Telangana Formation Day | కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదు.. ఎన్నారై బీఆర్ఎస్ యూకే కార్యవర్గం
Telangana Formation Day | ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని (Telangana Formation Day) లండన్‌లో ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రమే ఏర్పడేది కాదన్నారు. తెలంగాణ సాధన కోసం పోరాడిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాసులంతా కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Telangana Formation Day | లండన్: ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని (Telangana Formation Day) లండన్‌లో ఘనంగా నిర్వహించారు. దీంతోపాటూ మాజీ మంత్రి హరీశ్ రావు జన్మదిన వేడుకలను కూడా బీఆర్ఎస్ యూకే విభాగం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముందు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి బీఆర్ఎస్ యూకే విభాగం పూలమాల వేసి నివాళులర్పించింది. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ రెండు నిమిషాల పాటూ మౌనం పాటించింది.
ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షులు నవీన్ రెడ్డి నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రవాస తెలంగాణవాసులు, పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు హరి గౌడ్ నవాపేట్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అమరవీరుల త్యాగాలు, ప్రజల చిరకాల ఆకాంక్షలు, కేసీఆర్ నాయకత్వంలో సాగిన ఉద్యమ ఫలితమని అన్నారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రమే ఏర్పడేది కాదన్నారు. తెలంగాణ సాధన కోసం పోరాడిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాసులంతా కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఉపాధ్యక్షులు సత్యమూర్తి చిలుముల మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రవాసులు రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడం ఎంతో ముఖ్యమని అన్నారు. విదేశాల్లో ఉన్నప్పటికీ తెలంగాణతో ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తూ సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని కోరారు.
యూత్ వింగ్ నాయకురాలు అమరేశ్వరి బోయిన మాట్లాడుతూ.. మా తరానికి తెలంగాణ ఉద్యమ చరిత్రను, కెసీఆర్ గారి పోరాట విషయాల్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలన్నారు. చరిత్ర తెలియకుండా చాలా మంది చౌకబారు రాజకీయ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతీ సంవత్సరం రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేలా మనమంతా కృషి చెయ్యాలని, పార్టీ సైతం చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అలాగే మాజీ మంత్రి హరీశ్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
జనరల్ సెక్రటరీ రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ.. హరీశ్ రావు ప్రజలతో మమేకమై పనిచేసే నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా హరీష్ రావు గారి ప్రోత్సాహం మరువలేనిదని, ఎప్పటికప్పుడు మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న తెలంగాణ ప్రజా నాయుకుడు హరీష్ రావు అని ఎన్నారై బీఆర్ఎస్ యూకే నాయకులు అంజాన్ రావు అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షులు నవీన్ రెడ్డి, ఉపాధ్యక్షులు హరి గౌడ్ నవాపేట్, సత్యమూర్తి చిలుముల, జనరల్ సెక్రటరీ రత్నాకర్ కడుదుల, కార్యదర్శి (ఐటీ, మీడియా & పీఆర్) రవి ప్రదీప్ పులుసు, వెంకట్ రెడ్డి దొంతుల, సురేష్ బుడగం, రామకృష్ణ, పవన్ గౌడ్, అంజన్ రావు, అమరేశ్వరి, హరికృష్ణ, రాజు, సాయి, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

High Court | పవన్‌కు షాక్.. హౌస్ మోషన్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు
జూన్ 2, 2026

Deshapathi Srinivas | తెలంగాణ మీద గద్దలు తిరుగుతున్నయ్.. శత్రువులకు తలుపులు తెరిచే ద్రోహి ఉన్నడిక్కడ: దేశపతి శ్రీనివాస్ ఫైర్
జూన్ 2, 2026

Telangana Formation Day | తెలంగాణ గడ్డ ఎప్పుడూ లొంగిపోదు.. హక్కుల కోసం రాజీపడదు : స్విట్జర్లాండ్ బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ గందె
జూన్ 2, 2026
తాజావార్తలు
- ●High Court | పవన్‌కు షాక్.. హౌస్ మోషన్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు
- ●Electric Vehicles | EVల వైపు భారత్ పరుగులు.. పెట్రోల్ ధరల షాక్‌తో ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ డిమాండ్..
- ●Amazon Music | అమెజాన్ మ్యూజిక్‌లో భారీ మార్పులు.. కొత్త అన్లిమిటెడ్ ప్లాన్ ప్రారంభం..
- ●Deshapathi Srinivas | తెలంగాణ మీద గద్దలు తిరుగుతున్నయ్.. శత్రువులకు తలుపులు తెరిచే ద్రోహి ఉన్నడిక్కడ: దేశపతి శ్రీనివాస్ ఫైర్
- ●Supreme Court | ఐదుగురు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం.. సుప్రీంకోర్టులో 37కి పెరిగిన జడ్జీల సంఖ్య
- ●Foreigners | విదేశీయుల వీసా నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు.. కొత్త రూల్స్ ఇవే..

High Court | పవన్‌కు షాక్.. హౌస్ మోషన్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు

Electric Vehicles | EVల వైపు భారత్ పరుగులు.. పెట్రోల్ ధరల షాక్‌తో ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ డిమాండ్..

Amazon Music | అమెజాన్ మ్యూజిక్‌లో భారీ మార్పులు.. కొత్త అన్లిమిటెడ్ ప్లాన్ ప్రారంభం..

Deshapathi Srinivas | తెలంగాణ మీద గద్దలు తిరుగుతున్నయ్.. శత్రువులకు తలుపులు తెరిచే ద్రోహి ఉన్నడిక్కడ: దేశపతి శ్రీనివాస్ ఫైర్



