Kajal Aggarwal | డీ గ్లామర్ లుక్‌లో కాజల్ – బాలకృష్ణ సినిమా కోసం గెటప్ మార్చిన అందాల చందమామ
భగవంత్ కేసరి తర్వాత బాలకృష్ణతో రెండోసారి జోడీ కట్టబోతుంది కాజల్ అగర్వాల్. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో కాజల్ హీరోయిన్‌గా కన్ఫామ్ అయ్యింది. అందాల చందమామ బర్త్‌డే సందర్భంగా శుక్రవారం ఆమె ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Entertainment | Published On Jun 19, 2026, 3.45 pm IST
Kajal Aggarwal | బాలకృష్ణ , కాజల్ అగర్వాల్ కాంబినేషన్‌లో వచ్చిన భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బెస్ట్ తెలుగు మూవీగా నేషనల్ అవార్డు అందుకుంది. భగవంత్ కేసరి తర్వాత బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ కలిసి మరో సినిమా చేయబోతున్నారు. కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో మేకర్స్ అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు.
రెట్రో లుక్‌లో...
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ తెరకెక్కుతోంది. కాజల్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటించబోతున్నట్లు శుక్రవారం మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ అందాల చందమామ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. పాతకాలం నాటి కళ్లద్ధాలు ధరించి చీరలో రెట్రో స్టైల్‌లో కాజల్ ఈ పోస్టర్‌లో కనిపించడం ఆసక్తిని పంచుతోంది. ఆమె వెనుక కొన్ని రబ్బర్ స్టాంప్‌లు, ఫైల్స్ ఉన్నాయి. ఇందులో గవర్నమెంట్ ఆఫీసర్‌గా కాజల్ నటిస్తోన్నట్లు తెలుస్తోంది.
నయనతారను అనుకొని....
బాలకృష్ణ మూవీ షూటింగ్‌లో ఇటీవలే కాజల్ జాయినైంది. ఈ సినిమాలో తొలుత హీరోయిన్‌గా నయనతారను తీసుకున్నారు. కానీ బడ్జెట్ పరమైన సమస్యల వల్ల నయన్‌ను పక్కనపెట్టి కాజల్‌ను ఫైనల్ చేశారు. బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 111వ సినిమా ఇది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం హిందీలో కాజల్ హీరోయిన్‌గా నటించిన ది ఇండియా స్టోరీ జూలై 24న రిలీజ్ కాబోతుంది. అలాగే తెలుగులో బాలకృష్ణ సినిమాతో పాటుగా విశాఖ పేరుతో వెబ్‌సిరీస్ చేస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Suriya | సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది – కిస్సిక్ సింగర్ వాయిస్‌తో…
జూన్ 19, 2026

Ritika Nayak | షూటింగ్ మొదలుకాకముందే నితిన్ సినిమా నుంచి హీరోయిన్ ఔట్ – తప్పుకుందా? తప్పించారా?
జూన్ 19, 2026

Folk Dancer | హీరోయిన్‌గా తెలంగాణ ఫోక్ డ్యాన్సర్ – సుకుమార్ సినిమాలో ఛాన్స్
జూన్ 19, 2026
తాజావార్తలు
- ●Harish Rao | రాహుల్ పుట్టిన రోజునే రైతు డిక్లరేషన్‌కు బొంద పెట్టారు: హరీశ్‌రావు
- ●CM Revanth Reddy | విధ్వంసమైన విద్యాశాఖను ప్రక్షాళన చేస్తున్నా : సీఎం రేవంత్ రెడ్డి
- ●Singareni | Singareni | వర్షాకాలంలో థర్మల్ కేంద్రాలకు సరిపడా బొగ్గు సరఫరా : సీఎండీ బుద్దప్రకాశ్ జ్యోతి
- ●Anupama Parameswaran | విలన్‌గా అనుపమ పరమేశ్వరన్ - సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ
- ●Rangareddy | రూ.87కోట్లతో రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపన
- ●Bhatti Vikramarka | వీకెండ్ హెలీకాప్టర్ టూరిజాన్ని డెవలప్ చేద్దాం

Harish Rao | రాహుల్ పుట్టిన రోజునే రైతు డిక్లరేషన్‌కు బొంద పెట్టారు: హరీశ్‌రావు

CM Revanth Reddy | విధ్వంసమైన విద్యాశాఖను ప్రక్షాళన చేస్తున్నా : సీఎం రేవంత్ రెడ్డి

Singareni | Singareni | వర్షాకాలంలో థర్మల్ కేంద్రాలకు సరిపడా బొగ్గు సరఫరా : సీఎండీ బుద్దప్రకాశ్ జ్యోతి

Anupama Parameswaran | విలన్‌గా అనుపమ పరమేశ్వరన్ - సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ



