త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NEET | నీట్ విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం..

NEET | ఈ నెల 21వ తేదీ నీట్ ఎగ్జామ్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా నీట్ రాసే విద్యార్థుల‌కు ఆ రోజు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం క‌ల్పించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ఈ విష‌యాన్ని రాష్ట్ర మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అధికారికంగా వెల్ల‌డించారు.

S

Telangana | Published On Jun 18, 2026, 5.03 pm IST

NEET | నీట్ విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం..
Advertisement

NEET | త్రినేత్ర‌.న్యూస్ : ఈ నెల 21వ తేదీ నీట్ ఎగ్జామ్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా నీట్ రాసే విద్యార్థుల‌కు ఆ రోజు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం క‌ల్పించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ఈ విష‌యాన్ని రాష్ట్ర మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అధికారికంగా వెల్ల‌డించారు. సీఎం రేవంత్ రెడ్డితో మంత్రుల స‌మావేశం అనంత‌రం మంత్రి ఉత్త‌మ్ మీడియాతో మాట్లాడారు.

ఈ నెల 21న దేశ‌మంతా నీట్ ప‌రీక్ష జ‌ర‌గ‌నుంది. రాష్ట్రంలో 2008 ప‌రీక్షా కేంద్రాల్లో 2 ల‌క్ష‌ల 95 వేల మంది ప‌రీక్ష రాస్తున్నారు. ఈ ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యే విద్యార్థుల‌కు ఆర్టీసీ బ‌స్సులో ఉచిత‌ ప్ర‌యాణం క‌ల్పించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం. నీట్ ప‌రీక్ష రాసే విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచితంగా ప్ర‌యాణం చేయొచ్చ‌ని మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి సూచించారు.

అడ్డంకులు సృష్టించ‌కుండా.. మెట్రో విస్త‌ర‌ణ‌కు స‌హ‌క‌రించండి..

మెట్రో విస్త‌ర‌ణ‌కు అవ‌స‌ర‌మైన అనుమ‌తులు ఇవ్వాల‌ని కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేస్తున్నాం. ఐఆర్ఎఫ్‌సీ ఒప్పందం ప్ర‌కారం రావాల్సిన రుణాన్ని వెంట‌నే మంజూరు చేయించాల‌ని కేంద్రాన్ని కోరుతున్నాం. హైద‌రాబాద్ ట్రాఫిక్ ప్ర‌యాణికుల అవ‌స‌రాల దృష్ట్యా మెట్రో ఫేజ్ 2 విస్త‌ర‌ణ అత్యంత కీల‌కం. అందుకే రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు మెట్రో విస్త‌ర‌ణ‌కు స‌హ‌క‌రించాలి. తెలంగాణ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించ‌కుండా, కేంద్రం నుంచి రావాల్సిన అన‌మతులు ఇప్పించేందుకు పార్టీ నేత‌లు క‌లిసి రావాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నామ‌ని మంత్రి తెలిపారు.

ఇకపై డిజిట‌ల్ కేబినెట్

తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మంత్రి వ‌ర్గ స‌మావేశాల‌ను పేప‌ర్ లెస్ ప‌ద్ధ‌తిలో నిర్వ‌హించేందుకు శ్రీకారం చుట్టింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జ‌రిగే కేబినెట్ స‌మావేశాల‌ను ఇక‌పై తెలంగాణ డిజిట‌ల్ కేబినెట్‌గా నిర్వ‌హిస్తారు. ఐటీ మినిస్ట‌ర్ శ్రీధ‌ర్ బాబు, సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులంద‌రికీ స్పెష‌ల్ ట్యాబ్‌ల‌ను అంద‌జేశారు. ఇక‌పై ఈ బుక్ ద్వారా కేబినెట్ స‌మావేశాల ఎజెండా, నోట్స్ అందుబాటులో మంత్రుల‌కు ఉంచుతారు. పేప‌ర్ లెస్ గ‌వ‌ర్న‌నెన్స్‌లో భాగంగా తెలంగాణ డిజిట‌ల్ కేబినెట్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చామ‌ని మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement