Cough Syrups | దగ్గు మందు విక్రయాలపై కేంద్రం కీలక నిర్ణయం.. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి
Cough Syrups | దగ్గుమందు (cough syrups) విక్రయాల విషయంలో కేంద్ర ప్రభుత్వం నియంత్రణ చర్యలకు ఉపక్రమించింది. సిరప్ ఆధారిత మందులను (Syrup Medicines) ఇకపై ఓవర్-ది-కౌంటర్ (OTC) విధానంలో విక్రయించకుండా నిర్ణయించింది. దగ్గు సిరప్‌ల కొనుగోలుకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి (Doctors Prescription Mandatory) చేసింది.
Cough Syrups | దగ్గుమందు (cough syrups) కారణంగా చిన్నారులు మరణించిన ఘటన ఇటీవలే దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దగ్గుమందు విక్రయాల విషయంలో కేంద్ర ప్రభుత్వం నియంత్రణ చర్యలకు ఉపక్రమించింది. సిరప్ ఆధారిత మందులను (Syrup Medicines) ఇకపై ఓవర్-ది-కౌంటర్ (OTC) విధానంలో విక్రయించకుండా నిర్ణయించింది.
దగ్గు సిరప్‌ల కొనుగోలుకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి (Doctors Prescription Mandatory) చేసింది. ఈ మేరకు 1945 డ్రగ్స్ రూల్స్‌ను సవరిస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఔషధాల దుర్వినియోగాన్ని అరికట్టడం, ప్రజల ఆరోగ్య భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త నిబంధనల ప్రకారం.. లైసెన్స్ పొందిన మెడికల్ షాపులు లేదా ఫార్మసీల ద్వారానే సిరప్‌ల విక్రయాలు జరగాలి. చిన్న గ్రామాల్లో కూడా ఇదే నిబంధనలు వర్తిస్తాయి.
ఇక డ్రగ్స్ రూల్స్, 1945లోని షెడ్యూల్-K (Schedule K)లో ఉన్న ప్రత్యేక మినహాయింపుల జాబితా నుంచి ‘సిరప్’ అనే పదాన్ని ప్రభుత్వం తొలగించింది. ఇప్పటివరకు ఈ షెడ్యూల్ కింద ఉన్న మందుల తయారీ, విక్రయాలు, పంపిణీకి కొన్ని ప్రత్యేక నిబంధనల నుండి మినహాయింపులు ఉండేవి. తాజా సవరణతో దగ్గు సిరప్‌లు ఓవర్-ది-కౌంటర్ (OTC) మందుల హోదాను కోల్పోయాయి.
మధ్యప్రదేశ్, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో కల్తీ దగ్గు సిరప్‌ల కారణంగా పలువురు చిన్నారులు చనిపోయిన ఘటనలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. దీంతో ఔషధాల నాణ్యత, భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల వల్ల సాధారణంగా ప్రిస్క్రిప్షన్ లేకుండా కొనుగోలు చేసే దగ్గు సిరప్‌లు, ఇతర ద్రవ ఔషధాలను ఇకపై డాక్టర్ సూచనతోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కాఫ్ సిరప్ తయారీదారులు, పంపిణీదారులు, ఔషధ విక్రేతలు నిబంధనలకు అనుగుణంగానే మందులను విక్రయించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.
Also Read..
సంబంధిత వార్తలు

MLA Vemula Prashanth Reddy | దళారులకు లాభం.. రైతులకు నష్టం: పసుపు కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్
ఏప్రిల్ 15, 2026

MP Raghav Chadha | ఎంపీ రాఘవ్ చద్దా జెడ్ ప్లస్ భద్రత తీసేసిన పంజాబ్.. వెంటనే జెడ్ సెక్యూరిటీ కల్పించిన కేంద్రం
ఏప్రిల్ 15, 2026

Overload | అధిక లోడ్‌తో వాహనాల్లో ప్రయాణిస్తే భారీ జరిమానా.. కేంద్రం కొత్త నియమాలు..
ఏప్రిల్ 14, 2026
తాజావార్తలు
- ●Pooja Hegde | పూజా హెగ్డే టాలీవుడ్ రీఎంట్రీ మూవీపై అప్డేట్ - ఆ ఒక్కటే మిగిలింది!
- ●Green India Challenge | గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన ప్రముఖులు
- ●Anasuya Bharadwaj | రుక్మిణిగా మారిన అనసూయ - ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిపోయిన తెలుగు యాంకర్
- ●TCSS | తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్త
- ●BJP Ramchandar Rao- ATA | అమెరికా అభివృద్ధిలో తెలుగువారి పాత్ర ఎనలేనిది.. ఇక్కడికొచ్చి కూడా సంసృతిని కాపాడడం అభినందనీయం
- ●BRS Leaders | కాంగ్రెసోళ్లది మిడిమిడి జ్ఞానం.. నీళ్లపై అవగాహనే లేదు..

Pooja Hegde | పూజా హెగ్డే టాలీవుడ్ రీఎంట్రీ మూవీపై అప్డేట్ - ఆ ఒక్కటే మిగిలింది!

Green India Challenge | గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన ప్రముఖులు

Anasuya Bharadwaj | రుక్మిణిగా మారిన అనసూయ - ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిపోయిన తెలుగు యాంకర్

TCSS | తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్త



