Telangana Formation Day | తెలంగాణ గడ్డ ఎప్పుడూ లొంగిపోదు.. హక్కుల కోసం రాజీపడదు : స్విట్జర్లాండ్ బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ గందె
TTelangana Formation Day | తెలంగాణ గడ్డ ఎప్పుడూ లొంగిపోవడాన్ని ఒప్పుకోదు, హక్కుల కోసం రాజీపడదని స్విట్జర్లాండ్ బీఆర్ఎస్ నాయకులు (Switzerland BRS Leader) శ్రీధర్ గందె (Sridhar Gande) పేర్కొన్నారు. నేడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
Telangana Formation Day | నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం (Telangana Formation Day). ఈ సందర్భంగా స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న తెలంగాణ వాసులు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. స్విట్జర్లాండ్ బీఆర్ఎస్ నాయకులు (Switzerland BRS Leader) శ్రీధర్ గందె (Sridhar Gande) రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ ఆడపడుచులకు, అన్నదమ్ములకు, తోటి గులాబీ సైనికులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలందరికీ శ్రీధర్ గందె రాష్ట్ర అవతరణ దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు కేవలం ఒక క్యాలెండర్ తేదీ కాదని.. ఇది ఆరు దశాబ్దాల ఆరాటాన్ని, పోరాటాన్ని, చావు నోట్లో తలపెట్టి సాధించిన మన స్వరాష్ట్ర స్వప్నాన్ని గుర్తుచేసే రోజు అని పేర్కొన్నారు. నాడు గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ప్రాణాలను పణంగా పెట్టి, కాళ్ళు అరిగిపోయేలా తిరిగిన ఉద్యమ గడ్డ ఇది అని తెలిపారు.
నాడు "మా నీళ్లు మాకు, మా నిధులు మాకు, మా నియామకాలు మాకు" అని గల్లా ఎగరేసి, ఢిల్లీ పీఠాల మెడలు వంచి సాధించుకున్న ఆత్మగౌరవ ప్రతీక మన తెలంగాణ. రాష్ట్రాన్ని సాధించడమే కాదు.. శూన్యం నుండి నవ నిర్మాణాన్ని ఎలా చేయాలో దేశానికి చూపించిన ఘనత మన కేసీఆర్ గారిది. ఎండిపోయిన పగుళ్ల భూముల్లో కాళేశ్వరం జలాలతో పచ్చని పంటలు పండించి, దేశానికి అన్నపూర్ణగా మార్చారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలతో మన ఊళ్లను, మన ఇంటి ఆడబిడ్డల నీటి కష్టాలను తీర్చారు.
మన గ్లోబల్ లీడర్ కేటీఆర్ (KTR) నాయకత్వంలో ఐటీ, ఇండస్ట్రీస్ రంగాల్లో హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నంబర్ వన్‌గా నిలబెట్టారు. గల్లీ నుండి గ్లోబల్ దాకా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను స్కై-హై లెవెల్‌కి తీసుకెళ్లారు. రాజకీయంగా తాత్కాలికంగా ఏ మార్పులు వచ్చినా.. తెలంగాణ ప్రజల గుండెల్లో, ఈ నేల ప్రతి అంగుళంలో కేసీఆర్ గీసిన ముద్ర శాశ్వతం. తెలంగాణ గడ్డ ఎప్పుడూ లొంగిపోవడాన్ని ఒప్పుకోదు, హక్కుల కోసం రాజీపడదు. మన ప్రగతిని అడ్డుకోవాలని చూసే శక్తులకు, ఢిల్లీ గులాములకు గట్టిగా బుద్ధి చెప్పే చైతన్యం మన సొంతం. ఈ శుభదినాన, నాడు అమరులైన వీరుల త్యాగాలను స్మరించుకుంటూ, మన కేసీఆర్, కేటీఆర్ మార్గదర్శకత్వంలో బంగారు తెలంగాణ పునర్నిర్మాణం కోసం మళ్లీ అలుపెరగని పోరాటం చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం..! రాష్ట్రాన్ని కాపాడుకుందాం, ప్రగతి పథంలో మన నాయకుల వెంటే నడుద్దాం..! అని శ్రీధర్ గందె పిలుపునిచ్చారు.
సంబంధిత వార్తలు

High Court | పవన్‌కు షాక్.. హౌస్ మోషన్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు
జూన్ 2, 2026

Deshapathi Srinivas | తెలంగాణ మీద గద్దలు తిరుగుతున్నయ్.. శత్రువులకు తలుపులు తెరిచే ద్రోహి ఉన్నడిక్కడ: దేశపతి శ్రీనివాస్ ఫైర్
జూన్ 2, 2026

Telangana Formation Day | కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదు.. ఎన్నారై బీఆర్ఎస్ యూకే కార్యవర్గం
జూన్ 2, 2026
తాజావార్తలు
- ●High Court | పవన్‌కు షాక్.. హౌస్ మోషన్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు
- ●Electric Vehicles | EVల వైపు భారత్ పరుగులు.. పెట్రోల్ ధరల షాక్‌తో ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ డిమాండ్..
- ●Amazon Music | అమెజాన్ మ్యూజిక్‌లో భారీ మార్పులు.. కొత్త అన్లిమిటెడ్ ప్లాన్ ప్రారంభం..
- ●Deshapathi Srinivas | తెలంగాణ మీద గద్దలు తిరుగుతున్నయ్.. శత్రువులకు తలుపులు తెరిచే ద్రోహి ఉన్నడిక్కడ: దేశపతి శ్రీనివాస్ ఫైర్
- ●Supreme Court | ఐదుగురు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం.. సుప్రీంకోర్టులో 37కి పెరిగిన జడ్జీల సంఖ్య
- ●Foreigners | విదేశీయుల వీసా నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు.. కొత్త రూల్స్ ఇవే..

High Court | పవన్‌కు షాక్.. హౌస్ మోషన్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు

Electric Vehicles | EVల వైపు భారత్ పరుగులు.. పెట్రోల్ ధరల షాక్‌తో ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ డిమాండ్..

Amazon Music | అమెజాన్ మ్యూజిక్‌లో భారీ మార్పులు.. కొత్త అన్లిమిటెడ్ ప్లాన్ ప్రారంభం..

Deshapathi Srinivas | తెలంగాణ మీద గద్దలు తిరుగుతున్నయ్.. శత్రువులకు తలుపులు తెరిచే ద్రోహి ఉన్నడిక్కడ: దేశపతి శ్రీనివాస్ ఫైర్



