Manne Krishank | బావర్చి హోటల్‌లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ
Manne Krishank | చిక్కడపల్లిలోని బావర్చి హోటల్‌లో గురువారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ నేత కృశాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన డిన్నర్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో హోటల్‌లో ఫర్నిచర్ ధ్వంసమైనట్లు సమాచారం.
- రాహుల్‌గాంధీ ఫొటోతో కృశాంక్ డిన్నర్ కార్యక్రమం.. అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు
- చిక్కడపల్లిలో తీవ్ర ఉద్రిక్తత..
Manne Krishank | చిక్కడపల్లిలోని బావర్చి హోటల్‌లో గురువారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ నేత కృశాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన డిన్నర్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో హోటల్‌లో ఫర్నిచర్ ధ్వంసమైనట్లు సమాచారం. గతంలో ఇదే బావర్చి హోటల్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నిరుద్యోగ యువతతో కలిసి భోజనం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ ఫొటోతో కృశాంక్ డిన్నర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఈ కార్యక్రమంపై అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య మొదలైన వాగ్వాదం కాస్తా ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో కృశాంక్‌పై దాడి చేసి కొట్టినట్లు సమాచారం. హోటల్‌లోని ఫర్నిచర్ కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా చోటుచేసుకున్న పరిణామాలతో హోటల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను శాంతింప చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●One Way | సైబరాబాద్‌లో వన్‌వే రోడ్లు.. స్పెషల్‌గా బస్ లేన్లు!
- ●Constitution Day | రాజ్యాంగాన్ని అర్థం చేసుకోండి.. పరిరక్షించండి..
- ●KTR | ఉద్యోగాలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?
- ●Moosapet | మూసాపేట లేఅవుట్ ఈ-వేలానికి లైన్ క్లియర్.. హైకోర్టు స్టే లేదన్న అధికారులు..!
- ●KCR | సారే రావాలంటున్నది ఈ సర్వే
- ●CM Revanth Reddy | అచ్చంపేటలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్







