Massive Fire | ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 20 మంది మృతి
Massive Fire | ఢిల్లీ (Delhi)లో ఘోర అగ్నిప్రమాదం (Massive Fire) చోటు చేసుకుంది. రెస్టారెంట్ (Delhi Restaurant)లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
Massive Fire | ఢిల్లీ (Delhi)లో ఘోర అగ్నిప్రమాదం (Massive Fire) చోటు చేసుకుంది. మాలవీయ నగర్ (Malviya Nagar) ప్రాంతంలోని ఓ రెస్టారెంట్ (Delhi Restaurant)లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది గాయపడ్డారు. దక్షిణ ఢిల్లీలోని హౌజ్ రాణి ప్రాంతంలో ఉన్న బహుళ అంతస్తుల 'లెమన్ గ్రీన్ రెస్టారెంట్'లో బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు, ఫైర్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 8:50 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. 9:45 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్ (DFS)కు సమాచారం అందింది. వెంటనే అగ్నిమాపక, సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సుమారు 10 ఫైర్ ఇంజన్లను రంగంలోకి దింపారు. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 11 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను అధికారులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ రెస్టారెంట్ హౌజ్ రాణిలోని ఇరుకైన వీధుల్లో ఉంటుంది. ఈ హోటల్‌లో సుమారు 25 గదులు ఉన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో అందులో 40 మంది ఉన్నట్లు స్థానికులు తెలిపారు. వారిలో ఎక్కువ మంది వైద్య చికిత్స కోసం భారత్‌కు వచ్చిన విదేశీయులేనని సమాచారం. తొలుత హోటల్ బేస్‌మెంట్‌లో మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది.
ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత సోమనాథ్ భారతి ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రమాదంలో భారీగా ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుల్లో ఎక్కువ మంది దక్షిణాఫ్రికా పౌరులు ఉన్నారని తెలిపారు. మరోవైపు అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
#WATCH | Delhi | Death toll rises to 10 in Malviya Nagar restaurant fire incident, say Delhi Police.
Visuals from the site pic.twitter.com/sfrzsMzJIm
— ANI (@ANI) June 3, 2026
Also Read..
ఫీజు భారీగా పెంచినా H-1B వీసాలకు తగ్గని డిమాండ్.. ఏడాదిలో 2 లక్షల దరఖాస్తులు
ట్రంప్ మరో బాంబ్.. భారత్‌పై 12.5 శాతం అదనపు సుంకాలకు ప్లాన్
గ్రాడ్యుయేషన్ వేడుకలో ప్రేయసికి పైలట్ ప్రపోజల్.. మోకాళ్లపై కూర్చొని
తాజావార్తలు
- ●Peddi Review | పెద్ది రివ్యూ - రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది - జాన్వీ కపూర్ మైనస్!
- ●Mumbai Water Crisis | ముంబై మహా నగరానికి ముంచుకొస్తున్న నీటి గండం? దారుణంగా పడిపోయిన నీటి మట్టాలు
- ●Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? 'పెద్ది' ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?
- ●DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!
- ●Raghunandan Rao | రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు: ఎంపీ రఘునందన్ రావు
- ●Foreigners’ Registration | ఆ పత్రాలు సమర్పించాల్సిందే.. ఇమ్మిగ్రేషన్ చట్టంపై పోలీసుల వార్నింగ్..!

Peddi Review | పెద్ది రివ్యూ - రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది - జాన్వీ కపూర్ మైనస్!

Mumbai Water Crisis | ముంబై మహా నగరానికి ముంచుకొస్తున్న నీటి గండం? దారుణంగా పడిపోయిన నీటి మట్టాలు

Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? 'పెద్ది' ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?

DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!






