Mandula Samuel | తెలంగాణలో మళ్లీ ఆంధ్రోళ్ల పెత్తనమేంది: మందుల సామెల్
Mandula Samuel | కొట్లాడి, పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ ఆంధ్రానేతల పెత్తనమేందని.. పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే తాట తీస్తామని తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ ఫైరయ్యారు. ఇంకా మీరు పెత్తనం చెలయించాలని చూస్తే చూస్తే మేం చూస్తూ ఊరుకునేంత చేతగాని వాళ్లం కాదని హెచ్చరించారు.
- తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచొద్దు
- అలా చేస్తే మీ అభిమానులే మీకు శత్రువులైతరు
- మా మీద పెత్తనం చేస్తే తాట తీస్తాం
- మా పొయ్యిల కాలు పెడితే కాలిపోతరు
- పవన్ కళ్యాణ్‌పై ఎమ్మెల్యే మందుల సామెల్ ఫైర్
Mandula Samuel | త్రినేత్ర.న్యూస్: కొట్లాడి, పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ ఆంధ్రానేతల పెత్తనమేందని.. పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే తాట తీస్తామని తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ ఫైరయ్యారు. తెలంగాణలో ఎవరైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కత్తులతో కోలాటమాడుతామని హెచ్చరించారు. ఇంకా మీరు పెత్తనం చెలయించాలని చూస్తే చూస్తే మేం చూస్తూ ఊరుకునేంత చేతగాని వాళ్లం కాదని హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్‌పై నిప్పులు చెరిగారు.
అప్పుడు 11 రోజులు ఉపాసమున్నడట..
తెలంగాణలో ఎవరైనా బతకొచ్చు. అన్నదముల్లా కలిసే ఉందాం. కానీ తెలంగాణ వ్యవస్థను, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతిస్తే అస్సలు ఊరుకునేది లేదు. కొట్లాడి, పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ ఆంధ్రా నేతల పెత్తనం ఏంటి? తెలంగాణ ఏర్పడిన తర్వాత 11 రోజులు తాను పస్తులు ఉన్నానని పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. పవన్ మాటలు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానీకంపై విషం కక్కేలా ఉన్నాయి. తెలంగాణ రావడం ఇష్టం లేకనే పవన్ కళ్యాణ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని ఎమ్మెల్యే సామెల్ ధ్వజమెత్తారు.
మా దిష్టి తాకి కొబ్బరి తోటలు ఎండిపోయినయా?
పవన్ కళ్యాణ్ మూవీలకు తెలంగాణాలో అభిమానులు ఉన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బతీస్తే వాళ్లే మీ శత్రువులవుతారు. 60 ఏళ్లుగా ఆంధ్ర వలస పాలకుల చేతిలో మేము గోసపడ్డాం. తెలంగాణ దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి తోటలు ఎండిపోయినయ్ అంటున్నవ్. కానీ నీకు దిష్టి కూడా కడతం. ఎనకట మా పెండ్లీలకు పోతే మసిబొంత, షిబ్బి కట్టేటోళ్లు.. నీకు గూడా అట్లనే కడుతం. మా ఇంట్లో, మా పొయ్యిలో మీరు అడుగు పెడితే కాలిపోతరన్న విషయం మరవొద్దు అని సామెల్ హెచ్చరించారు.
ఏనాడూ మీ అంచుకు రాలే..
సినిమాలు చేయండి.. చిందులేయండి.. కానీ మా మీద పెత్తనం చూపెట్టాలని చూస్తే తాట తీస్తాం. సబ్బండ వర్గాల ఉద్యమం, వందల మంది బలిదానాలు, త్యాగాల మీద తెలంగాణ ఏర్పడ్డది. దోసుకుని దాసుకోవడం మీకు అలవాటైంది. మేం ఏనాడూ మీ అంచుకు రాలే. మీ కంచంల పొత్తు లేదు మాకు. కానీ తెలంగాణ అనేది ఆత్మగౌరవానికి సంబంధించింది అని ఎమ్మెల్యే మందుల సామెల్ గుర్తు చేశారు.
సంబంధిత వార్తలు

RTC MD Nagireddy | రాష్ట్ర ప్రగతిలో ఆర్టీసీ భాగమవడం గర్వకారణం: ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
జూన్ 2, 2026

One India-One Nation | ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ అమలుకు కేంద్రం కసరత్తు
జూన్ 2, 2026

Kunamneni Sambasiva Rao | “ఇప్పటి కంటే ఉమ్మడి రాష్ట్రమే నయం.. పవన్ కల్యాణ్ సభకు పర్మిషన్ ఇవ్వాల్సింది” – కూనంనేని సెన్సేషనల్ కామెంట్స్
జూన్ 2, 2026
తాజావార్తలు
- ●Alleti Maheshwar Reddy | బీజేపీ వస్తేనే నీళ్లు, నియామకాలు: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి
- ●dust storm | రాజస్థాన్‌లో దుమ్ము తుఫాను విధ్వంసం.. ఇద్దరు చిన్నారులు మృతి
- ●Rashmika Mandanna | రష్మిక గ్లామర్ రచ్చ - లెస్బియన్ లవ్‌స్టోరీపై క్లారిటీ - కాక్టెయిల్ 2 ట్రైలర్ రిలీజ్
- ●NHPC | పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. NHPC లో 6 శాతం వాటా విక్రయం.. ఇప్పుడు కొనవచ్చా..?
- ●RTC MD Nagireddy | రాష్ట్ర ప్రగతిలో ఆర్టీసీ భాగమవడం గర్వకారణం: ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
- ●Annamalai | తమిళనాడులో బీజేపీకి షాక్.. అన్నామలై రాజీనామా

Alleti Maheshwar Reddy | బీజేపీ వస్తేనే నీళ్లు, నియామకాలు: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి

dust storm | రాజస్థాన్‌లో దుమ్ము తుఫాను విధ్వంసం.. ఇద్దరు చిన్నారులు మృతి

Rashmika Mandanna | రష్మిక గ్లామర్ రచ్చ - లెస్బియన్ లవ్‌స్టోరీపై క్లారిటీ - కాక్టెయిల్ 2 ట్రైలర్ రిలీజ్

NHPC | పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. NHPC లో 6 శాతం వాటా విక్రయం.. ఇప్పుడు కొనవచ్చా..?



