Supreme Court | ఐదుగురు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం.. సుప్రీంకోర్టులో 37కి పెరిగిన జడ్జీల సంఖ్య
Supreme Court | సుప్రీంకోర్టు (Supreme Court)లో జడ్జీల సంఖ్య 37కు (జస్టిస్ సూర్యకాంత్ తో కలిపి) పెరిగింది (SC judges strength rises to 37). కొలీజియం సిఫార్సు చేసిన ఐదుగురు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమాణస్వీకారం చేశారు.
Supreme Court | సుప్రీంకోర్టు (Supreme Court)లో జడ్జీల సంఖ్య 37కు (జస్టిస్ సూర్యకాంత్ తో కలిపి) పెరిగింది (SC judges strength rises to 37). కొలీజియం సిఫార్సు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం నిన్న ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. సీనియర్ న్యాయవాది వి మోహన, పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగు, బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ సచ్‌దేవ, జమ్ము కశ్మీర్, లద్దాఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ పల్లిని సుప్రీంకోర్టు జడ్జిలుగా పదోన్నతి కల్పించింది.
దీంతో వారు నేడు సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమాణస్వీకారం చేశారు. కొత్తగా నియమితులైన ఐదుగురు న్యాయమూర్తులతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (CJI Surya Kant) ప్రమాణస్వీకారం చేయించారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం ఇటీవలే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచుతూ ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఓ న్యాయమూర్తి స్థానం ఇంకా ఖాళీగానే ఉన్నది.
కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన న్యాయమూర్తుల్లో జస్టిస్ వి. మోహన బార్ కౌన్సిల్ నుంచి నేరుగా సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందిన దేశంలో రెండో మహిళగా చరిత్ర సృష్టించారు. 2018లో జస్టిస్ ఇందు మల్హోత్రా తర్వాత ఈ ఘనత సాధించిన రెండో మహిళ మోహన కావడం విశేషం. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సేవలందిస్తున్న మహిళా న్యాయమూర్తులలో జస్టిస్ బీవీ నాగరత్నతో మోహన కలవనున్నారు. 2021 ఆగస్టు 31 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ నాగరత్న 2027లో సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు.
Also Read..
విదేశీయుల వీసా నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు.. కొత్త రూల్స్ ఇవే..
కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదు.. ఎన్నారై బీఆర్ఎస్ యూకే కార్యవర్గం
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Supreme Court | సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సుబ్రమణి మోహన.. నేరుగా అపెక్స్ కోర్టుకు వెళ్లిన రెండో మహిళగా ఘనత..!
జూన్ 1, 2026

Supreme Court | సీబీటీ విధానం కుదరదు.. నీట్ రీ ఎగ్జామ్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జూన్ 1, 2026

Supreme Court Judges | సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం
జూన్ 1, 2026
తాజావార్తలు
- ●Siddaramaiah | డీకేతో ఒప్పందం.. రాజీనామా చేసినా సీఎం బంగ్లాలోనే సిద్ధరామయ్య..!
- ●Trisha | ట్రోలర్స్‌కు త్రిష కౌంటర్ - ఆ హక్కు ఎవరికీ లేదంటూ వార్నింగ్
- ●Mandula Samuel | తెలంగాణలో మళ్లీ ఆంధ్రోళ్ల పెత్తనమేంది: మందుల సామెల్
- ●Congress Vs Janasena | హైదరాబాద్‌లో హైటెన్షన్.. గన్ పార్క్ వద్ద కాంగ్రెస్, జనసేన కార్యకర్తల మధ్య తోపులాట.. పోటాపోటీ నినాదాలు
- ●Addanki Dayakar | చేగువేరా వారసుడిగా ఉండి.. హిందూ ధర్మాన్ని నమ్మడం ఏంటో..
- ●LIC | దంపతుల కోసం ఎల్ఐసీ కొత్త సేవింగ్స్ ప్లాన్స్.. ఒకే పాలసీలో డబుల్ భద్రత..

Siddaramaiah | డీకేతో ఒప్పందం.. రాజీనామా చేసినా సీఎం బంగ్లాలోనే సిద్ధరామయ్య..!

Trisha | ట్రోలర్స్‌కు త్రిష కౌంటర్ - ఆ హక్కు ఎవరికీ లేదంటూ వార్నింగ్

Mandula Samuel | తెలంగాణలో మళ్లీ ఆంధ్రోళ్ల పెత్తనమేంది: మందుల సామెల్

Congress Vs Janasena | హైదరాబాద్‌లో హైటెన్షన్.. గన్ పార్క్ వద్ద కాంగ్రెస్, జనసేన కార్యకర్తల మధ్య తోపులాట.. పోటాపోటీ నినాదాలు



