TTD | తిరుమలలో సాలకట్ల జ్యేష్టాభిషేకం.. 28న ఆర్జిత సేవలు రద్దు
TTD | కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో సాలకట్ల జ్యేష్టాభిషేకం (Salakatla Jyesthabhishekam) వేడుకలను నిర్వహించనున్నారు.
Devotional | Published On Jun 15, 2026, 1.19 pm IST
TTD | త్రినేత్ర.న్యూస్: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో సాలకట్ల జ్యేష్టాభిషేకం (Salakatla Jyesthabhishekam) వేడుకలను నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేలా ఈ ప్రత్యేక అభిషేక మహోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితిగా వస్తున్నది. ఈ నెల 26 నుంచి మూడు రోజులపాటు ఉత్సవాలను నిర్వహించనున్నట్లు టీటీడీ (TTD) ప్రకటించింది. శ్రీవారి ఆలయ పరిధిలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కల్యాణ మండపంలో దీనిని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఉత్సవానికి `అభిద్యేయక అభిషేకం` అనే పేరు కూడా ఉన్నది. ఈ సందర్భంగా ఆర్జిత సేలను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
మూడు రోజులపాటు విశేష పూజలు..
వివిధ రకాల అభిషేకాలు, పూజాది క్రతువుల వల్ల అత్యంత ప్రాచీనమైన, పవిత్రమైన శ్రీవారి ఉత్సవమూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి అరిగిపోకుండా, ఎలాంటి డ్యామేజ్ జరగకుండా పరిరక్షించడమే ఈ జ్యేష్టాభిషేకం ముఖ్య ఉద్దేశం. ఈ మూడు రోజుల పాటు స్వామివారికి విశేష కవచ సమర్పణలు జరుగుతాయి.
- మొదటి రోజు (జూన్ 26): శ్రీ మలయప్పస్వామివారికి ఏడాది పొడవునా ఉన్న పాత బంగారు కవచాన్ని పూర్తిగా తీసివేస్తారు. అనంతరం ప్రత్యేక హోమాలు, పంచామృతాలతో ‘స్నపన తిరుమంజనం’ (పవిత్ర స్నానం) నిర్వహిస్తారు. ఆ తర్వాత స్వామివారికి అత్యంత దేదీప్యమానమైన వజ్రకవచాన్ని అలంకరించి పూజలు చేస్తారు.
- రెండో రోజు (జూన్ 27): తిరుమంజనాది కార్యక్రమాలు ముగిసిన తర్వాత స్వామివారికి ముత్యాల కవచాన్ని సమర్పిస్తారు.
- మూడో రోజు (జూన్ 28): చివరి రోజున సాంప్రదాయబద్ధంగా తిరుమంజన ప్రక్రియలన్నీ పూర్తి చేసి, స్వామివారికి తిరిగి సరికొత్త బంగారు కవచాన్ని పునఃసమర్పిస్తారు. దీనిని మళ్లీ వచ్చే ఏడాది జ్యేష్టాభిషేకం ఉత్సవం వరకు తీయరు. సంవత్సరం పొడవునా శ్రీవారు ఇదే బంగారు కవచాన్ని ధరించి నిత్యం జరిగే వివిధ బ్రహ్మోత్సవాలు, ఊరేగింపులు మరియు విభిన్న ఉత్సవాల్లో భక్తులకు దర్శనమిస్తారు.
ఆర్జిత సేవలు రద్దు..
జ్యేష్టాభిషేక వేడుకల నేపథ్యంలో ఉత్సవాల చివరి రోజైన జూన్ 28న ఆలయంలో నిర్వహించే పలు ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రద్దయిన సేవల్లో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు కూడా ఉన్నాయి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Nagarjuna | బాలకృష్ణ ప్రొడ్యూసర్ - నాగార్జున హీరో - రేర్ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ కానీ...
- ●PM eBus Sewa | వరంగల్‌కు మరో 100 ఎలక్ట్రిక్ బస్సులు.. వెల్లడించిన ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
- ●క్షుద్ర రాజకీయాలా? రాజకీయ వ్యూహాలా?: హరీశ్ రావు వర్సెస్ కాంగ్రెస్ ‘తాంత్రిక’ సమరం!
- ●KTR | వేణు సూసైడ్ నోట్.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఛార్జిషీట్
- ●CM Vijay vs MK Stalin | పరిపాలన చేతగాని డమ్మీ ముఖ్యమంత్రివి నువ్వు : ఉదయనిధి అరెస్ట్‌పై ఎంకే స్టాలిన్ ఫైర్
- ●TTD | సెప్టెంబర్‌లో తిరుమల వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? బ్రహ్మోత్సవాల వేళ సేవలన్నీ రద్దు..!

Nagarjuna | బాలకృష్ణ ప్రొడ్యూసర్ - నాగార్జున హీరో - రేర్ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ కానీ...

PM eBus Sewa | వరంగల్‌కు మరో 100 ఎలక్ట్రిక్ బస్సులు.. వెల్లడించిన ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి

క్షుద్ర రాజకీయాలా? రాజకీయ వ్యూహాలా?: హరీశ్ రావు వర్సెస్ కాంగ్రెస్ ‘తాంత్రిక’ సమరం!

KTR | వేణు సూసైడ్ నోట్.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఛార్జిషీట్





