KP Vivekananda | రేవంత్ రెడ్డి ఓ చీటర్, గజదొంగ, మోసగాడు
KP Vivekananda | రేవంత్‌రెడ్డి సీఎంగా ఉంటూ చీటర్, గజదొంగ, మోసగాడిలా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ఎల్పీ అసెంబ్లీ విప్ కేపీ వివేకానంద ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో భూములు అమ్మి నగరంలో అభివృద్ధి చేశామని.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం భూముల అమ్మగా వచ్చిన 12 వేల కోట్ల రూపాయలతో ఏం చేశారని ప్రశ్నించారు.
- మొత్తం భూముల చుట్టే తిరుగుతున్నడు
- భూములమ్మిన రూ.12 వేల కోట్లతో ఏం చేసినవ్
- సీఎంపై కేపీ వివేకానంద ఫైర్
KP Vivekananda | త్రినేత్ర.న్యూస్: రేవంత్‌రెడ్డి సీఎంగా ఉంటూ చీటర్, గజదొంగ, మోసగాడిలా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ఎల్పీ అసెంబ్లీ విప్ కేపీ వివేకానంద ఆరోపించారు. సీఎం కావాలని అనేక పార్టీలు మారారని.. అబద్ధాల పునాదులపై ముఖ్యమంత్రి అయ్యారని దుయ్యబట్టారు. అమ్మిన భూమినే మళ్లీ అమ్ముతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో భూములు అమ్మి నగరంలో అభివృద్ధి చేశామని.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం భూముల అమ్మగా వచ్చిన 12 వేల కోట్ల రూపాయలతో ఏం చేశారని ప్రశ్నించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు.
హిల్ట్ పాలసీతో అక్రమాలు..
రేవంత్ రెడ్డి రెండున్నరేళ్లలో హామీలు నెరవేర్చలేదు. ఆయనకు పరిపాలనా అనుభవం లేదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై బురద చల్లుతున్నారు. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందా చేస్తూ రూ.12 వేల కోట్ల విలువైన భూములు అమ్మారు. మొత్తం భూముల చుట్టే తిరుగుతున్నారు. రాయదుర్గం వద్ద ఉన్న భూమికి హైకోర్టులో ఉత్తర్వులు ఉన్నా ఈవేలం ద్వారా వేరే కంపెనీకి అమ్మారు. కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారింది. హిల్ట్ పాలసీ ద్వారా భూములను తన బినామీలకు కట్టబెట్టాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో భూదందా చేస్తున్నారు అని వివేకానంద ఆరోపించారు.
హైదరాబాద్‌ను విస్మరించారు..
రాష్ట్రంలో రైతులు, యువత ఇబ్బందులు పడుతున్నారు. రేవంత్ కుల వృత్తులను మోసం చేశారు. కేసీఆర్ నామస్మరణ లేనిది ఆయనకు నిద్ర పట్టడం లేదు. హైదరాబాద్‌ను విస్మరించి ఫ్యూచర్ సిటీ కడుతున్నారు. సిద్దిపేటలో హరీష్ రావుపై పోటీ చేసి గెలువు. ఒకవేళ పోటీ చేస్తే బలి కావడం పక్కా. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని రేవంత్ రెడ్డి చాలెంజ్ విసిరారు. కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు. రాష్ట్రంలో ప్రజలు రోజులు లెక్కబెట్టుకునే పరిస్థితి ఉంది అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద పేర్కొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Harish Rao | రాహుల్ పుట్టిన రోజునే రైతు డిక్లరేషన్‌కు బొంద పెట్టారు: హరీశ్‌రావు
- ●CM Revanth Reddy | విధ్వంసమైన విద్యాశాఖను ప్రక్షాళన చేస్తున్నా : సీఎం రేవంత్ రెడ్డి
- ●Singareni | Singareni | వర్షాకాలంలో థర్మల్ కేంద్రాలకు సరిపడా బొగ్గు సరఫరా : సీఎండీ బుద్దప్రకాశ్ జ్యోతి
- ●Anupama Parameswaran | విలన్‌గా అనుపమ పరమేశ్వరన్ - సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ
- ●Rangareddy | రూ.87కోట్లతో రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపన
- ●Bhatti Vikramarka | వీకెండ్ హెలీకాప్టర్ టూరిజాన్ని డెవలప్ చేద్దాం

Harish Rao | రాహుల్ పుట్టిన రోజునే రైతు డిక్లరేషన్‌కు బొంద పెట్టారు: హరీశ్‌రావు

CM Revanth Reddy | విధ్వంసమైన విద్యాశాఖను ప్రక్షాళన చేస్తున్నా : సీఎం రేవంత్ రెడ్డి

Singareni | Singareni | వర్షాకాలంలో థర్మల్ కేంద్రాలకు సరిపడా బొగ్గు సరఫరా : సీఎండీ బుద్దప్రకాశ్ జ్యోతి

Anupama Parameswaran | విలన్‌గా అనుపమ పరమేశ్వరన్ - సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ






