Ponnam Prabhakar | వర్షాల కోసం 108 కలశాలతో అభిషేకం.. మంత్రి పొన్నం వరుణయాగం
Ponnam Prabhakar | రాష్ట్రంలో సమృద్ధిగా కురవాలని ప్రార్థిస్తూ.. భద్రకాళి సమతే కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వరుణయాగం నిర్వహించారు.
Ponnam Prabhakar | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో సమృద్ధిగా కురవాలని ప్రార్థిస్తూ.. భద్రకాళి సమతే కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వరుణయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు.

కాకతీయుల కాలం నాటి భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్రస్వామి మహిమ గల దేవుడు. ఈ ప్రాంత ప్రజలకు విశ్వాసం కలిగిన భగవంతుడు. ఇక్కడ వరుణయగం చేయడం వల్ల ఈ ప్రాంతమంతా సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని స్వామి వారికి 108 కలశాలతో అభిషేకాలు చేయడం జరిగింది. స్వామి వారికి యజ్ఞ యాగాలు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.

ఎల్ నినో పరిస్థితుల్లో వర్షాలు పడవని శాస్త్రవేత్తలు చెబుతున్న సమాజం భగవంతుని మీద విశ్వాసం ఉన్న దృష్ట్యా యావత్ తెలంగాణలోని అన్ని దేవాలయాల్లో వరుణ యాగాలు ,ఇతర పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను హైదరాబాద్ ఇంచార్జి మంత్రిగా హైదరాబాద్‌లో జరుగుతున్న బోనాల పండుగ సందర్భంగా అన్ని దేవాలయాల్లో అమ్మవారిని ప్రార్థిస్తూ మంచి వర్షాలు పడాలని పూజలు చేయడం జరుగుతుంది. మహిమత్వం గల కాకతీయుల కాలం నాటి భద్రకాళి సమేత కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో వరుణయాగం చేసి మంచి వర్షాలు పడాలని స్వామి వారిని వేడుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం దేశమంతా సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్థించడం జరిగింది అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాన్మరణం
- ●Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..
- ●Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాన్మరణం

Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..

Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..

Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?






