OTT | నేరుగా ఓటీటీలోకి తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ – ఈ వీక్‌లోనే స్ట్రీమింగ్
తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ థాంక్యూ సుబ్బారావు థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. జూన్ 18 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. చందు ముద్దు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చంద్రహాస్ కోట్ల, లావణ్య హీరోహీరోయిన్లుగా నటించారు.
Entertainment | Published On Jun 16, 2026, 3.46 pm IST
OTT | ఈ వారం ఓటీటీ ప్రేక్షకుల ముందుకు పలు తెలుగు సినిమాలు రాబోతున్నాయి. వాటిలో థాంక్యూ సుబ్బారావు ఒకటి. చందు ముద్దు దర్శకత్వంలో సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జూన్ 18 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.
హీరోహీరోయిన్లు...
థాంక్యూ సుబ్బారావు మూవీలో చంద్రహాస్ కోట్ల, లావణ్య హీరోహీరోయిన్లుగా నటించారు. రోహిత్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషించారు. ప్రిన్స్ హెన్సీ మ్యూజిక్ అందించాడు.సుబ్బారావు ఓ క్యాబ్ డ్రైవర్. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని కలలు కంటుంటాడు. అనుకోకుండా అతడి లైఫ్‌లోకి ఓ అమ్మాయి వస్తుంది. ఆమె లక్ష్యానికి సుబ్బారావు ఎలా అండగా నిలిచాడు? ఆరుగురు హత్యలకు సంబంధించిన మిస్టరీని సుబ్బారావు ఎలా ఛేదించాడు? అనే అంశాలతో ఈ మూవీ రూపొందింది.
ఓ పిట్టకథ...
థాంక్యూ సుబ్బరావు కంటే ముందు అన్నపూర్ణ ఫొటో స్టూడియో, ఓ పిట్టకథ సినిమాలకు దర్శకత్వం వహించాడు చందు ముద్దు. డైరెక్టర్‌గా ఇది అతడి మూడో సినిమా. చంద్రహాస్, లావణ్య ఈ సినిమాతోనే నాయకానాయికలుగా తెలుగు తెరకు పరిచయం అవుతోన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!
- ●Mumbai Ahmedabad Bullet Train | దేశంలో పరుగులు తీయనున్న తొలి బుల్లెట్ ట్రైన్: ఫస్ట్ ఫేజ్ ఎప్పటినుంచంటే?

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం

Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!






