Foreigners | విదేశీయుల వీసా నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు.. కొత్త రూల్స్ ఇవే..
Foreigners | విదేశీయుల (Foreigners) వీసా నిబంధనలు, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియల్లో (Immigration and Foreigners Rules) కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.
Foreigners | విదేశీయుల (Foreigners) వీసా నిబంధనలు, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియల్లో (Immigration and Foreigners Rules) కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. విదేశీయులు తాము అనుమతి పొందిన సమయం కంటే ఎక్కువ రోజులు భారతదేశంలో కొనసాగాలనుకుంటే.. ఇకపై వారి వీసా గడువు ముగియకముందే విదేశాంగ శాఖ వద్ద తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని (Mandates Early Registration) స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (Union Home Ministry) నోటిఫికేషన్ జారీ చేసింది. దేశంలో నివసిస్తున్న విదేశీ పౌరుల పర్యవేక్షణను సమర్థవంతంగా నిర్వహించేందుకు, జాతీయ భద్రతను పటిష్టం చేసేందుకు ఈ కొత్త నిబంధనలను తీసుకువచ్చినట్లు తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ మార్పుల ప్రకారం.. 180 రోజులు లేదా అంతకంటే తక్కువ గడువు ఉన్న వీసాలపై వచ్చే విదేశీయులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. అనుమతి పొందిన సమయం కంటే ఎక్కువ రోజులు భారతదేశంలో కొనసాగాలనుకుంటే.. 180 రోజుల వ్యవధి ముగియడానికి ముందే తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. గతంలో విదేశీయులు గడువు పూర్తైన 14 రోజుల్లోపు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అనుమతించేవారు. అయితే, ఇప్పుడు ఆ అవకాశం ఉండదు. గడువు ముగిసేలోపే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
భారతదేశంలో సంతానం పొందే విదేశీయుల కోసం హోంశాఖ మరో కీలక మార్పును ప్రవేశపెట్టింది. దీని ప్రకారం, భారత్‌లో విదేశీ దంపతులకు బిడ్డ జన్మించిన 30 రోజుల్లోపు ఆన్‌లైన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ తల్లిదండ్రుల్లో ఒకరు భారతీయ పౌరుడై ఉండి.. భారతీయ పౌరసత్వాన్ని అలాగే ఉంచుకోవాలనుకుంటే ఈ నిబంధన వర్తించదు. ఒకవేళ ఆ బిడ్డ భారతదేశంలో నివసిస్తూ తర్వాత ఏదైనా ఇతర దేశ పౌరసత్వాన్ని పొందితే మాత్రం.. ఆ విషయాన్ని 30 రోజుల్లోపు రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. అంతేకాదు, భారతదేశంలో విదేశీయులకు వైద్యం లేదా వసతి కల్పించే ప్రతి ఆసుపత్రి, నర్సింగ్ హోమ్ లేదా వైద్య సంస్థలు.. సదరు విదేశీయుల వివరాలను నిర్దేశిత గడువులోగా రిజిస్ట్రేషన్ అధికారికి సమర్పించాలని కేంద్రం తన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.
Also Read..
వయసు 70 ఏండ్లు.. శిక్ష 20 ఏండ్లు.. పోక్సో కేసులో కోర్టు తీర్పు
కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదు.. ఎన్నారై బీఆర్ఎస్ యూకే కార్యవర్గం
తాజావార్తలు
- ●Lalit Modi | సుస్మిత సేన్ 'గోల్డ్ డిగ్గర్' కాదు.. నేనే ఆమె సంపాదనపై ఆధారపడేవాడిని : లలిత్ మోదీ
- ●Prabhas Spirit | స్పిరిట్‌పై కొత్త అప్డేట్ - ప్రభాస్ సినిమాలో పవన్ కళ్యాణ్ అత్త
- ●High Court | పవన్‌కు షాక్.. హౌస్ మోషన్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు
- ●Electric Vehicles | EVల వైపు భారత్ పరుగులు.. పెట్రోల్ ధరల షాక్‌తో ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ డిమాండ్..
- ●Amazon Music | అమెజాన్ మ్యూజిక్‌లో భారీ మార్పులు.. కొత్త అన్లిమిటెడ్ ప్లాన్ ప్రారంభం..
- ●Deshapathi Srinivas | తెలంగాణ మీద గద్దలు తిరుగుతున్నయ్.. శత్రువులకు తలుపులు తెరిచే ద్రోహి ఉన్నడిక్కడ: దేశపతి శ్రీనివాస్ ఫైర్

Lalit Modi | సుస్మిత సేన్ 'గోల్డ్ డిగ్గర్' కాదు.. నేనే ఆమె సంపాదనపై ఆధారపడేవాడిని : లలిత్ మోదీ

Prabhas Spirit | స్పిరిట్‌పై కొత్త అప్డేట్ - ప్రభాస్ సినిమాలో పవన్ కళ్యాణ్ అత్త

High Court | పవన్‌కు షాక్.. హౌస్ మోషన్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు

Electric Vehicles | EVల వైపు భారత్ పరుగులు.. పెట్రోల్ ధరల షాక్‌తో ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ డిమాండ్..




