Revanth Reddy | సన్నాలు ఏడు రకాలే.. వాటికే బోనస్
Revanth Reddy | బోనస్ ఇచ్చే 7 రకాల సన్న వడ్ల విత్తనాలను అందుబాటులో ఉంచాలని.. వాటినే సబ్సిడీపై ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. అన్ని ఫెర్టిలైజర్లకు యాప్ పెట్టాలని.. యాప్ ద్వారా బుక్ చేసుకునే యూరియాను రైతు వేదిక ద్వారా పంపిణీ చేయాలని ఆదేశించారు.
- సబ్సిడీపైనే ఆ విత్తనాలు ఇద్దాం
- రైతు వేదికల నుంచే యూరియా ఇవ్వాలే
- ఆ బాధ్యత జిల్లా అదనపు కలెక్టర్లదే
- వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు ఆదేశం
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: బోనస్ ఇచ్చే 7 రకాల సన్న వడ్ల విత్తనాలను అందుబాటులో ఉంచాలని.. వాటినే సబ్సిడీపై ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. రైతు వేదికలో విత్తనాలు అందుబాటులో ఉంచాలని చెప్పారు. సన్న వడ్లు పండించే రైతుల డేటా సేకరించాలన్నారు. అన్ని ఫెర్టిలైజర్లకు యాప్ పెట్టాలని.. యాప్ ద్వారా బుక్ చేసుకునే యూరియాను రైతు వేదిక ద్వారా పంపిణీ చేయాలని ఆదేశించారు. జిల్లా అదనపు కలెక్టర్‌కు యూరియా పంపిణీ బాధ్యతను అప్పగించాలన్నారు.

యూరియా, ఇతర ఎరువుల కేటాయింపులపైన ఎప్పటికప్పుడు కేంద్రానికి లేఖ లు రాయాలి. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయిన ఎరువులు మొత్తం తెలంగాణకే ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. ధాన్యం దిగుబడిపైన వ్యవసాయ శాఖకు సంపూర్ణ అవగాహన ఉండాలి. భద్రాద్రి కొత్తగూడం దమ్మపేట మండలంలో ప్రారంభించిన పైలెట్ ప్రాజెక్ట్ ను మరింతగా వినియోగించుకోవాలి అని రేవంత్‌రెడ్డి సూచించారు.
అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం పెట్టాలి..
వ్యవసాయ శాఖలో సాంకేతికతను మరింత పెంచుకోవాలి. ఏఐని మరింత వినియోగించాలి. అగ్రికల్చర్ యూనివర్సిటీని నోడల్ ఏజెన్సీగా పెట్టుకొని సాంకేతికతను పెంచుకోవాలి. సీడ్స్ నుంచి కొనుగోలు వరకు వ్యవసాయ శాఖ, సివిల్ సప్లయిస్, అగ్రికల్చర్ యూనివర్సిటీ సమన్వయంతో పని చేయాలి. మార్క్‌ఫెడ్ నష్టాలను తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలి. ఆయిల్ ఫెడ్‌ను బలోపేతం చేసుకోవాలి. ఎరువుల పరిస్థితిపై అన్ని పార్టీ ల ఎంపీల సమావేశం నిర్వహించి పరిస్థితిని వివరించాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●AI Express flight | విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో సమస్య.. టేకాఫ్ అయిన రెండు గంటల్లోనే వెనక్కి మళ్లింపు
- ●Adilabad Airport | ఆదిలాబాద్‌కు ఎయిర్పోర్ట్ కల సాకారం దిశగా కీలక ముందడుగు
- ●MSI | ఎంఎస్ఐ బంపర్ ఆఫర్.. హై ఎండ్ ల్యాప్ టాప్‌లపై భారీ డిస్కౌంట్లు..
- ●Rashmika Mandanna | బాలీవుడ్ మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా రష్మిక మందన్న - ఫొటోలు వైరల్
- ●Mussoorie Homestay Death | హోమ్‌స్టేలో ఘోరం: భర్తతో కలిసి వెకేషన్‌కు వెళ్లిన వైజాగ్ యువతి అనుమానాస్పద మృతి
- ●Fire Breaks | మూసాపేట్లో భారీ అగ్నిప్రమాదం

AI Express flight | విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో సమస్య.. టేకాఫ్ అయిన రెండు గంటల్లోనే వెనక్కి మళ్లింపు

Adilabad Airport | ఆదిలాబాద్‌కు ఎయిర్పోర్ట్ కల సాకారం దిశగా కీలక ముందడుగు

MSI | ఎంఎస్ఐ బంపర్ ఆఫర్.. హై ఎండ్ ల్యాప్ టాప్‌లపై భారీ డిస్కౌంట్లు..

Rashmika Mandanna | బాలీవుడ్ మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా రష్మిక మందన్న - ఫొటోలు వైరల్






