Keralam CM VD Satheesan | కేరళం ముఖ్యమంత్రిగా వీడీ సతీషన్
Keralam CM Satheesan | గత కొన్ని రోజులుగా కేరళం సీఎంగా ఎవరిని నియమిస్తారనే ఉత్కంఠకు కాంగ్రెస్ అగ్రనేతలు తెరదించారు. కేరళం సీఎంగా వీడీ సతీషన్ నియమించారు. కేసీ వేణుగోపాల్, చెన్నితల సీఎం రేసులో ఉండగా అధిష్టానం సతీషన్ వైపే మొగ్గు చూపింది.
Keralam CM VD Satheesan | త్రినేత్ర.న్యూస్: గత కొన్ని రోజులుగా కేరళం సీఎంగా ఎవరిని నియమిస్తారనే ఉత్కంఠకు కాంగ్రెస్ అగ్రనేతలు తెరదించారు. కేరళం సీఎంగా వీడీ సతీషన్ నియమించారు. ముఖ్యమంత్రిగా ఆయన పేరును అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది. కేసీ వేణుగోపాల్, చెన్నితల సీఎం రేసులో ఉండగా అధిష్టానం సతీషన్ వైపే మొగ్గు చూపింది. త్వరలోనే సీఎంగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఇదీ సతీషన్ నేపథ్యం..
సతీషన్ పూర్తిపేరు వడక్కేయిల్ దామోదరన్ సతీషన్. నెట్టూరు, ఎర్నాకులం జిల్లాలో 1964, మే 31న ఆయన జన్మించారు. పనంపిల్లి నగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. వృత్తిరీత్యా న్యాయవాదైన ఆయన.. NSUI ద్వారా విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఎమ్మెల్యేగా 2001లో మొదటిసారిగా పారావూర్ నియోజకవర్గం నుంచి కేరళ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పటి నుండి వరుసగా ఐదుసార్లు (2001, 2006, 2011, 2016, 2021) అదే నియోజకవర్గం నుంచి గెలుపొంది ప్రజాధరణ పొందారు.
2021లో కేరళం అసెంబ్లీ ఎన్నికల తర్వాత రమేష్ చెన్నితాల స్థానంలో ఆయనను కేరళం శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. అప్పటి నుంచి రాష్ట్ర సమస్యలపై తన గళాన్ని వినిపించారు. గత ప్రభుత్వాన్ని పలుసార్లు ఎండగడుతూ తనదైన ముద్ర వేశారు. ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయంలో సతీషన్ కీలక పాత్ర పోషించారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ బుధవారం సీఎం విషయమై చర్చలు జరిపారు. చర్చలన్నీ ముగిశాయని, సీఎం పేరును గురువారం వెల్లడిస్తామని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ చెప్పారు. మరోవైపు వేణుగోపాల్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తే కేరళం ప్రజలు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని క్షమించబోరని ఓ పోస్టర్ వెలసింది. కాంగ్రెస్ కార్యాలయానికి సమీపంలో వెలసిన మరో పోస్టర్.. వేణుగోపాల్‌ను రాహుల్‌గాంధీ బ్యాగులు మోసేవాడిగా అభివర్ణించింది. ఈ నేపథ్యంలో సీఎంగా సతీషన్‌ను నియమిస్తూ తమ నిర్ణయాన్ని తాజాగా ప్రకటించారు.
ఎలాంటి అసంతృప్తి లేదు: కేసీ వేణుగోపాల్
సతీశన్ ఎంపికపై కేసీ వేణుగోపాల్ స్పందించారు. తనకు ఎలాంటి అసంతృప్తి లేదు. తాను పూర్తిగా సంతృప్తిగా ఉన్నాను. అధిష్ఠానం నిర్ణయాన్ని శిరసా వహిస్తా. కాంగ్రెస్‌లో హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యం. అన్ని రకాలుగా ఆలోచించే అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.
రమేశ్ చెన్నితాల వర్గం అసంతృప్తి..
మరోవైపు సతీశన్ ఎంపిక పట్ల రమేశ్ చెన్నితాల వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. తిరువనంతపురంలోని చెన్నితాల నివాసం వద్ద ఆయన అనుచరులు నిరసనకు దిగారు.
సంబంధిత వార్తలు

BC Caste Census | బీసీ కులగణనపై కాంగ్రెస్ 100 రోజుల ఉద్యమం
సెప్టెంబర్ 5, 2026

Vijay for PM | ప్రధాని అభ్యర్థిగా విజయ్.. కాంగ్రెస్‌తో విభేదాల వేళ సెప్టెంబర్ 9న కూటమి పక్షాలతో టీవీకే భేటీ!
సెప్టెంబర్ 5, 2026

Ramchandar Rao | ఓవైసీ సోదరులకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇవ్వడమంటే దేశాన్ని అవమానించడమే: రాంచందర్‌రావు
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | నర్సు హత్య ఘటనపై మెజిస్ట్రీయల్ విచారణకు సీఎం ఆదేశం
- ●TRESA | ట్రెసా అధ్యక్షులుగా కే గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎల్ రమణ్ రెడ్డి
- ●KCR | సాగునీటి కోసం మరో యుద్ధానికి సిద్ధం : కేసీఆర్
- ●Ananthika | మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ : అనంతిక
- ●Harish Rao | వార్డు మెంబర్ కూడా కాని.. తిరుపతి రెడ్డికి రూ. 40 కోట్లతో భద్రత అవసరమా..?
- ●Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్.. రేవంతే రాజీనామా చేయాలి

CM Revanth Reddy | నర్సు హత్య ఘటనపై మెజిస్ట్రీయల్ విచారణకు సీఎం ఆదేశం

TRESA | ట్రెసా అధ్యక్షులుగా కే గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎల్ రమణ్ రెడ్డి

KCR | సాగునీటి కోసం మరో యుద్ధానికి సిద్ధం : కేసీఆర్

Ananthika | మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ : అనంతిక



