Peddi Sudarshan Reddy | 1500 మంది పోలీసుల పహారా మధ్య పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు
Peddi Sudarshan Reddy | నర్సంపేట దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని పోలీసులు తొలగించారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు 1500 మంది పోలీసుల పహారా మధ్య విగ్రహాన్ని తొలగించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Peddi Sudarshan Reddy | త్రినేత్ర.న్యూస్ : నర్సంపేట దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని పోలీసులు తొలగించారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు 1500 మంది పోలీసుల పహారా మధ్య విగ్రహాన్ని తొలగించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విగ్రహాన్ని తొలగించడంతో పాటు ఆ ప్రాంతాన్నంతా చదును చూశారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ తొలగింపు నేపథ్యంలో నర్సంపేట వ్యాప్తంగా అన్ని మండలాల్లో బిఆర్ఎస్ ముఖ్యనేతలను ముందస్తు అరెస్టులు చేశారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా.. నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసులు భారీగా మోహరించారు. నల్లబెల్లిలోని పెద్ది నివాసం చుట్టూ 400 మంది పోలీసుల మోహరించారు.
ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా ఖానాపూర్ మండలం అశోక్ నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. మరోవైపు జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ భాస్కర్, నన్నపనేని నరేందర్ సహా ఉమ్మడి జిల్లా ముఖ్యనేతలు, విద్యార్థి నాయకులను ముందస్తు అరెస్టులు చేసి, గృహ నిర్బంధం చేశారు.
సంబంధిత వార్తలు

Vinod Kumar | అమీర్‌పేటలో ఎన్టీఆర్ విగ్రహానికి అనుమతి ఉందా..? : మాజీ ఎంపీ వినోద్
ఆగస్టు 18, 2026

Peddi Sudarshan Reddy | కూల్చిన చోటే పెద్ది విగ్రహాన్ని పెట్టాలి : బీఆర్ఎస్ నేతల డిమాండ్
ఆగస్టు 18, 2026

Niranjan Reddy | బీఆర్ఎస్ను చూస్తే కాంగ్రెస్ సర్కార్‌కు వణుకు : నిరంజన్ రెడ్డి
ఆగస్టు 18, 2026
తాజావార్తలు
- ●Peddi Sudarshan Reddy | కూల్చిన చోటే పెద్ది విగ్రహాన్ని పెట్టాలి : బీఆర్ఎస్ నేతల డిమాండ్
- ●Ram Temple Donation Theft Case | విరాళాల చోరీ కేసులో చంపత్ రాయ్‌కి సిట్ క్లీన్ చిట్
- ●Niranjan Reddy | బీఆర్ఎస్ను చూస్తే కాంగ్రెస్ సర్కార్‌కు వణుకు : నిరంజన్ రెడ్డి
- ●Harish Rao | దరఖాస్తులు లేకుండా ఎట్లయితే నిషేధిత జాబితాలో చేర్చారో.. అట్లనే ఆ భూములను తొలగించాలే
- ●Dhruv Vikram | అనుపమ పరమేశ్వరన్ ఆరోపణలపై ధ్రువ్ విక్రమ్ క్లారిటీ - విమర్శలు ఏం చేయలేవంటూ కామెంట్స్
- ●Supreme Court | ఉరిశిక్షకు ప్రత్యామ్నాయం కోరుతూ పిటిషన్.. సుప్రీంకోర్టు ఏమన్నదంటే..?

Peddi Sudarshan Reddy | కూల్చిన చోటే పెద్ది విగ్రహాన్ని పెట్టాలి : బీఆర్ఎస్ నేతల డిమాండ్

Ram Temple Donation Theft Case | విరాళాల చోరీ కేసులో చంపత్ రాయ్‌కి సిట్ క్లీన్ చిట్

Niranjan Reddy | బీఆర్ఎస్ను చూస్తే కాంగ్రెస్ సర్కార్‌కు వణుకు : నిరంజన్ రెడ్డి

Harish Rao | దరఖాస్తులు లేకుండా ఎట్లయితే నిషేధిత జాబితాలో చేర్చారో.. అట్లనే ఆ భూములను తొలగించాలే



