MLA Sudheer Reddy | 4 మీటర్ల లాంగ్ జంప్ ఎత్తేయండి
MLA Sudheer Reddy | పోలీసు ఉద్యోగ నియామకాలకు సంబంధించి 4 మీటర్ల లాంగ్ జంప్ భారతదేశంలో ఎక్కడా లేదు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. పోలీస్ ఉద్యోగాల కోసం అమలు చేస్తున్న లాంగ్ జంప్‌ను 4 మీటర్ల నుంచి 3 మీటర్ల 8 అంగుళాలకు పరిమితం చేయండి అని సూచించారు.
పాత జిల్లాల ప్రకారం
నోటిఫికేషన్లు విడుదల చేయండి
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి డిమాండ్
MLA Sudheer Reddy | త్రినేత్ర.న్యూస్ : పోలీసు ఉద్యోగ నియామకాలకు సంబంధించి 4 మీటర్ల లాంగ్ జంప్ భారతదేశంలో ఎక్కడా లేదు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. పోలీస్ ఉద్యోగాల కోసం అమలు చేస్తున్న లాంగ్ జంప్‌ను 4 మీటర్ల నుంచి 3 మీటర్ల 8 అంగుళాలకు పరిమితం చేయండి అని సూచించారు. ఎక్కువ రాష్ట్రాల్లో ఏ రూల్ ఉంటే ఆ రూల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు.
4 మీటర్ల లాంగ్ జంప్ వద్దే వద్దని ఇప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్సీలే నాడు గాంధీ భవన్ ముందు ఆందోళన చేశారు. కానీ ఇప్పుడు వాళ్లకు పదవి దక్కిన తర్వాత సైలెంట్ అయిపోయారు. బీఆర్ఎస్ హయాంలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు వయోపరిమితి 32 సంవత్సరాలు, ఎస్సై పోస్టులకు 35 సంవత్సరాలుగా వయోపరిమితి ఉండె. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో 31 ద్వారా అదనంగా 2 సంవత్సరాలు వయోపరిమితి పెంచారు. కానీ వాళ్లు ఆ తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా వేయాలేదు. ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్‌లో తిరిగి 32 (కానిస్టేబుల్స్), 35 (ఎస్సై) కు కుదించారు. దీంతో ఈ మూడేండ్లుగా ప్రిపేర్ అవుతున్న వాళ్లు నష్టపోయే అవకాశం ఉందన్నారు.
గ్రామీణ విద్యార్థులకు తీవ్ర నష్టం
ఫైర్ డిపార్ట్‌మెంట్ నోటిఫికేషన్లకు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి నిబంధన విధించారు. దీంతో గ్రామీణ విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ నోటిఫికేషన్ల ద్వారా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కరికి కూడా ఉద్యోగం దక్కే పరిస్థితి లేదు. రాష్ట్రపతి ఆమోదం లేనిదే కొత్త కమిషనరేట్లలో ఉద్యోగాల భర్తీ చేయలేమని ప్రభుత్వం చెబుతున్నది. రాష్ట్రపతి ఆమోదానికి చాలా సమయం పడుతుంది. అందుకే పాత జిల్లాల ప్రకారం నోటిఫికేషన్లు వేస్తే.. సిటీ విద్యార్థులు నష్టపోరు అని సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఫీజులు తీసుకోమని భారీగా పెంచేశారు..
ఎస్సై పోస్టుకు రూ. 1500, కానిస్టేబుల్‌కు రూ. 1,000 పరీక్ష ఫీజు పెట్టారు. విద్యార్థులు, నిరుద్యోగులతో ప్రభుత్వం వ్యాపారం చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలో వస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు ఎలాంటి ఫీజులు వసూలు చేయమని చెప్పారు. పోలీసు అభ్యర్థుల ఏజ్ లిమిట్‌ను పెంచాలని కోరుతున్నామని ఆయన పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

KCR | కేసీఆర్‌కు మళ్లీ నోటీసులివ్వండి.. న్యాయవాదికి భూపాలపల్లి కోర్టు ఆదేశం
ఆగస్టు 12, 2026

TGSWREIS | గురుకుల విద్యార్థులకు సువర్ణావకాశం.. ఉచితంగా నీట్ 2027 లాంగ్ టర్మ్ కోచింగ్.. వివరాలివే..!
ఆగస్టు 12, 2026

Revanth Reddy | ఆర్మీ నియామకాల్లో యువతను ప్రోత్సహించేందుకు కలిసి పని చేస్తాం
ఆగస్టు 12, 2026
తాజావార్తలు
- ●Red Fort Attack | ఢిల్లీ పేలుడు వెనుక ఆల్‌ఖైదా హస్తం.. UNSC సంచలన నివేదిక
- ●Hyderabad | అప్పు తీర్చలేదని.. 21 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లారు
- ●Meta Platforms | మెటాకు భారీ నష్టం.. 1.4 ట్రిలియన్ డాలర్ల మేర ఎఫెక్ట్..?
- ●Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన
- ●Indian Bank | ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్
- ●Shakeela | నటి షకీలాకు సర్జరీ - స్మార్ట్‌ఫోన్‌కు బానిసగా మారి.... మెడ నరాలు దెబ్బతిని..

Red Fort Attack | ఢిల్లీ పేలుడు వెనుక ఆల్‌ఖైదా హస్తం.. UNSC సంచలన నివేదిక

Hyderabad | అప్పు తీర్చలేదని.. 21 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లారు

Meta Platforms | మెటాకు భారీ నష్టం.. 1.4 ట్రిలియన్ డాలర్ల మేర ఎఫెక్ట్..?

Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన



