Rangareddy | రంగారెడ్డి జిల్లాలో 10 ఆవులు మృతి.. యూరియానే కారణమా..?
Rangareddy | రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో విషాదం నెలకొంది. ఒక పశువుల కొట్టంలో కట్టేసి ఉంచిన పది ఆవులు ఒకేసారి మృతి చెందాయి. దీంతో ఆవుల యజమాని తీవ్ర ఆందోళనకు గురై కన్నీరు పెట్టుకున్నాడు. ఆవుల మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Rangareddy | త్రినేత్ర.న్యూస్ : రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో విషాదం నెలకొంది. ఒక పశువుల కొట్టంలో కట్టేసి ఉంచిన పది ఆవులు ఒకేసారి మృతి చెందాయి. దీంతో ఆవుల యజమాని తీవ్ర ఆందోళనకు గురై కన్నీరు పెట్టుకున్నాడు. ఆవుల మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కుమ్మరిగూడ గ్రామానికి చెందిన ఓ రైతుకు పది ఆవులు ఉన్నాయి. ఆ ఆవులను అన్నింటిని తన పశువుల కొట్టంలో కట్టేసి ఉంచాడు. ఇక జూన్ 19న తెల్లవారుజామున పశువుల కొట్టం వద్దకు వెళ్లిన యజమానికి ఆవులు చనిపోయి ఉండడంతో షాక్‌కు గురయ్యాడు. తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం ఆవుల కళేబరాలను పశువుల దవఖానాకు తరలించారు. అయితే యూరియా కలిపిన నీళ్లను తాగడం వల్లనే ఆవులు చనిపోయి ఉంటాయని పోలీసులు అంచనా వేశారు. పశువుల కాపరి కూడా పరారీలో ఉండడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పశువుల కాపరే నీళ్లల్లో యూరియా కలిపి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. తన సొంత బిడ్డల్లాగా పెంచుకున్న ఆవులు చనిపోవడంతో యజమాని కన్నీరు పెట్టుకున్నాడు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●KTR | రాష్ట్రంలో ప్రభుత్వం కాదు.. మాఫియా నడుస్తోంది : కేటీఆర్
- ●Suriya | సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది - కిస్సిక్ సింగర్ వాయిస్‌తో...
- ●TG Weather | తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు, వడగాలు.. హెచ్చరించిన వాతావరణశాఖ..
- ●ITR 3 | ఐటీఆర్-3 ఫైలింగ్ ప్రారంభం.. వ్యాపారులు, ప్రొఫెషనల్స్‌కు కీలక అప్డేట్..
- ●Ritika Nayak | షూటింగ్ మొదలుకాకముందే నితిన్ సినిమా నుంచి హీరోయిన్ ఔట్ - తప్పుకుందా? తప్పించారా?
- ●Jio IPO | జియో ఐపీఓకు గ్రీన్ సిగ్నల్.. సెబీకి డీఆర్‌హెచ్‌పీ దాఖలు.. భారత కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద ఐపీఓగా రికార్డు దిశగా..

KTR | రాష్ట్రంలో ప్రభుత్వం కాదు.. మాఫియా నడుస్తోంది : కేటీఆర్

Suriya | సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది - కిస్సిక్ సింగర్ వాయిస్‌తో...

TG Weather | తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు, వడగాలు.. హెచ్చరించిన వాతావరణశాఖ..

ITR 3 | ఐటీఆర్-3 ఫైలింగ్ ప్రారంభం.. వ్యాపారులు, ప్రొఫెషనల్స్‌కు కీలక అప్డేట్..






