Xiaomi 17T | షియోమీ 17టి ఎంట్రీ.. లైకా కెమెరా, 6500ఎంఏహెచ్ బ్యాటరీతో ఆకట్టుకునే ఫ్లాగ్‌షిప్..
Xiaomi 17T | భారత మార్కెట్లో తన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ శ్రేణిని మరింత విస్తరిస్తూ షియోమీ అధికారికంగా షియోమీ 17టిని విడుదల చేసింది. ఇమేజింగ్ ఫ్లాగ్‌షిప్‌గా తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రీమియం లైకా ఆప్టిక్స్, అధునాతన ఐ-కేర్ డిస్‌ప్లే, తదుపరి తరం సిలికాన్-కార్బన్ బ్యాటరీ టెక్నాలజీ వంటి ఫీచర్లను అందించింది. ఒక చేత్తో సులభంగా ఉపయోగించుకునేలా కాంపాక్ట్ డిజైన్‌లో దీనిని రూపొందించారు.
Technology | Published On Jun 6, 2026, 10.56 am IST
Xiaomi 17T | భారత మార్కెట్లో తన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ శ్రేణిని మరింత విస్తరిస్తూ షియోమీ అధికారికంగా షియోమీ 17టిని విడుదల చేసింది. ఇమేజింగ్ ఫ్లాగ్‌షిప్‌గా తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రీమియం లైకా ఆప్టిక్స్, అధునాతన ఐ-కేర్ డిస్‌ప్లే, తదుపరి తరం సిలికాన్-కార్బన్ బ్యాటరీ టెక్నాలజీ వంటి ఫీచర్లను అందించింది. ఒక చేత్తో సులభంగా ఉపయోగించుకునేలా కాంపాక్ట్ డిజైన్‌లో దీనిని రూపొందించారు. షియోమీ-లైకా భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూ, షియోమీ 17టిలో ఫోటోగ్రఫీకి పెద్దపీట వేసింది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉండగా ఇది లైకా అల్ట్రాప్యూర్ ఆప్టికల్ డిజైన్ ను కలిగి ఉంది. దీని వల్ల మెరుగైన లైట్ క్యాప్చర్, అధిక డిటెయిల్స్ ను తీసుకుంటుంది. ఈ తరం ముఖ్యమైన అప్‌గ్రేడ్‌గా 50 మెగాపిక్సెల్ లైకా 5ఎక్స్ టెలిఫోటో కెమెరాను ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తో అందించింది. ఈ కెమెరా 30 సెంటీమీటర్ల మాక్రో ఫోటోగ్రఫీ నుంచి 10ఎక్స్ ఆప్టికల్ గ్రేడ్ జూమ్ వరకు, అలాగే గరిష్టంగా 120ఎక్స్ ఏఐ అల్ట్రా జూమ్ వరకు మద్దతు ఇస్తుంది.
చిన్న కదలికలను సైతం రికార్డు చేస్తుంది..
కేవలం స్టిల్ ఫోటోలకే పరిమితం కాకుండా లైకా లైవ్ మొమెంట్ ఫీచర్‌ను అన్ని రియర్ కెమెరా ఫోకల్ లెంగ్త్‌లలో అందించింది. ఫోటో తీసే ముందు, తర్వాత జరిగే చిన్న కదలికలను కూడా ఇది రికార్డ్ చేసి సహజమైన క్షణాలను భద్రపరుస్తుంది. లైకా లైవ్ పోర్ట్రెయిట్ మోడ్ ద్వారా సహజమైన బొకే ఎఫెక్ట్‌ను అందిస్తూ సబ్జెక్ట్‌ను మరింత ఆకర్షణీయంగా చూపిస్తుంది. స్టేజ్ మోడ్ వంటి ప్రత్యేక సెట్టింగ్‌లతో కఠినమైన లైటింగ్ పరిస్థితుల్లో కూడా స్పష్టమైన ఫోటోలు, వీడియోలను క్యాప్చర్ చేయవచ్చు. షియోమీ 17టిలో కొత్తగా షియోమీ విజన్ కేర్ టెక్నాలజీని పరిచయం చేసింది. ఇది పరిసరాల వెలుతురుకు అనుగుణంగా డిస్‌ప్లే సెట్టింగ్‌లను స్వయంచాలకంగా సర్దుబాటు చేస్తుంది. బ్లూ లైట్, ఫ్లికర్, మోషన్ బ్లర్‌ను నియంత్రించడం ద్వారా కంటి అలసటను తగ్గిస్తుంది. ఈ కారణంగా ఈ ఫోన్‌కు టీయూవీ రైన్‌ల్యాండ్ ఇంటెలిజెంట్ ఐ కేర్ సర్టిఫికేషన్ లభించింది.
పవర్‌ఫుల్ డిస్‌ప్లే, ప్రాసెసర్..
ఈ ఫోన్‌లో 1.5కె అమోలెడ్ డిస్‌ప్లేను 120హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌తో అందించారు. గరిష్టంగా 3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉండటంతో ఔట్ డోర్‌లో కూడా స్పష్టమైన విజిబిలిటీ లభిస్తుంది. అల్ట్రా-స్లిమ్ బెజెల్స్‌తో స్క్రీన్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. డిజైన్ పరంగా మైక్రో-కర్వ్డ్ ఎడ్జ్‌లు, బ్రష్డ్ ఫినిష్ ఫ్రేమ్‌తో ప్రీమియం లుక్‌ను అందించింది. ఫోన్ వయొలెట్, బ్లూ, బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8500-అల్ట్రా చిప్‌సెట్ ఉంది. మల్టీటాస్కింగ్, గేమింగ్ వంటి భారీ పనులను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇది పనిచేస్తుంది. అధిక లోడ్ సమయంలో ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు షియోమీ 3డి ఐస్‌లూప్ సిస్టమ్ ను అందించారు. ఇది వేపర్-లిక్విడ్ సెపరేషన్ టెక్నాలజీతో వేడిని వేగంగా బయటకు పంపిస్తుంది.

