త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Addanki Dayakar | చేగువేరా వార‌సుడిగా ఉండి.. హిందూ ధ‌ర్మాన్ని న‌మ్మ‌డం ఏంటో..

Addanki Dayakar | చేగువేరా వార‌సుడిగా ఉండి హిందూ ధ‌ర్మాన్ని న‌మ్మ‌డం ఏంటోన‌ని సినీ న‌టుడు, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ప్ర‌భుత్వ విప్ అద్దంకి దయాక‌ర్ విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం రోజున ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌వ నిర్మాణ స‌భ కోసం అర్జీ పెట్టుకుంటే ప్ర‌భుత్వం తిర‌స్క‌రించింది. ఇంట్లో కూడా అనుమ‌తి ఇవ్వ‌మ‌న్నా ఇవ్వ‌లేద‌న్నారు.

P

Telangana | Published On Jun 2, 2026, 3.13 pm IST

Addanki Dayakar | చేగువేరా వార‌సుడిగా ఉండి.. హిందూ ధ‌ర్మాన్ని న‌మ్మ‌డం ఏంటో..
Advertisement
  • ఏపీ డిప్యూటీ సీఎంగా ఉండి ప్ర‌జ‌ల మ‌ధ్య వైరానికి కుట్ర
  • ప‌వ‌న్ రాజ‌కీయం ఏంటో తెలియ‌దు
  • బీజేపీకి జ‌న‌సేత అధినేత ఓ బూస్ట‌ర్‌
  • ప్ర‌భుత్వ ద‌యాక‌ర్ అద్దంకి ద‌యాక‌ర్

Addanki Dayakar | చేగువేరా వార‌సుడిగా ఉండి హిందూ ధ‌ర్మాన్ని న‌మ్మ‌డం ఏంటోన‌ని సినీ న‌టుడు, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ప్ర‌భుత్వ విప్ అద్దంకి దయాక‌ర్ విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం రోజున ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌వ నిర్మాణ స‌భ కోసం అర్జీ పెట్టుకుంటే ప్ర‌భుత్వం తిర‌స్క‌రించింది. ఇంట్లో కూడా అనుమ‌తి ఇవ్వ‌మ‌న్నా ఇవ్వ‌లేద‌న్నారు. ప‌వ‌న్ ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉండి ప్ర‌జ‌ల మ‌ధ్య వైరానికి కుట్ర‌కు తెర‌లేపుతున్నార‌ని ఆరోపించారు. మోదీ, బీజేపీ పవన్ క‌ల్యాణ్‌ను బ‌లి చేయొద్ద‌ని, ఆయ‌న‌కు రాజ‌కీయం ఏదీ తెలియ‌ద‌న్నారు. కేవ‌లం బీజేపీకి అనుకూలంగా మారార‌ని విమ‌ర్శించారు. రాష్ట్ర ఆవ‌త‌ర‌ణ దినోత్స‌వం రోజున ప‌వ‌న్ వైరం పెంచాల‌నుకుంటున్నార‌ని, మోదీ, ఎన్‌డీఏ కూట‌మి ఓట్ల‌తో గెలుస్తార‌ని.. కాషాయ పార్టీకి ప‌వ‌న్ బూస్ట‌ర్ లాంటివాడ‌న్నారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను పావుగా..

పవన్ క‌ల్యాణ్‌ణు బీజేపీ పావుగా వాడుతోంద‌ని, త‌ర్వాత తెలంగాణ అంటే ఏమో అనుకున్నాన‌న్నారు. బీజేపీ వాళ్లకు ధాన్యం కొనుమంటే చేతకాద‌ని, నిధులు సైతం కేటాయించ‌ర‌ని.. కానీ బీఆర్ఎస్ అనుకూల వాతావ‌ర‌ణం తెచ్చేందుకు బీజేపీ ప‌వ‌న్‌తో ప్ర‌య‌త్నిస్తుంద‌న్నారు. తెలంగాణ సెంటిమెంట్ రాజేసి బీఆర్ఎస్‌ని పెద్ద చెయ్యాలని చూస్తున్నార‌ని, తెలంగాణ ప్రజలు శాంతియుతంగా ఉండడం మీకు ఇష్టం లేదా? అంటూ ప్ర‌శ్నించారు. తెలంగాణ వస్తె ఉపవాసం చేసిన అన్నాడ‌ని గుర్తు చేసిన ద‌యాక‌ర్‌.. మొదట ఏపీని ప‌రిపాలించాలంటూ చుర‌క‌లంటించారు. ఏపీ పచ్చగా ఉండాలని కోరుకునే వాళ్లే తెలంగాణ వాళ్ల‌మ‌న్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత వాతావరణ ప్రభుత్వం ఆలోచిస్తుంద‌ని.. తెలంగాణ ఆత్మగౌరం మీద దెబ్బకొడితే ఊరుకునేది లేద‌న్నారు. బీజేపీ నల్లికుట్లోల్ల లాగా పంచాయతీలు పెట్టి కూర్చుంటార‌ని విమ‌ర్శించారు.

