Air india Plane Crash | విమాన ప్రమాదంలో దెబ్బతిన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్.. రూ.105 కోట్లతో పునర్నిర్మాణం
Air india Plane Crash | అహ్మదాబాద్‌లో గతేడాది జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో పూర్తిగా దెబ్బతిన్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాన్ని పునర్నిర్మించనున్నట్లు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది.
Air india Plane Crash | గతేడాది అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Air india Plane Crash) లో తీవ్రంగా దెబ్బతిన్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాన్ని పునర్నిర్మించనున్నట్లు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. అదే స్థలంలో రూ.105 కోట్ల అంచనా వ్యయంతో సరికొత్త అత్యాధునిక హాస్టల్ వసతిని నిర్మించనున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రఫుల్ పన్షేరియా వెల్లడించారు. గతంలోకంటే మూడు రెట్లు ఎక్కువ వసతి సామర్థ్యంతో దీన్ని పునర్నిర్మించనున్నట్లు తెలిపారు. మూడు నెలల్లోనే నిర్మాణ పనులు కూడా ప్రారంభించే అవకాశం ఉంది.
కాగా, గతేడాది జూన్ 12న మధ్యాహ్నం 1:39 గంటల ప్రాంతంలో అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానం టేకాప్ అయిన నిమిషాల్లోనే సమీపంలోని మెడికల్ కాలేజీ హాస్టల్ ప్రాంగణంలోకి దూసుకెళ్లింది. డైనింగ్ హాల్, మెస్ ఏరియాపై విమానం కుప్పకూలిపోయింది. ఆ సమయంలో మెస్‌లో భోజనం చేస్తున్న పలువురు ఎంబీబీఎస్ విద్యార్థులు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. పలువురు విద్యార్థులు మిస్సయ్యారు కూడా. ఇక మొత్తం ఈ విమాన ప్రమాదంలో సుమారు 275 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలో ప్రయాణిస్తున్న ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో మెడికల్ కాలేజీ హాస్టల్ భవనం పూర్తిగా దెబ్బతిన్నది. ఈ ప్రమాద ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Air India crash | తుదిదశలో అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తు.. త్వరలోనే నివేదిక : కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
జూన్ 15, 2026

Air India | సాంకేతిక సమస్య.. 8 గంటలుగా గాల్లోనే ఎయిర్ ఇండియా విమానం..!
మే 27, 2026

Aviation Turbine Fuel | పెరిగిన ఇంధన భారం: మమ్మల్ని ఆదుకోండి.. లేదంటే విమానాలు బందే.. కేంద్రానికి ఎయిర్‌లైన్స్ సంస్థల విజ్ఞప్తి
ఏప్రిల్ 28, 2026
తాజావార్తలు
- ●Kaloji Health University | విద్యార్థులకు అలర్ట్.. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ
- ●Faridabad Teacher | 30 సెకన్లలో 34 కత్తిపోట్లు.. స్కూల్ టీచర్‌పై వ్యక్తి పైశాచిక దాడి
- ●Penny Stocks | కాసుల వర్షం కురిపిస్తున్న పెన్నీ స్టాక్స్.. 6 నెలల్లో 198 శాతం లాభాలు..
- ●Harish Rao | డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌కు పూర్తి స్థాయి అధికారిని నియమించాలి.. హరీశ్ రావు డిమాండ్
- ●Minister Ponnam Prabhakar | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై అభిప్రాయ సేకరణ చేపట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్
- ●MP Vaddiraju Ravichandra | విమాన ప్రయాణీకుల భద్రతకు ఏం చర్యలు తీసుకుంటున్నారు..? కేంద్రాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎంపీ

Kaloji Health University | విద్యార్థులకు అలర్ట్.. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ

Faridabad Teacher | 30 సెకన్లలో 34 కత్తిపోట్లు.. స్కూల్ టీచర్‌పై వ్యక్తి పైశాచిక దాడి

Penny Stocks | కాసుల వర్షం కురిపిస్తున్న పెన్నీ స్టాక్స్.. 6 నెలల్లో 198 శాతం లాభాలు..

Harish Rao | డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌కు పూర్తి స్థాయి అధికారిని నియమించాలి.. హరీశ్ రావు డిమాండ్



