Air India crash | తుదిదశలో అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తు.. త్వరలోనే నివేదిక : కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Air India crash | గతేడాది జూన్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Air India plane crash)పై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) విచారణ తుది దశలో ఉందని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Civil Aviation Minister Ram Mohan Naidu) తెలిపారు.
Air India crash | గతేడాది జూన్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Air India plane crash)పై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) విచారణ తుది దశలో ఉందని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Civil Aviation Minister Ram Mohan Naidu) తెలిపారు. అంతర్జాతీయ ప్రోటోకాల్‌లను కచ్చితంగా పాటిస్తూ ఏఏఐబీ త్వరలోనే తన తుది నివేదికను సమర్పించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
దర్యాప్తు ప్రక్రియ పూర్తిగా నిబంధనల ఆధారంగా జరుగుతోందన్నారు. తుది నివేదిక కోసం తామంతా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అయితే, ఏఏఐబీ ఈ దర్యాప్తు ప్రక్రియను అనవసరంగా వేగవంతం చేయాలని అనుకోవడం లేదన్నారు. దర్యాప్తును వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఏఏఐబీ త్వరలోనే తుది నివేదికను సమర్పించొచ్చని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
ప్రమాదం జరిగిన ఏడాది పూర్తైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దుర్ఘటనపై సమగ్రమైన, నిష్పాక్షికమైన దర్యాప్తు చేస్తున్నట్లు ఏఏఐబీ ప్రకటించింది. విమాన వ్యవస్థలు, ఫ్లైట్ రికార్డర్ డేటా, ఇంజిన్ సంబంధిత భాగాలు, నిర్వహణ, కార్యకలాపాల రికార్డులు, అలాగే దర్యాప్తునకు సంబంధించిన ఇతర సాక్ష్యాల పరిశీలన, విశ్లేషణలో గణనీయమైన పురోగతి సాధించినట్లు తెలిపింది. సేకరించిన సాక్ష్యాధారాలు, వివిధ పరీక్షల ఫలితాలను ప్రస్తుతం సమగ్రంగా, ఏకీకృత పద్ధతిలో విశ్లేషిస్తున్నట్లు వెల్లడించింది. త్వరలోనే తుది నివేదిక విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
కాగా, గతేడాది జూన్ 12న మధ్యాహ్నం 1:39 గంటల ప్రాంతంలో అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానం టేకాప్ అయిన నిమిషాల్లోనే సమీపంలోని మెడికల్ కాలేజీ హాస్టల్ ప్రాంగణంలోకి దూసుకెళ్లింది. డైనింగ్ హాల్, మెస్ ఏరియాపై విమానం కుప్పకూలిపోయింది. ఆ సమయంలో మెస్‌లో భోజనం చేస్తున్న పలువురు ఎంబీబీఎస్ విద్యార్థులు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. పలువురు విద్యార్థులు మిస్సయ్యారు కూడా. ఇక మొత్తం ఈ విమాన ప్రమాదంలో సుమారు 275 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలో ప్రయాణిస్తున్న ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో మెడికల్ కాలేజీ హాస్టల్ భవనం పూర్తిగా దెబ్బతిన్నది. ఈ ప్రమాద ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read..
ప్రజలను కుక్కలతో పోల్చేంత కఠిన హృదయుడిని కాదు : రాఘవ లారెన్స్
అమెరికా వర్సిటీలో సుందర్ పిచాయ్‌కి నిరసన సెగ.. ప్రసంగిస్తుండగా వాకౌట్ చేసిన విద్యార్థులు
తిరుమలలో సాలకట్ల జ్యేష్టాభిషేకం.. 28న ఆర్జిత సేవలు రద్దు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Air india Plane Crash | విమాన ప్రమాదంలో దెబ్బతిన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్.. రూ.105 కోట్లతో పునర్నిర్మాణం
మే 27, 2026

Air India | సాంకేతిక సమస్య.. 8 గంటలుగా గాల్లోనే ఎయిర్ ఇండియా విమానం..!
మే 27, 2026

Aviation Turbine Fuel | పెరిగిన ఇంధన భారం: మమ్మల్ని ఆదుకోండి.. లేదంటే విమానాలు బందే.. కేంద్రానికి ఎయిర్‌లైన్స్ సంస్థల విజ్ఞప్తి
ఏప్రిల్ 28, 2026
తాజావార్తలు
- ●Dharmapuri Arvind | రేవంత్.. రూమ్‌లో రెండో వ్యక్తి లేకుండా ఎలక్షన్ ఫామ్ నింపు
- ●OnePlus | వన్‌ప్లస్ ఇండిపెండెన్స్ డే సేల్.. ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..
- ●Mumbai Police | ముంబై పోలీసు శాఖలో భారీ స్కామ్.. ఘోస్ట్ ఉద్యోగులకు రూ.6.41 కోట్ల జీతాలు
- ●Konda Surekha | వరంగల్‌ను రెండో మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుతాం
- ●MLA Sudheer Reddy | 4 మీటర్ల లాంగ్ జంప్ ఎత్తేయండి
- ●TRAI | కాల్ క్వాలిటీపై ఇక ఫిర్యాదు చేయడం చాలా సులభం.. ట్రాయ్ కొత్త మైకాల్ యాప్ విడుదల..

Dharmapuri Arvind | రేవంత్.. రూమ్‌లో రెండో వ్యక్తి లేకుండా ఎలక్షన్ ఫామ్ నింపు

OnePlus | వన్‌ప్లస్ ఇండిపెండెన్స్ డే సేల్.. ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..

Mumbai Police | ముంబై పోలీసు శాఖలో భారీ స్కామ్.. ఘోస్ట్ ఉద్యోగులకు రూ.6.41 కోట్ల జీతాలు

Konda Surekha | వరంగల్‌ను రెండో మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుతాం



