VD Satheesan | యువత కోసం ఎలాంటి రాజీలేని నవ కేరళంను నిర్మిస్తాం : సీఎం వీడీ సతీశన్
VD Satheesan | యువత కోసం ఎలాంటి రాజీలేని నవ కేరళంను నిర్మిస్తామని నూతన ముఖ్యమంత్రిగా నియమితులైన వీడీ సతీశన్ (VD Satheesan) హామీ ఇచ్చారు. ప్రజలకు సుపరిపాలన అందిస్తామని చెప్పారు.
VD Satheesan | యువత కోసం ఎలాంటి రాజీలేని నవ కేరళంను నిర్మిస్తామని, ప్రజలకు సుపరిపాలన అందిస్తామని కేరళం నూతన ముఖ్యమంత్రిగా నియమితులైన వీడీ సతీశన్ (VD Satheesan) హామీ ఇచ్చారు. శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. "ఒక నవ శకం ప్రారంభం కానుంది. నవ కేరళం ఆవిర్భవించబోతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం బలహీనంగా ఉంది. ఈ విషయం మనందరికీ తెలుసు. ముందుగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలి. రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న ప్రతిదాన్ని మార్చగలమన్న నమ్మకం నాకు ఉంది" అని ఆయన అన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర పార్టీ నాయకత్వానికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర అత్యున్నత పదవి కోసం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీనియర్ నేత రమేష్ చెన్నితల కూడా రేసులో ఉన్న సంగతి తెలిసిందే. వారిని కాదని తనకు ఈ పదవి వరించడంపై కూడా సతీశన్ స్పందించారు. సీఎం పదవి కోసం పోటీలో నిలిచిన పార్టీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితలను కలుపుకుని ముందుకు వెళ్తానని చెప్పారు. "ఈ విజయం నా ఒక్కడిది కాదు. అందరి సమిష్టి కృషి ఫలితం. పార్టీ విజయం కోసం సీనియర్ నేతలు ఎంతో కృషి చేశారు. ఈ విజయంలో కేసీ వేణుగోపాల్, పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ రమేశ్ చెన్నితల కృషి ఎంతో ఉంది. వాళ్లిద్దరూ నా నాయకులు. నాకంటే వారు చాలా సీనియర్లు. కానీ పార్టీ నాకు బాధ్యతలు అప్పగించింది. సీనియర్ నేతలతో కలిసి ముందుకు సాగుతా. నాపై నమ్మకంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించినందుకు పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏఐసీసీ నాయకత్వానికి నేను ఎంతో రుణపడి ఉంటాను" అని సతీశన్ తెలిపారు.
#WATCH | Thiruvananthapuram | After being named Keralam CM, VD Satheesan says, "There will be a new era, a new Kerala. We know the fiscal situation of Kerala is vulnerable. We are hopeful that we can change everything. All AICC leaders called me and congratulated me."
"I have to… pic.twitter.com/bLe3g9FCLM
— ANI (@ANI) May 14, 2026
Also Read..
రెండు కార్ల కాన్వాయ్‌తోనే ప్రధాని మోదీ ప్రయాణం.. వాటి ప్రత్యేకతలు తెలుసా..?
ట్యాంకర్‌ను ఢీ కొట్టడంతో బస్సుకు మంటలు.. నలుగురు సజీవదహనం
సంబంధిత వార్తలు

N Ramachander Rao | మోదీ నేపథ్యం.. కాంగ్రెస్‌కు ఎప్పుడూ కంటగింపే : ఎన్ రామచందర్ రావు
మే 20, 2026

MP Vaddiraju | బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు : ఎంపీ వద్దిరాజు
మే 20, 2026

Adluri Laxman | బీజేపీ ఆదేశాల పార్టీ.. కాంగ్రెస్ ప్రజాస్వామ్య పార్టీ.. ధర్మపురి అరవింద్‌కు మంత్రి అడ్లూరి చురక
మే 19, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