కేసీఆర్‌కు ప‌ట్టింపు లేదా?

హౌస్‌లో ఉన్న కేసీఆర్‌కు ప‌ట్టింపు లేదా? ఇలాంటి వ్యాఖ్య‌ల‌పై కేసీఆర్ ప‌రివారం స్పందించ‌డం లేద‌ని ఆరోపించారు. తెలంగాణ అమరవీరుల వద్ద ఎప్పుడైనా ప‌వ‌న్ నివాళులర్పించారా? అంటూ ప్ర‌శ్నించారు. తెలంగాణ‌పై బీజేపీ, మోదీ నిలువెల్లా విషం క‌క్కుతున్నార‌న్నారు. బీజేపీ ఎంపీలు పాకిస్తాన్‌తో పోలుస్తున్నార‌ని, ఆ పార్టీ నేత‌ల‌కు ఆత్మ‌గౌర‌వం లేద‌ని మండిప‌డ్డారు. ప్రజల మధ్య కొట్లాటలు పెట్టాలి.. ఆందోళనలు చెయ్యాలి నాకు రాజ్యపీఠం కావాలని బీజేపీ చూస్తుంద‌న్నారు. ప్రజా మధ్య వైరుధ్యాలు, శాంతి లేకుండా చేస్తున్నార‌న్నారు. ప్రభుత్వం త‌ర‌ఫున ఒక ఉప ముఖ్యమంత్రిగా గౌరం ఇస్తున్నామ‌ని.. కొండగట్టు యాత్రకు, వారాహి యాత్రకు అన్ని పర్మిషన్‌లు ఇచ్చిన విష‌యాన్ని గుర్తు చేశారు. నీ సమావేశం లక్ష్యం ఎవరి కోసం? ఎందుకు కోసమో తెలుసుకో అంటూ ఘాటుగా స్పందించారు.

తెలంగాణ ఉద్య‌మ గ‌డ్డ‌

తుపాకీ గుండ్లకు ఎదురొడ్డి కొట్లాడి ఉద్యమగడ్డ తెలంగాణ అని, త్యాగాలను స్మ‌రించుకోవాల‌ని అద్దంకి ద‌యాక‌ర్ సూచించారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ అవకాశం ఇస్తున్నామ‌ని, బీజేపీ ఇలాంటివి ప్రోత్సహించడం స‌రికాద‌న్నారు. పవన్ ను తీసుకొచ్చి సెంటిమెంట్ రాజకీయం చెయ్యడం అంటే స‌రికాద‌న్న ఆయ‌న‌.. తెలంగాణ సర్వముఖాభివృద్ధి కోసం కేంద్రంతో సీఎం సఖ్యతగా ఉంట‌న్నార‌న్నారు. ఒక నాయకుడు అందరితో సమన్వయంగా ఉండటం త‌ప్పా అంటూ ప్ర‌శ్నించారు. బీజేపీ రాజకీయం చేసి వాడుకొని వదిలేయటం తెలుసున‌ని.. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ మోసాలు చేస్తుంద‌ని.. విషకౌగిలి అంటూ ఆరోపించారు. సిద్ధాంత పునాదులు ఏర్పాటు చేసుకొని రాజకీయం చేసుకోవాల‌ని సూచించారు. మోదీ కలిసి వెళ్లిన తర్వాతే ఇవన్నీ జ‌రుగుతున్నాయ‌ని, తెలంగాణపై దాడి జ‌రుగుతుంటే బీజేపీ మౌనం అంగీకార‌మే క‌దా? అంటూ అనుమానాలు వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement