Sonakshi Sinha | సోనాక్షి సిన్హా మార్ఫింగ్ ఫొటోల కేసులో కీలక పరిణామం!
Sonakshi Sinha | బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా మార్ఫింగ్ ఫొటోల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఢిల్లీలో అరెస్టు చేసిన నిందితుడు ఆర్యన్ దీపక్ జైన్‌ను విడుదల చేయాలని ముంబయిలోని బాంద్రా కోర్టు ఆదేశించింది. అరెస్టు సమయంలో పోలీసులు చట్టపరమైన నిబంధనలు పాటించలేదని పేర్కొంటూ అరెస్టును అక్రమంగా పేర్కొంది.
Entertainment | Published On Nov 15, 2026, 10.55 am IST
- నిందితుడి అరెస్ట్ అక్రమమన్న బాంద్రా కోర్టు
- యువకుడిని విడుదల చేయాలని ఆదేశాలు
Sonakshi Sinha | బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా మార్ఫింగ్ ఫొటోల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఢిల్లీలో అరెస్టు చేసిన నిందితుడు ఆర్యన్ దీపక్ జైన్‌ను విడుదల చేయాలని ముంబయిలోని బాంద్రా కోర్టు ఆదేశించింది. అరెస్టు సమయంలో పోలీసులు చట్టపరమైన నిబంధనలు పాటించలేదని పేర్కొంటూ అరెస్టును అక్రమంగా పేర్కొంది.
అసలు ఏం జరిగిందంటే..?
వివరాల్లోకి వెళితే.. మార్ఫింగ్ ఫొటోల విషయంలో సోనాక్షి ఫిర్యాదుతో బాంద్రా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ క్రమంలో పోలీసులు శనివారం ఉదయం ఢిల్లీలోని షాహ్‌దరా పరిధి జగత్‌పురి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఆర్యన్‌ను అరెస్టు చేశారు. అనంతరం ముంబయికి తీసుకొచ్చి బాంద్రా కోర్టులో హాజరుపరిచారు. మార్ఫింగ్ ఫొటోలను ఏ ఎలక్ట్రానిక్ డివైజ్‌తో తెలుసుకోవడంతోపాటు తర్వాతి విచారణ కోసం మూడు రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. నిందితుడిని ఢిల్లీ నుంచి ముంబయికి తీసుకొచ్చే ముందు అక్కడి సమీప మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచలేదని కోర్టు గుర్తించింది. అరెస్టుకు ముందు అవసరమైన నోటీసులు ఇవ్వలేదని, అరెస్టుకు గల కారణాలను నిందితుడికి చెప్పలేదని అతని తరఫు న్యాయవాదులు వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించింది.
నిబంధనలు పాటించాల్సిందే..
ఈ కేసులోని నేరాలకు గరిష్టంగా ఏడేళ్ల శిక్ష పడే అవకాశం ఉన్నందున భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్) సెక్షన్ 35(1)(బీ) ప్రకారం అరెస్టుకు సంబంధించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోర్టు స్పష్టం చేసింది. అరెస్టు చేయాల్సిన అవసరానికి సంబంధించిన కారణాలను నమోదు చేయడంలో పోలీసులు సరైన విధానాన్ని పాటించలేదని పేర్కొంది. కేవలం తర్వాతి విచారణ అవసరమనే కారణంతోనే ఒక వ్యక్తిని అరెస్టు చేయడం , ర్బంధించడం సాధ్యం కాదని స్పష్టం చేస్తూ ఆర్యన్‌ను విడుదల చేయాలని ఆదేశించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bomb Threat | మళ్లీ ముంబయి సీఎస్ఎంటీ రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు..!
- ●Akhilesh Yadav | ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు.. 181 సీట్లు అడుగుతున్న కాంగ్రెస్: అఖిలేశ్ యాదవ్
- ●ED Seizes | మాజీ ముఖ్యమంత్రి తనయుడికి ఈడీ షాక్.. రూ.61 కోట్ల ఆస్తులు సీజ్!
- ●TTD | తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఫిబ్రవరి దర్శనాలు, గదుల కోటా రిలీజ్ డేట్స్ ఇవే..!
- ●DK Shivakumar | నా వద్ద డబ్బుల్లేవు.. నా టికెట్ కూడా మీరే తీసుకోండి.. ప్రధాని మోదీతో కర్ణాటక సీఎం
- ●Adventure Motorcycles | బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో మార్కెట్లోకి మూడు అడ్వెంచర్ బైక్స్.. ఇంజిన్, ఫీచర్లు ఇవే!

Bomb Threat | మళ్లీ ముంబయి సీఎస్ఎంటీ రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు..!

Akhilesh Yadav | ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు.. 181 సీట్లు అడుగుతున్న కాంగ్రెస్: అఖిలేశ్ యాదవ్

ED Seizes | మాజీ ముఖ్యమంత్రి తనయుడికి ఈడీ షాక్.. రూ.61 కోట్ల ఆస్తులు సీజ్!

TTD | తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఫిబ్రవరి దర్శనాలు, గదుల కోటా రిలీజ్ డేట్స్ ఇవే..!



