Trisha | ట్రోలర్స్‌కు త్రిష కౌంటర్ – ఆ హక్కు ఎవరికీ లేదంటూ వార్నింగ్
ఇటీవలే హీరో అజిత్ తల్లి చనిపోవడంతో అతడిని తమిళనాడు సీఎం దళపతి విజయ్ పరామర్శించారు. త్రిషతో కలిసి ప్రభుత్వ కాన్వాయ్‌లో అజిత్ ఇంటికి విజయ్ రావడంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ విమర్శలపై త్రిష రియాక్ట్ అయ్యింది....
Entertainment | Published On Jun 2, 2026, 3.31 pm IST
Trisha | గత కొన్నాళ్లుగా తమిళనాడు రాజకీయాలు సీఎం దళపతి విజయ్‌తో పాటు హీరోయిన్ త్రిష చుట్టే తిరుగుతున్నాయి. వీరిద్దరి మధ్య ఉన్న బంధంపై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. వీటిపై అటు విజయ్‌తో పాటు ఇటు త్రిష సైలెంట్‌గా ఉంటున్నారు. ఇటీవలే కోలీవుడ్ హీరో అజిత్ తల్లి మరణించడంతో అతడిని పరామర్శించడానికి త్రిషతో కలిసి దళపతి విజయ్ రావడం తమిళనాట చర్చనీయాంశంగా మారింది. గతంలో ఓ తమిళ ప్రొడ్యూసర్ కొడుకు పెళ్లి వేడుకలో కూడా విజయ్, త్రిష స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెలువడిన రోజు కూడా విజయ్ ఇంటికి వెళ్లిన త్రిష అతడికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పింది. సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన వేడుకలో త్రిష సందడి చేసింది. భార్య సంగీతకు విడాకులు ఇచ్చి త్రిషను విజయ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది వీరి పెళ్లిపై అధికారిక ప్రకటన రావచ్చునని అంటున్నారు.
ప్రభుత్వ కాన్వాయ్‌లో...
అజిత్‌ను పరామర్శించడానికి విజయ్‌తో కలిసి త్రిష వెళ్లడంపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కాన్వాయ్‌లో త్రిషను తీసుకొని అజిత్ ఇంటికి విజయ్ రావడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. సెలిబ్రిటీల వ్యక్తిగత ట్రిప్‌లకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కరెక్ట్ కాదంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇద్దరి మధ్య ఏముందో చెప్పకుండా కలిసి తిరగడం ఏంటి? ఇకనైనా ఈ దాగుడుమూతలు ఆపి విజయ్‌ని పెళ్లి చేసుకోవచ్చుగా అంటూ త్రిషపై నెగెటివ్ కామెంట్లు చేశారు.
త్రిష రియాక్షన్...
ఈ ట్రోల్స్‌పై త్రిష తనదైన శైలిలో స్పందించింది. సోషల్ మీడియాలో తన పెట్‌డాగ్ ఫొటో పెట్టింది. నా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు దీనికి తప్ప ఎవరికి లేదు అంటూ అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టింది. తనను విమర్శిస్తోన్న వారికి సమాధానంగానే త్రిష ఈ పోస్ట్ పెట్టిందని నెటిజన్లు అంటున్నారు. తన జీవితంపై కామెంట్ చేసే హక్కు ఎవరికి లేదని ఈ పోస్ట్‌తో చెప్పిందని అంటున్నారు. త్రిష పోస్ట్ వైరల్ అవుతోంది.
కరుప్పుతో బ్లాక్ బస్టర్
కాగా ఇటీవలే కరుప్పు మూవీతో త్రిష ప్రేక్షకుల ముందుకొచ్చింది. సూర్య హీరోగా నటించిన ఈ తమిళ మూవీ 300 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తెలుగులో త్రిష హీరోయిన్‌గా నటించిన విశ్వంభర రిలీజ్‌కు రెడీగా ఉంది. చిరంజీవి హీరోగా సోషియా ఫాంటసీ కథతో రూపొందిన ఈ మూవీకి వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Trisha | కోలీవుడ్ హీరోతో బోటులో నయనతార, త్రిష షికార్లు – ఫొటోలు వైరల్
జూన్ 1, 2026

Kollywood | సాఫ్ట్ అండ్ బోల్డ్ కాంబో … ఇద్దరు హీరోయిన్లతో కోలీవుడ్ డైరెక్టర్ లేడీ ఓరియెంటెడ్ మూవీ!
జూన్ 1, 2026

OTT | ఓటీటీలోకి లోకేష్ కనగరాజ్ రొమాంటిక్ మూవీ – హీరోయిన్‌గా హైదరాబాద్ బ్యూటీ
మే 31, 2026
తాజావార్తలు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో రికవరీ.. 383 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..
- ●CBSE | 2 నిమిషాల్లో 15 లక్షల సైబర్ దాడులు.. రీవాల్యుయేషన్ పోర్టల్ హ్యాక్‌కు గురవడంపై సీబీఎస్ఈ బోర్డు క్లారిటీ
- ●Tollywood | తెలంగాణ యాస వచ్చినోళ్లకు సినిమా ఛాన్స్ - జమ్మికుంట కథతో రాజు వెడ్స్ రాంబాయి మేకర్స్ కొత్త మూవీ
- ●Alleti Maheshwar Reddy | బీజేపీ వస్తేనే నీళ్లు, నియామకాలు: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి
- ●dust storm | రాజస్థాన్‌లో దుమ్ము తుఫాను విధ్వంసం.. ఇద్దరు చిన్నారులు మృతి
- ●Rashmika Mandanna | రష్మిక గ్లామర్ రచ్చ - లెస్బియన్ లవ్‌స్టోరీపై క్లారిటీ - కాక్టెయిల్ 2 ట్రైలర్ రిలీజ్

Stock Markets | స్టాక్ మార్కెట్లలో రికవరీ.. 383 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..

CBSE | 2 నిమిషాల్లో 15 లక్షల సైబర్ దాడులు.. రీవాల్యుయేషన్ పోర్టల్ హ్యాక్‌కు గురవడంపై సీబీఎస్ఈ బోర్డు క్లారిటీ

Tollywood | తెలంగాణ యాస వచ్చినోళ్లకు సినిమా ఛాన్స్ - జమ్మికుంట కథతో రాజు వెడ్స్ రాంబాయి మేకర్స్ కొత్త మూవీ

Alleti Maheshwar Reddy | బీజేపీ వస్తేనే నీళ్లు, నియామకాలు: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి



