Tollywood Heroine | ప్రియుడితో బ్రేకప్ – ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్
టాలీవుడ్ హీరోయిన్ సునయన లవ్‌స్టోరీకి బ్రేకప్ పడినట్లు సమాచారం. మనస్పర్థల కారణంగా ప్రియుడు ఖలీద్ అల్ అమీర్ నుంచి ఈ హీరోయిన్ విడిపోయినట్లు చెబుతున్నారు. ఖలీద్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడంతో పాటు ఎంగేజ్‌మెంట్ ఫొటోలను కూడా సునయన డిలీట్ చేసింది.
Entertainment | Published On Jun 16, 2026, 2.34 pm IST
Tollywood Heroine | టాలీవుడ్‌లో మరో లవ్‌స్టోరీకి బ్రేకప్ పడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మనస్పర్థల కారణంగా ప్రియుడు ఖలీద్ అల్ అమీర్ నుంచి హీరోయిన్ సునయన విడిపోయినట్లు సమాచారం. కుమార్ వర్సెస్ కుమారీ మూవీతో ఈ హైదరాబాదీ బ్యూటీ ఫస్ట్ టైమ్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించింది. టెన్త్ క్లాస్, శ్రీవిష్ణు రాజ రాజ చోర, నాగార్జున కుబేరతో పాటు తెలుగులో చాలానే సినిమాలు చేసింది. టాలీవుడ్‌లో కంటే కోలీవుడ్‌లో ఎక్కువగా ఫేమస్ అయ్యింది. దళపతి విజయ్, ధనుష్, విశాల్, జీవా వంటి టాప్ హీరోలతో సినిమాలు చేసింది.
యూట్యూబర్....
సినిమాలతో బిజీగా ఉన్న టైమ్‌లోనే దుబాయ్‌కి చెందిన యూట్యూబర్ ఖలీద్ అల్ అమీర్‌తో ప్రేమలో పడింది సునయన. సీక్రెట్‌గా లవర్‌తో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంది. ఈ ఎంగేజ్‌మెంట్ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది సునయన. ప్రేమాయణం కారణంగా సినిమాలకు కూడా గ్యాప్ ఇచ్చింది. దక్షిణాదిలో చాలానే అవకాశాలు వచ్చినా వాటిని రిజెక్ట్ చేసింది. ఖలీద్, సునయన ఈ ఏడాదే పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు వార్తలొచ్చాయి.
అన్‌ఫాలో
మనస్పర్థల కారణంగా పెళ్లిపీటలు ఎక్కకముందే ప్రియుడికి సునయన బ్రేకప్ చెప్పిందట. సడెన్‌గా ప్రియుడిని సునయన ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసింది. అంతే కాకుండా ఎంగేజ్‌మెంట్‌తో పాటు అతడితో దిగిన పాత ఫొటోలన్నింటిని డిలీట్ చేసింది. ఖలీద్ కూడా సునయనను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ ఫాలో అయ్యాడు. అతడు కూడా సునయనతో కలిసి దిగిన ఫొటోలను తన ఇన్‌స్టా నుంచి తొలగించడంతో వీరు విడిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. సెలిబ్రిటీలు విడిపోయే టైమ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం కామన్. సునయన కూడా ఇదే రూట్‌ను అనుసరించడంతో ఈ బ్రేకప్ రూమర్లు నిజమేనని నెటిజన్లు అంటున్నారు. అయితే ఈ ఎంగేజ్‌మెంట్ రద్దుపై సునయనతో పాటు ఖలీద్ రియాక్ట్ కాలేదు. ప్రస్తుతం సునయన తమిళంలో ఇన్స్‌పెక్టర్ రుషి వెబ్ సిరీస్ చేస్తోంది. నవీన్ చంద్ర లీడ్ రోల్‌లో నటిస్తోన్న ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..





