Dharmapuri Arvind | రేవంత్.. రూమ్‌లో రెండో వ్యక్తి లేకుండా ఎలక్షన్ ఫామ్ నింపు
Dharmapuri Arvind | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy )పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్( Dharmapuri Arvind ) తీవ్ర విమర్శలు చేశారు. రూమ్‌లో రెండో వ్యక్తి లేకుండా ఎన్నికల నామినేషన్ పత్రం కూడా నింపలేని నువ్వు ఇంజినీరింగ్ విద్యార్థుల గురించి మాట్లాడుతావా? అని సీఎంపై అరవింద్ నిప్పులు చెరిగారు.
Dharmapuri Arvind | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy )పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్( Dharmapuri Arvind ) తీవ్ర విమర్శలు చేశారు. రూమ్‌లో రెండో వ్యక్తి లేకుండా ఎన్నికల నామినేషన్ పత్రం కూడా నింపలేని నువ్వు ఇంజినీరింగ్ విద్యార్థుల గురించి మాట్లాడుతావా? అని సీఎంపై అరవింద్ నిప్పులు చెరిగారు. ఢిల్లీలో మంగళవారం ధర్మపురి అరవింద్ మీడియాతో మాట్లాడారు.
చిన్నప్పుడు చదువుకోకుండా తిరిగిన నువ్వు.. సిగ్గు, శరం లేకుండా ఇప్పుడు విద్యాశాఖను నిర్వహిస్తావా? నీకు విద్యాశాఖ నిర్వహించడం చేతకాకపోతే చదువుకున్న శ్రీధర్ బాబుకు ఆ శాఖను అప్పజెప్పు అని సూచించారు. విద్య పట్ల చిత్తశుద్ధి లేని వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉండటం సరైనది కాదు. విద్యాశాఖ బాధ్యతలను మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగిస్తే బాగుంటుందని సూచించారు. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ధర్మపురి అరవింద్ విమర్శించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కూడా లేవని అరవింద్ ఆరోపించారు. కొన్ని పాఠశాలల్లో బ్లాక్ బోర్డులు, చాక్ పీసులు, విద్యార్థులకు సరైన మరుగుదొడ్లు లేని పరిస్థితి ఉందన్నారు. విద్యాశాఖ మంత్రిగా సీఎం ఒక్క ప్రభుత్వ పాఠశాలను అయినా సందర్శించారా అని ప్రశ్నించారు. ఉన్న పాఠశాలలను అభివృద్ధి చేయకుండా కొత్త పాఠశాలల నిర్మాణం పేరుతో ప్రభుత్వం కమిషన్ల కోసం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

KCR | కేసీఆర్‌కు మళ్లీ నోటీసులివ్వండి.. న్యాయవాదికి భూపాలపల్లి కోర్టు ఆదేశం
ఆగస్టు 12, 2026

CM Revanth Reddy | ఆ మూడు ప్రాజెక్టులకు ఎన్డీఎస్ఏ సూచనలు పాటించండి.. ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోయండి
ఆగస్టు 12, 2026

TGSWREIS | గురుకుల విద్యార్థులకు సువర్ణావకాశం.. ఉచితంగా నీట్ 2027 లాంగ్ టర్మ్ కోచింగ్.. వివరాలివే..!
ఆగస్టు 12, 2026
తాజావార్తలు
- ●Toxic Yash Success Story | కేవలం రూ.300తో బెంగళూరుకు.. టీలు అమ్మే స్థాయి నుంచి రూ.4000 కోట్ల 'రామాయణ' వరకు.. రాకీ భాయ్ ఇన్స్పైరింగ్ స్టోరీ!
- ●IIT Placements Crisis | ఐఐటీ చదివినా నో జాబ్.. టాపర్లకు కూడా ప్లేస్‌మెంట్స్ కరవు.. అసలు కారణాలివే..!
- ●Kalyana Lakshmi & Shaadi Mubarak | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు షాక్.. ఆ చెల్లింపులపై తెలంగాణ హైకోర్టు స్టే!
- ●Enugula Rakesh Reddy | పెళ్లి పనులు ఒకరు చేస్తే.. మంగళహారతి పట్టిన వాళ్లు ఆ పెళ్లి మేమే చేశాం అన్నట్లుంది
- ●Bhadrachalam-Vizag Road Corridor | భద్రాచలం టు విశాఖపట్నం హైవే: రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ ప్రశ్నకు నితిన్ గడ్కరీ ఆన్సర్ ఇదే
- ●KCR | కేసీఆర్‌కు మళ్లీ నోటీసులివ్వండి.. న్యాయవాదికి భూపాలపల్లి కోర్టు ఆదేశం

Toxic Yash Success Story | కేవలం రూ.300తో బెంగళూరుకు.. టీలు అమ్మే స్థాయి నుంచి రూ.4000 కోట్ల 'రామాయణ' వరకు.. రాకీ భాయ్ ఇన్స్పైరింగ్ స్టోరీ!

IIT Placements Crisis | ఐఐటీ చదివినా నో జాబ్.. టాపర్లకు కూడా ప్లేస్‌మెంట్స్ కరవు.. అసలు కారణాలివే..!

Kalyana Lakshmi & Shaadi Mubarak | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు షాక్.. ఆ చెల్లింపులపై తెలంగాణ హైకోర్టు స్టే!

Enugula Rakesh Reddy | పెళ్లి పనులు ఒకరు చేస్తే.. మంగళహారతి పట్టిన వాళ్లు ఆ పెళ్లి మేమే చేశాం అన్నట్లుంది



