N Ramchander Rao | నిజమైన ఓటరును తొలగించరు.. ‘సర్’పై ఎన్ రామచందర్ రావు
N Ramchander Rao | సర్ అనేది బీజేపీ కార్యక్రమం కాదు.. నిజమైన ఓటరును తొలగించే ప్రసక్తే లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు స్పష్టం చేశారు.
N Ramchander Rao | త్రినేత్ర.న్యూస్ : సర్ అనేది బీజేపీ కార్యక్రమం కాదు.. నిజమైన ఓటరును తొలగించే ప్రసక్తే లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు స్పష్టం చేశారు. నాగోల్‌లో నిర్వహించిన రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యకర్తల కోసం నిర్వహించిన సర్ వర్క్‌షాపును ఉద్దేశించి రామచందర్ రావు మాట్లాడారు.
SIR ప్రక్రియను అత్యంత గంభీరంగా తీసుకొని, ఓటర్లలో అవగాహన కల్పించేందుకు ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లాలని సూచించారు. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో గతంలో అనేక సార్లు SIR ప్రక్రియ నిర్వహించబడిందని, అప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా దీనిని వ్యతిరేకించలేదని వివరించాను. కానీ ఈసారి మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ ఇతర ప్రతిపక్ష పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్లో భయాందోళనలు, గందరగోళం సృష్టిస్తున్నాయని రామచందర్ రావు ధ్వజమెత్తారు.

ఏ సమాజానికి చెందిన నిజమైన ఓటరుని కూడా తొలగించరు. SIR అనేది బీజేపీ కార్యక్రమం కాదు. ఇది ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటరు జాబితా శుద్ధీకరణ ప్రక్రియ. మరణించిన వారి ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, నకిలీ ఓట్లు, అక్రమ ఓట్లను తొలగించడమే దీని లక్ష్యం. ప్రతి అర్హత కలిగిన భారత పౌరుడికి ఓటు హక్కు ఉంది. కానీ విదేశీయులు, రోహింగ్యాలు, అక్రమ బంగ్లాదేశీ చొరబాటుదారులకు భారత ఓటరు జాబితాలో చోటు ఉండకూడదు అని ఆయన సూచించారు.
ప్రతి బీఎల్ఏ-2 ప్రతినిధి, ప్రతి బీజేపీ కార్యకర్త బూత్‌లను సందర్శించి, ఓటర్లకు సహాయం చేసి, వారి సందేహాలను నివృత్తి చేసి, ఈ ముఖ్యమైన ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను. శుభ్రమైన ఓటరు జాబితానే బలమైన ప్రజాస్వామ్యానికి పునాది అని రామచందర్ రావు పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Anupama Parameswaran | విలన్‌గా అనుపమ పరమేశ్వరన్ - సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ
- ●Rangareddy | రూ.87కోట్లతో రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపన
- ●Bhatti Vikramarka | వీకెండ్ హెలీకాప్టర్ టూరిజాన్ని డెవలప్ చేద్దాం
- ●KTR | రాష్ట్రంలో ప్రభుత్వం కాదు.. మాఫియా నడుస్తోంది : కేటీఆర్
- ●Suriya | సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది - కిస్సిక్ సింగర్ వాయిస్‌తో...
- ●TG Weather | తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు, వడగాలు.. హెచ్చరించిన వాతావరణశాఖ..

Anupama Parameswaran | విలన్‌గా అనుపమ పరమేశ్వరన్ - సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ

Rangareddy | రూ.87కోట్లతో రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపన

Bhatti Vikramarka | వీకెండ్ హెలీకాప్టర్ టూరిజాన్ని డెవలప్ చేద్దాం

KTR | రాష్ట్రంలో ప్రభుత్వం కాదు.. మాఫియా నడుస్తోంది : కేటీఆర్




