Liquor Shops | తమిళనాట విజయ్ కీలక నిర్ణయం.. పాఠశాలలు, ఆలయాలకు దగ్గరలో మద్యం దుకాణాల మూసివేతకు ఆదేశాలు..!
Liquor Shops | తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా 717 ప్రభుత్వ మద్యం రిటైల్ దుకాణాలను మూసివేయాలని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా ప్రార్థనా స్థలాలు, విద్యాసంస్థలు, బస్ స్టాండ్ల సమీపంలో నడుస్తున్న తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC) షాపులను దశలవారీగా మూసివేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
Liquor Shops | తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా 717 ప్రభుత్వ మద్యం రిటైల్ దుకాణాలను మూసివేయాలని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా ప్రార్థనా స్థలాలు, విద్యాసంస్థలు, బస్ స్టాండ్ల సమీపంలో నడుస్తున్న తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC) షాపులను దశలవారీగా మూసివేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 4,765 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇందులో 717 దుకాణాలను మూసివేయాల్సి రానుంది. ఇందులో 276 మద్యం దుకాణాలు ఆలయాలు, మసీదులు, చర్చిలకు సమీపంలో ఉన్నాయి. మరో 186 మద్యం దుకాణాలు విద్యాసంస్థలు, 255 దుకాణాలు బస్టాండ్‌లకు పరిసరాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
పాఠశాలలు, ఆలయాలు, బస్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న ఆయా దుకాణాలను వచ్చే రెండు వారాల్లోగా పూర్తిగా మూసివేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజల సున్నిత ప్రాంతాల్లో మద్యం దుకాణాల ప్రభావాన్ని తగ్గించడమే ఈ నిర్ణయ ప్రధాన ఉద్దేశమని అధికార వర్గాలు తెలిపాయి. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే ఈ నిర్ణయం తీసుకోవడం విశేషంగా మారింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా ఇది తొలి కీలక నిర్ణయంగా పేర్కొంటున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన విద్యా రంగ సంస్కరణలు, మహిళల భద్రత కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు, అవినీతి నిర్మూలనకు కఠిన చర్యలు వంటి అంశాలపై సైతం నిర్ణయాలు ప్రకటించారు. ఇక విద్యుత్, మహిళల భద్రత, మాదకద్రవ్య నియంత్రణకు సంబంధించిన మూడు ప్రజా సంక్షేమ పథకాలను కూడా ప్రభుత్వం ప్రారంభించింది. తాజా మద్యం దుకాణాల మూసివేత నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vijay TVK cabinet 2026 | సీఎం విజయ్ ‘క్యాబినెట్ ఆఫ్ ఫస్ట్స్’: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం.. దళపతి మాస్టర్ మైండ్
మే 21, 2026

SIR | అర్హులకు ఓటు హక్కు కల్పించడమే సర్ లక్ష్యం : కలెక్టర్ గరిమ అగ్రవాల్
మే 20, 2026

Murder Case | వరంగల్‌లో జంట హత్యల కేసు: నిందితుడికి మరణశిక్ష విధించిన కోర్టు..!
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



