త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dhruv Vikram | అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఆరోప‌ణ‌ల‌పై ధ్రువ్ విక్ర‌మ్ క్లారిటీ – విమ‌ర్శ‌లు ఏం చేయ‌లేవంటూ కామెంట్స్‌

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో బ్రేక‌ప్‌పై కోలీవుడ్ యంగ్ హీరో ధృవ్ విక్ర‌మ్ రియాక్ట్ అయ్యాడు. విఫ‌ల ప్రేమ త‌న‌ను ఎంత‌గానో బాధ‌పెట్టింద‌ని అన్నాడు. నిజం వైపే నిల‌బ‌డిన‌ప్పుడు విమ‌ర్శ‌లు ఏం చేయ‌లేవ‌ని పేర్కొన్నాడు. అత‌డు చేసిన కామెంట్లు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

N

Entertainment | Published On Aug 18, 2026, 12.48 pm IST

Dhruv Vikram | అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఆరోప‌ణ‌ల‌పై ధ్రువ్ విక్ర‌మ్ క్లారిటీ – విమ‌ర్శ‌లు ఏం చేయ‌లేవంటూ కామెంట్స్‌
Advertisement

Dhruv Vikram | చియాన్ విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ విక్ర‌మ్‌,హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బ్రేక‌ప్ రూమ‌ర్లు గ‌త కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. ధృవ్ విక్ర‌మ్‌పై అనుప‌మ ఇటీవ‌ల సంచ‌ల‌న‌ ఆరోప‌ణ‌లు చేసింది. ఈ కోలీవుడ్ హీరో పేరు చెప్ప‌కుండా రెండేళ్లు త‌న‌కు న‌ర‌కం చూపించాడ‌ని కామెంట్లు చేసింది. అత‌డిలో ప్రేమ‌లో ఉన్న‌ ప్ర‌తి రోజు భ‌యంగానే బ‌తికాన‌ని, సినిమాల ప్ర‌మోష‌న్స్‌కు కూడా త‌న‌ను అనుమ‌తించ‌లేదంటూ చెప్పింది.

బాధ‌పెట్టింది...

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఆరోప‌ణ‌ల‌పై ఓ త‌మిళ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ధృవ్ విక్ర‌మ్ రియాక్ట్ అయ్యారు. బ్రేక‌ప్‌ త‌న‌ను ఎంత‌గానో బాధ‌పెట్టింద‌ని అన్నాడు. సినిమా ఇండ‌స్ట్రీలో ఉన్న‌ప్పుడు విమ‌ర్శ‌లు స‌హ‌జ‌మ‌ని త‌న‌కు తాను స‌ర్ధిచెప్పుకున్నాన‌ని చెప్పాడు.

నిజం వైపే నిల‌బ‌డ్డా...

"బ్రేక‌ప్ త‌ర్వాత గ‌త కొన్ని నెల‌ల కాలం ఎంతో క‌ష్టంగా గ‌డిచింది. విఫ‌ల ప్రేమ తాలూకు ప్ర‌భావం నా వ్య‌క్తిగ‌త జీవితంపై చాలానే ప‌డింది. ఈ క‌ష్ట‌కాలంలో కుటుంబం నాకు అండ‌గా నిలిచింది. వారు అందించిన ధైర్యం వ‌ల్లే బ్రేక‌ప్ బాధ నుంచి మెల్ల‌మెల్ల‌గా బ‌య‌ట‌ప‌డ్డా. సెలిబ్రిటీల జీవితంపై ప్ర‌తి ఒక్క‌రికి ఆస‌క్తి ఉంటుంది. ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన‌ప్పుడే ఈ విష‌యాన్ని అర్థం చేసుకున్నా. బ్రేక‌ప్ త‌ర్వాత వ‌చ్చిన విమ‌ర్శ‌లు నాపై ప్ర‌భావాన్ని చూపించ‌లేద‌ని అన‌ను. మ‌న‌లో నిజాయితీ ఉన్న‌ప్పుడు ...నిజం వైపే నిల‌బ‌డిన‌ప్పుడు ఏ విమ‌ర్శ న‌న్ను ఏం చేయ‌లేదు. వాటి ప్ర‌భావం నాపై కొంతే ఉంటుంద‌ని తెలుసుకున్నా" అని ధృవ్ విక్ర‌మ్ పేర్కొన్నాడు.

ప్రేమించే వారిని....

"ఈ బ్రేక‌ప్ కార‌ణంగా న‌న్ను నేను ఎక్కువ‌గా అర్థం చేసుకున్నా. జీవితంలో కొన్నిసార్లు అనూహ్య ప‌రిణామాలు ఎదురైన‌ప్పుడు ఎలా ధైర్యంగా నిల‌బ‌డాలో నేర్చుకున్నా. మ‌నం ప్రేమించే వారిని, ముఖ్య‌మ‌ని అనిపించే ప్ర‌తి విష‌యాన్ని కాపాడుకోవాల‌ని తెలుసుకున్నా" అని ధృవ్ విక్ర‌మ్ చెప్పాడు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో బ్రేక‌ప్‌ను ఉద్దేశించే ధృవ్ విక్ర‌మ్ ఈ కామెంట్లు చేశాడ‌ని నెటిజ‌న్లు చెబుతోన్నారు.

బైస‌న్ మూవీ...

ధృవ్ విక్ర‌మ్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌లిసి బైస‌న్ సినిమా చేశారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ త‌మిళ‌ మూవీతోనే ధృవ్ విక్ర‌మ్ హీరోగా తొలి క‌మ‌ర్షియ‌ల్ హిట్టును అందుకున్నాడు.

 

Advertisement
Advertisement