త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | సీబీటీ విధానం కుద‌ర‌దు.. నీట్ రీ ఎగ్జామ్‌పై సుప్రీంకోర్టు కీల‌క ఆదేశాలు

Supreme Court | నీట్ రీఎగ్జామ్‌పై సుప్రీంకోర్టు తాజాగా కీల‌క ఆదేశాలు జారీ చేసింది. ఈసారి నీట్ ప‌రీక్ష‌ను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వ‌హించాలంటూ దాఖ‌లైన పిటిష‌న్‌ను ధ‌ర్మాస‌నం తిర‌స్క‌రించింది. ఓఎంఆర్ ప‌ద్ధ‌తిలోనే నిర్వ‌హించాల‌ని స్ప‌ష్టం చేసింది.

D

National | Published On Jun 1, 2026, 4.40 pm IST

Supreme Court | సీబీటీ విధానం కుద‌ర‌దు.. నీట్ రీ ఎగ్జామ్‌పై సుప్రీంకోర్టు కీల‌క ఆదేశాలు
Advertisement

Supreme Court | వైద్య‌విద్య కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించిన జాతీయ అర్హ‌త ప‌రీక్ష నీట్ యూజీ 2026 (NEET UG 2026) ప్ర‌శ్న‌ప‌త్రం లీకైన వ్య‌వ‌హారం దేశ‌వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగిన విష‌యం తెలిసిందే. పేప‌ర్ లీక్ ఆరోప‌ణ‌ల‌తో గ‌త నెల 3న జ‌రిగిన నీట్ ప‌రీక్ష‌ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ ర‌ద్దు చేసింది. ఈ ప‌రీక్ష‌ను జూన్ 21న (ఆదివారం) మ‌ళ్లీ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సుప్రీంకోర్టు (Supreme Court) తాజాగా కీల‌క ఆదేశాలు జారీ చేసింది. ఈసారి నీట్ ప‌రీక్ష‌ను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వ‌హించాలంటూ దాఖ‌లైన పిటిష‌న్‌ను ధ‌ర్మాస‌నం తిర‌స్క‌రించింది. ఓఎంఆర్ ప‌ద్ధ‌తిలోనే నిర్వ‌హించాల‌ని స్ప‌ష్టం చేసింది.

నీట్ ఫ‌రీక్ష‌ను సీబీటీ విధానంలో నిర్వ‌హించాలంటూ ఆర్జేడీ ఎంపీ సుధాక‌ర్ సింగ్‌, ప‌లువురు సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం నేడు విచార‌ణ చేప‌ట్టింది. ఈ మేర‌కు CBT విధానంలో నిర్వ‌హించాలంటూ దాఖ‌లైన పిటిష‌న్‌ను ధ‌ర్మాస‌నం తిర‌స్క‌రించింది. "రీ-ఎగ్జామ్‌ను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించ‌డం కుద‌ర‌దు. నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇప్పటికే చాలా సమస్యలను ఎదుర్కొంటోంది. ప‌శ్న‌ప‌త్రం లీక్‌తో పరీక్ష రద్దయింది. ఇప్పుడు దాన్ని మళ్లీ నిర్వహిస్తున్నారు. ఓఎంఆర్ ప‌ద్ధ‌తిలోనే ఎగ్జామ్ నిర్వ‌హించాలి" అని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంత‌రం త‌దుప‌రి విచార‌ణ‌ను జులై 27కి వాయిదా వేసింది.

వ‌చ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో నీట్ ప‌రీక్ష‌..

నీట్ యూజీ పేప‌ర్ లీక్ ఆరోప‌ణ‌ల (NEET Paper Leak) నేప‌థ్యంలో కేంద్రం ఇటీవ‌లే కీల‌క నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. వ‌చ్చే ఏడాది నుంచి నీట్ ప‌రీక్ష‌ను (NEET Exam) పూర్తిగా కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌గా నిర్వ‌హించ‌నున్న‌ట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌దాన్ (Dharmendra Pradhan) గ‌త నెల‌ ప్ర‌క‌టించారు. ప‌రీక్ష‌ల్లో అవ‌క‌త‌వ‌క‌ల ప‌ట్ల ప్ర‌భుత్వం జీరో టాల‌రెన్స్ విధానాన్ని కొన‌సాగిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. విద్యార్థుల భ‌విష్య‌త్తు విష‌యంలో రాజీ ప‌డే ప్ర‌స‌క్తే లేద‌న్నారు. పరీక్షా విధానాన్ని దెబ్బతీయాలని చూసే ఎవరైనా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎలాంటి త‌ప్ప‌లూ జ‌ర‌గ‌కుండా ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. అదేవిధంగా నీట్‌ పేపర్ ఎలా లీకైంది.. ఎవరు లీక్ చేశార‌న్న దానిపై సీబీఐ విచార‌ణ చేస్తున్న‌ట్లు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ఈసారి ఎలాంటి పరిస్థితుల్లోనూ మాల్ ప్రాక్టీస్ జరగకుండా చూసుకుంటామని కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌దాన్ తెలిపారు.

Also Read..

హెచ్‌సీఏ నిధుల అక్రమాలపై సిట్‌ దర్యాప్తు.. త్వరలో చార్జ్‌షీట్‌ దాఖలు చేయ‌నున్న సిట్‌..!

RCB ప్లేయర్ల ఆస్తుల చిట్టా: కోహ్లీ ఆదాయం ఎంతో తెలుసా?

ప‌రారీలో ఉన్న నేపాలీల‌ను అరెస్టు చేసేందుకు రంగంలోకి సిట్ బృందం..!

Advertisement

తాజావార్తలు

Advertisement