Vinesh Phogat | వినేశ్-రెజ్లింగ్ సమాఖ్య మధ్య ముదురుతున్న వివాదం..! నోటీసులపై స్టార్ రెజ్లర్ రెస్పాన్స్ ఇదే..!
Vinesh Phogat | భారత రెజ్లింగ్ సమాఖ్య, స్టార్ రెజర్ల్ వినేశ్ ఫొగాట్‌కు మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇటీవల రెజ్లింగ్ సమాఖ్య జారీ చేసిన షోకాట్ నోటీసులసై వినేశ్ స్పందించింది. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించింది. తాను నిబంధనల పరిధిలోనే ఉన్నానని స్పష్టం చేసింది.
Vinesh Phogat | భారత రెజ్లింగ్ సమాఖ్య, స్టార్ రెజర్ల్ వినేశ్ ఫొగాట్‌కు మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇటీవల రెజ్లింగ్ సమాఖ్య జారీ చేసిన షోకాట్ నోటీసులసై వినేశ్ స్పందించింది. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించింది. తాను నిబంధనల పరిధిలోనే ఉన్నానని స్పష్టం చేసింది. తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ప్రకటనలో వినేశ్ ఫోగాట్ కీలక విషయాలను వెల్లడించింది. ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి అధికారిక పోటీల్లో పాల్గొనేందుకు తనకు అనుమతి లభించిందని తెలిపారు. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లిఖితపూర్వకంగా ధ్రువీకరించినట్లు పేర్కొంది. అనుమతి మేరకు తాను ఉత్తరప్రదేశ్‌లోని నందినినగర్ స్టేడియంలో జరిగిన 2026 సీనియర్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపింది. అయితే, ప్రాంగణానికి చేరుకున్నప్పటికీ తన వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయనీయలేదని, శిక్షణ హాల్‌కి ప్రవేశం కూడా నిరాకరించారని ఆరోపించారు.
తనకు ప్రత్యేక సౌకర్యాలు కావాలని అడగడం లేదని, కేవలం ప్రతిభ ఆధారంగా పోటీల్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని మాత్రమే కోరుతున్నానని వినేశ్ స్పష్టం చేశారు. రెజ్లింగ్ సమాఖ్య జారీ చేసిన నోటీసుల్లో ప్రస్తావించిన అంశాలను పూర్తిగా ఖండించింది. 2024 సెప్టెంబర్‌లోని ‘వెయిట్‌బీహేవియర్ ఫెయిల్యూర్’, 2025 డిసెంబర్‌లో జరిగిన టెస్ట్ మిస్ అయిన విషయాలను యాంటీ డోపింగ్ నిబంధనల ఉల్లంఘనగా పేర్కొనడం తప్పని తెలిపారు. తాను సంబంధిత సంస్థలతో పూర్తిగా సహకరించానని, ఈ అంశాలు వరల్డ్ యాంటీ డోపింగ్ ఎజెన్సీ 2021 కోడ్ ప్రకారం ఉల్లంఘన కిందకు రావని వాదనలు వినిపించింది. అలాగే, 2024 సెలెక్షన్ ట్రయల్స్‌లో రెండు వేర్వేరు బరువు విభాగాల్లో పాల్గొన్నట్లు వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చింది. అప్పటి తాత్కాలిక కమిటీకి ఈ విషయం పూర్తిగా తెలిసినదేనని, ఎక్కడా అభ్యంతరం వ్యక్తం చేయలేదని గుర్తు చేసింది. ఈ పరిణామాలతో వినేశ్ ఫోగాట్–భారత రెజ్లింగ్ సమాఖ్య వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






