వేషన్లకు ప్రాధాన్యం ఇవ్వడం నుంచి, తెలంగాణలో బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయకపోవడం వరకు కాంగ్రెస్ వైఖరి అదే విధంగా కొనసాగుతోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తన పదవీకాలంలో ఒక్క ఓబీసీ అధికారిని కూడా సెక్రటరీ స్థాయిలో నియమించలేదు. ఈరోజు కాంగ్రెస్ పాలనలో ఉన్న నాలుగు రాష్ట్రాల్లో ఒక్క ఓబీసీ ముఖ్యమంత్రి కూడా లేరు.
మోదీ నాయకత్వంలో ఓబీసీ సమాజ సాధికారత కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. పీఎం విశ్వకర్మ యోజన నుంచి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు రాజ్యాంగబద్ధ హోదా కల్పించడం వరకు మోదీ ప్రభుత్వం ఓబీసీల సంక్షేమం, అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తోంది అని రాంచందర్‌రావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డా. కె. లక్ష్మణ్, తెలంగాణ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

Dasoju Sravan Kumar | నిన్ను కూల్చనీకి కేసీఆర్ అక్కర్లేదు.. నీకు నీవే కూల్చుకునే అసలైన భస్మాసురుడివి నువ్
ఆగస్టు 17, 2026

MCR TIMS | బిగ్ డే.. తెలంగాణ వైద్య ఆరోగ్య రంగంలో చారిత్రాత్మక మైలురాయి: మంత్రి దామోదర
ఆగస్టు 17, 2026

Draft Voter List | నేడు ముసాయిదా ఓటర్ల జాబితా.. 92 లక్షల మందికి నోటీసులు!
ఆగస్టు 17, 2026
తాజావార్తలు
- ●Malavika Sharma | బీఫ్ ఇష్టమా? - మలయాళ మూవీ ప్రమోషన్స్‌లో టాలీవుడ్ హీరోయిన్‌కు ప్రశ్న - నెటిజన్లు ఫైర్
- ●Air India | మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు డ్రగ్స్ పాజిటివ్
- ●MLC Ramana | అర్హులైన చేనేత కార్మికులకు చేయూత పెన్షన్ ఇవ్వండి..: ఎల్ రమణ
- ●Ravi Teja | ఇవేం బూతులు బాబోయ్ - ఇరుముడి ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై నెటిజన్ల ట్రోల్స్
- ●Dasoju Sravan Kumar | నిన్ను కూల్చనీకి కేసీఆర్ అక్కర్లేదు.. నీకు నీవే కూల్చుకునే అసలైన భస్మాసురుడివి నువ్
- ●Rahul Gandhi | తప్పులు ఎన్టీఏ చేస్తే.. శిక్ష మాత్రం విద్యార్థులు అనుభవిస్తున్నారు.. మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్

Malavika Sharma | బీఫ్ ఇష్టమా? - మలయాళ మూవీ ప్రమోషన్స్‌లో టాలీవుడ్ హీరోయిన్‌కు ప్రశ్న - నెటిజన్లు ఫైర్

Air India | మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు డ్రగ్స్ పాజిటివ్

MLC Ramana | అర్హులైన చేనేత కార్మికులకు చేయూత పెన్షన్ ఇవ్వండి..: ఎల్ రమణ

Ravi Teja | ఇవేం బూతులు బాబోయ్ - ఇరుముడి ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై నెటిజన్ల ట్రోల్స్





