త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HMWSSB | ప‌నిచేయ‌ని జ‌ల‌మండలి క‌స్ట‌మ‌ర్ కేర్ నంబ‌ర్‌.. నీటి ట్యాంక‌ర్ ఎలా బుక్ చేయాలంటే?

HMWSSB | హైద‌రాబాద్‌లో ఎండ‌లు దంచికొడుతున్నాయి. దీంతో భూగ‌ర్భ జ‌లాలు రోజురోజుకు అడుగంటుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కేపీహెచ్‌బీ, జంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ అమీర్‌పేట వంటి జన‌భా అధికంగా ఉండే ప్రాంతాల్లో జ‌ల‌మండ‌లి (HMWSSB) స‌ప్ల‌య్ చేసే వాట‌ర్ ట్యాంక‌ర్ల‌పైనే (Water Tanker) ప్ర‌జ‌లు ఆధార‌ప‌డుతుంటారు.

G

Hyderabad | Published On Apr 16, 2026, 10.11 am IST

HMWSSB | ప‌నిచేయ‌ని జ‌ల‌మండలి క‌స్ట‌మ‌ర్ కేర్ నంబ‌ర్‌.. నీటి ట్యాంక‌ర్ ఎలా బుక్ చేయాలంటే?
Advertisement

HMWSSB | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌లో ఎండ‌లు దంచికొడుతున్నాయి. దీంతో భూగ‌ర్భ జ‌లాలు రోజురోజుకు అడుగంటుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కేపీహెచ్‌బీ, జంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ అమీర్‌పేట వంటి జన‌భా అధికంగా ఉండే ప్రాంతాల్లో జ‌ల‌మండ‌లి (HMWSSB) స‌ప్ల‌య్ చేసే వాట‌ర్ ట్యాంక‌ర్ల‌పైనే (Water Tanker) ప్ర‌జ‌లు ఆధార‌ప‌డుతుంటారు. అయితే ట్యాంక్ బుక్ చేసుకోవ‌డానికి వినియోగించే క‌స్ట‌మ‌ర్ కేర్ నంబ‌ర్ 155313 (Customer Care Number) సాంకేతిక కార‌ణ‌గాల‌తో తాత్కాలికంగా ప‌నిచేయ‌డం లేదు.

ఈ విష‌యాన్ని జ‌ల‌మండ‌లి (Jalamandali).. బీఎస్ఎన్ఎల్ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు BSNL సాంకేతిక బృందం అత్య‌వ‌స‌రంగా చ‌ర్య‌లు చేప‌ట్టింద‌ని జ‌ల‌మండ‌లి అధికారులు తెలిపారు. వినియోగ‌దారులు త‌మ అవ‌స‌రాల‌కు అనుగుణంగా నీటి ట్యాంక‌ర్ బుకింగ్ కోసం ప్ర‌త్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాల‌ని సూచించారు. వినియోగ‌దారుల‌కు క‌లిగిన అసౌక‌ర్యానికి చింతిస్తున్నామ‌ని తెలిపారు. స‌మ‌స్య‌ను వీలైన త్వ‌ర‌గా ప‌రిష్క‌రించి, సేవలను సాధారణ స్థితికి తీసుకువస్తామని వెల్ల‌డించారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

ట్యాంక‌ర్ ఇలా బుక్‌చేసుకోండి..

ఆప్షన్ 1

  • HMWSSB అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్‌లో ట్యాంకర్ బుకింగ్ చేసుకోవచ్చు. (వెబ్‌సైట్‌లో లాగిన్ అయి, అవసరమైన వివరాలు నమోదు చేసి సులభంగా బుకింగ్ చేసుకోవచ్చు)

ఆప్షన్ 2

  • మొబైల్ యాప్ ద్వారా ట్యాంకర్ బుకింగ్ సదుపాయం అందుబాటులో ఉంది. వినియోగదారులు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, రిజిస్టర్ అయ్యి బుకింగ్ చేసుకోవచ్చు.

ఆప్షన్ 3

  • సమీప జలమండలి సెక్షన్ కార్యాలయం లేదా వాటర్ సప్లై ఆఫీస్‌ను సంప్రదించి ట్యాంకర్ కోసం అభ్యర్థించవచ్చు.

ఆప్షన్ 4

  • అత్యవసర పరిస్థితుల్లో స్థానిక లైన్ మన్ లేదా ఫీల్డ్ స్టాఫ్‌ను సంప్రదించి సేవలు పొందవచ్చు.

 

 

Advertisement
Advertisement