భారీ బ్యాటరీ..
సన్నగా, తేలికగా ఉండే డిజైన్ ఉన్నప్పటికీ, షియోమీ 17టిలో 6500ఎంఏహెచ్ సామర్థ్యంతో భారీ బ్యాటరీని అందించారు. కొత్త సిలికాన్-కార్బన్ టెక్నాలజీ కారణంగా గత తరం కంటే 18 శాతం ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం ఇస్తుంది. 67వాట్ హైపర్‌చార్జ్ ఫాస్ట్ చార్జింగ్‌కు మద్దతు ఉండగా, 50వాట్ పీపీఎస్ చార్జింగ్ సపోర్ట్‌తో థర్డ్ పార్టీ చార్జర్‌లకు కూడా అనుకూలంగా పనిచేస్తుంది. ఈ ఫోన్ డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను ఇచ్చారు. 12జీబీ ర్యామ్ లభిస్తుంది. 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత షియోమీ హైపర్ ఓఎస్ 3ని ఇచ్చారు. ముందు వైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఆడియో కోసం డ్యుయల్ స్పీకర్లను ఇచ్చారు. వీటికి డాల్బీ అట్మోస్ సదుపాయం కూడా ఉంది. ఐపీ68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ లభిస్తుంది.
ధర వివరాలు..
షియోమీ 17టి ఫోన్‌కు చెందిన 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధరను రూ.59,999గా నిర్ణయించారు. ఆఫర్ కింద దీన్ని రూ.54,999కి విక్రయిస్తున్నారు. 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.64,999 ఉండగా, ప్రారంభ ఆఫర్ కింద రూ.59,999కి పొందవచ్చు. జూన్ 10 నుంచి ఈ ఫోన్‌ను ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్ ఇండియా, షియోమీ రిటెయిల్ స్టోర్స్‌లో విక్రయించనున్నారు. కొనుగోలుదారుల కోసం షియోమీ పలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ కార్డ్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, వన్‌కార్డ్ ద్వారా రూ.5వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. రూ.5వేల ఎక్స్చేంజ్ బోనస్, హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ద్వారా గరిష్టంగా రూ.5వేల క్యాష్‌బ్యాక్, 18 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ, జీరో డౌన్ పేమెంట్ ఫైనాన్స్ ఆప్షన్లు, ఒక సంవత్సరం తర్వాత ట్రేడ్-ఇన్ చేస్తే రూ.35,999 వరకు అషూర్డ్ బైబ్యాక్ విలువ, 4 నెలల స్పాటిఫై ప్రీమియం స్టాండర్డ్, 3 నెలల యూట్యూబ్ ప్రీమియం, 3 నెలల గూగుల్ ఏఐ ప్రో (5టీబీ క్లౌడ్ స్టోరేజ్‌తో), 3 నెలల జియోటీవీ ప్లస్ ట్రయల్ సబ్‌స్క్రిప్షన్ తదితర ఆఫర్లను ఈ ఫోన్‌తో అందిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Xiaomi TV S Mini LED Series | సినిమా థియేటర్ లాంటి ఎక్స్‌పీరియెన్స్‌తో.. బడ్జెట్ ధరలకే షియోమీ కొత్త టీవీలు..
ఏప్రిల్ 17, 2026

REDMI A7 Pro 5G | చవక ధరకే కొత్త 5జి ఫోన్‌ను లాంచ్ చేసిన షియోమీ.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
ఏప్రిల్ 13, 2026

Redmi Note 15 SE 5G | షియోమీ నుంచి రెడ్మీ నోట్ 15 స్పెషల్ ఎడిషన్ ఫోన్.. అదిరిపోయిన ఫీచర్లు..
ఏప్రిల్ 3, 2026
తాజావార్తలు
- ●Patriot Review | పేట్రియాట్ రివ్యూ - మమ్ముట్టి, మోహన్‌లాల్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
- ●Latha Rajinikanth | ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించిన లతా రజినీకాంత్.. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి..?
- ●Kavvampalli Satyanarayana | రెండో అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ పడిన లిఫ్ట్.. ఎమ్మెల్యే కవ్వంపల్లికి తప్పిన ముప్పు
- ●Post Office NSC | రూ.11 లక్షలు పెట్టుబడి.. వడ్డీగా రూ.5 లక్షలు పొందవచ్చు..
- ●Reels | రీల్స్‌కు బాగా అలవాటు పడ్డ జెన్ జీ తరం.. మెటా వెల్లడి..
- ●Trump Towers Hyderabad | ఆకాశాన్ని తాకేలా 64 అంతస్థులు.. కోకాపేటలో 'ట్రంప్ టవర్స్' అల్ట్రా-లగ్జరీ ఇండ్లు

Patriot Review | పేట్రియాట్ రివ్యూ - మమ్ముట్టి, మోహన్‌లాల్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?

Latha Rajinikanth | ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించిన లతా రజినీకాంత్.. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి..?

Kavvampalli Satyanarayana | రెండో అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ పడిన లిఫ్ట్.. ఎమ్మెల్యే కవ్వంపల్లికి తప్పిన ముప్పు

Post Office NSC | రూ.11 లక్షలు పెట్టుబడి.. వడ్డీగా రూ.5 లక్షలు పొందవచ్చు..



