CJP Protest | ఫేక్ అకౌంట్లతో జంతర్‌మంతర్ నిరసనపై తప్పుడు ప్రచారం.. పాక్‌కూ లింకులు: ఢిల్లీ పోలీసులు
CJP Protest | దాదాపుగా 400కుపైగా ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్‌తో జంతర్‌మంతర్ నిరసనపై తప్పుడు ప్రచారం చేశారని ఢిల్లీ పోలీసు తెలిపారు. తప్పుడు వీడియోలను, అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ సెంట్రల్ డీసీపీ రోహిత్ రాజ్‌బీర్ సింగ్ శనివారం మీడియా సమావేశం నిర్వహించారు.
CJP Protest | దాదాపుగా 400కుపైగా ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్‌తో జంతర్‌మంతర్ నిరసనపై తప్పుడు ప్రచారం చేశారని ఢిల్లీ పోలీసు తెలిపారు. తప్పుడు వీడియోలను, అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ సెంట్రల్ డీసీపీ రోహిత్ రాజ్‌బీర్ సింగ్ శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వివరాలు వెల్లడించారు. జంతర్‌మంతర్ నిరసనలకు సంబంధించి ప్రజలను తప్పుదోవ పట్టించేలా వందలాది పోస్టులు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినట్లు పేర్కొన్నారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న 400కుపైగా సోషల్ మీడియా ఖాతాలను గుర్తించామని, వాటిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.
జూలై 20న ఓ మహిళ మృతిచెందిందంటూ వార్త ప్రచారం చేశారని, ఇందులో ఎలాంటి వాస్తవం లేదని పోలీసులు స్పష్టం చేశారు. అలాగే, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌కు సంబంధించిన ఫేక్ వీడియోను గుర్తించినట్లు తెలిపారు. జంతర్‌మంతర్ ప్రాంతంలో సైన్యాన్ని మోహరించారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. జంతర్‌మంతర్ నిరసనలపై ప్రచారంలో ఉన్న పలు వదంతులను ఇప్పటికే ఖండించినట్లు పోలీసులు తెలిపారు. జూలై 20న మరణాలపై జరిగిన ప్రచారం, సైన్యాన్ని రంగంలోకి దించారన్న వార్తలు వాస్తవాలకు విరుద్ధమని తేల్చిచెప్పారు. ఈ తరహా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వారిపై నిఘా కొనసాగుతోందని వెల్లడించారు. సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. నకిలీ వార్తలు, వీడియోలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దర్యాప్తులో పాకిస్థాన్ నుంచి నిర్వహిస్తున్న కొన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా తప్పుడు ప్రచారం సాగుతున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వదంతులను నమ్మకుండా అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్నే విశ్వసించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
#WATCH | Delhi: On the misleading and false information related to Jantar Mantar protest, DCP Central Rohit Rajbir Singh says, "A protest has been going on at Jantar Mantar for the past several weeks by the Cockroach Janata Party... Information on social media goes viral very… pic.twitter.com/eStIyMXa1Y
— ANI (@ANI) July 25, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●KTR | ప్రజాశక్తి ఎప్పుడూ గొప్పదే.. కేటీఆర్ ట్వీట్ వైరల్..!
- ●Indiramma Towers | ఇందిరమ్మ టవర్స్.. హెల్ప్‌లైన్ నంబర్ ఇదే
- ●CJP Protest Withdrawn | ఢిల్లీలో చల్లారిన 'నీట్' మంటలు: డిమాండ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఆందోళన విరమించిన సీజేపీ
- ●Prabhas | ప్రభాస్ సినిమా చేయడం నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు - డైలాగ్ రైటర్ కామెంట్స్
- ●Mahesh Kumar Goud | మోదీ తలవంచక తప్పలేదు
- ●Nitin Nabin BJP | ధర్మేంద్ర ప్రధాన్ నిజాయతీకి నిదర్శనం : నితిన్ నబిన్

KTR | ప్రజాశక్తి ఎప్పుడూ గొప్పదే.. కేటీఆర్ ట్వీట్ వైరల్..!

Indiramma Towers | ఇందిరమ్మ టవర్స్.. హెల్ప్‌లైన్ నంబర్ ఇదే

CJP Protest Withdrawn | ఢిల్లీలో చల్లారిన 'నీట్' మంటలు: డిమాండ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఆందోళన విరమించిన సీజేపీ

Prabhas | ప్రభాస్ సినిమా చేయడం నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు - డైలాగ్ రైటర్ కామెంట్స్





