త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sundar Pichai | అమెరికా వ‌ర్సిటీలో సుంద‌ర్ పిచాయ్‌కి నిర‌స‌న సెగ‌.. ప్ర‌సంగిస్తుండ‌గా వాకౌట్ చేసిన విద్యార్థులు

Sundar Pichai | అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ 2026 స్నాతకోత్సవంలో గూగుల్, అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai)కి నిర‌స‌న సెగ త‌గిలింది. గ్రాడ్యుయేషన్ వేడుక‌ల్లో భాగంగా పిచాయ్ ముఖ్య ఉప‌న్యాసం ఇస్తుండ‌గా.. కొంద‌రు విద్యార్థులు (Stanford students) స‌భ నుంచి వాకౌట్ చేశారు.

D

International | Published On Jun 15, 2026, 12.10 pm IST

Sundar Pichai | అమెరికా వ‌ర్సిటీలో సుంద‌ర్ పిచాయ్‌కి నిర‌స‌న సెగ‌.. ప్ర‌సంగిస్తుండ‌గా వాకౌట్ చేసిన విద్యార్థులు
Advertisement

Sundar Pichai | స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ 2026 స్నాతకోత్సవంలో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. గూగుల్, అల్ఫాబెట్ సీఈఓ (Google CEO) సుందర్ పిచాయ్ (Sundar Pichai)కి నిర‌స‌న సెగ త‌గిలింది. గ్రాడ్యుయేషన్ వేడుక‌ల్లో భాగంగా పిచాయ్ ముఖ్య ఉప‌న్యాసం ఇస్తుండ‌గా.. కొంద‌రు విద్యార్థులు (Stanford students) ఒక్క‌సారిగా లేచి బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. ఇజ్రాయెల్ ప్రభుత్వంతో గూగుల్ కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందానికి నిర‌స‌న‌గా విద్యార్థులు వాకౌట్ చేసినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్ల‌డిస్తున్నాయి.

న్యూయార్క్ పోస్ట్ క‌థ‌నం ప్రకారం.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF), యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE)లతో గూగుల్‌కు ఉన్న ఒప్పందాలకు నిరసనగా 'స్టూడెంట్స్ ఫర్ జస్టిస్ ఇన్ పాలస్తీనా', 'నో టెక్ ఫర్ అపార్తీడ్' సంస్థలు ఈ వాకౌట్‌ను నిర్వహించాయి. సుందర్ పిచాయ్ డయాస్ పైకి రాగానే స్టాన్‌ఫర్డ్ స్టేడియంలో కూర్చున్న వంద మందికిపైగా విద్యార్థులు ఒక్కసారిగా లేచి నిలడ్డారు. ఫ్రీ పాల‌స్తీనా నినాదాలు చేస్తూ స‌భను బాయ్‌కాట్ చేసి వాకౌట్ చేశారు.

ఇజ్రాయెల్ ప్ర‌భుత్వానికి గూగుల్‌, అమెజాన్ సంస్థ‌లు సంయుక్తంగా అందిస్తున్న 1.2 బిలియ‌న్ డాల‌ర్ల క్లౌడ్ కంప్యూటింగ్‌, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (AI) కాంట్రాక్ట్ 'ప్రాజెక్ట్ నింబస్'కు (Project Nimbus) వ్య‌తిరేకంగా ఈ నిర‌స‌న జ‌రిగిన‌ట్లు అంత‌ర్జాతీయ మీడియా పేర్కొంది. గాజాలో కొన‌సాగుతున్న సంక్షోభం నేప‌థ్యంలో ఇజ్రాయెల్ ప్ర‌భుత్వ సైనిక చ‌ర్య‌ల‌కు ఈ ప్రాజెక్టు స‌హ‌క‌రిస్తోంద‌ని 'స్టాన్‌ఫర్డ్ స్టూడెంట్స్ ఫర్ జస్టిస్ ఇన్ పాలస్తీనా' ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.

స‌భ నుంచి వాకౌట్ చేసిన త‌ర్వాత చాలా మంది విద్యార్థులు పాలస్తీనా హక్కుల కార్యకర్త మహమూద్ ఖలీల్ (Mahmoud Khalil) ఆధ్వ‌ర్యంలో "పీపుల్స్ కామెంట్‌మెంట్" (Peoples Commencement) కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. 2024లో కొలంబియా వ‌ర్సిటీలో జ‌రిగిన పాల‌స్తీనా మ‌ద్ద‌తు నిర‌స‌న‌ల్లో పాల్గొన్నందుకు గానూ యూఎస్ ఇమ్మిగ్రేష‌న్ అధికారులు ఖ‌లీల్‌ను దాదాపు 100 రోజుల‌కుపైగా నిర్బంధించిన విష‌యం తెలిసిందే.

ఏఐ ఊసేఎత్త‌ని పిచాయ్‌

మ‌రోవైపు గ్యాడ్యుయేష‌న్ డే సెరిమెనీ స్పీచ్‌లో పిచాయ్ ఏఐ ఊసే ఎత్త‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ ఏడాది వివిధ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో జరిగిన ముగింపు వేడుకల్లో సాంకేతిక రంగ ప్రముఖులు ఏఐ గురించి మాట్లాడినప్పుడు విద్యార్థుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమ‌వ‌డే ఇందుకు కార‌ణంగా తెలుస్తోంది. ఏఐ కార‌ణంగా ప్ర‌స్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది త‌మ ఉద్యోగాలు కోల్పోవాల్సి వ‌స్తోంది. ఈ విష‌యంలో విద్యార్థులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న నేప‌థ్యంలో పిచాయ్ త‌న కీ స్పీచ్‌లో ఏఐ ప్ర‌స్తావ‌న తీసుకురాలేదు. విద్యార్థులు ఆశావాహ దృక్పథంతో ఉండాలని సుందర్ పిచాయ్ సూచించారు.

ఇక త‌న ప్రసంగం ముగించుకొని బ‌య‌ట‌కు వ‌చ్చిన పిచాయ్‌ను అంత‌ర్జాతీయ మీడియా ప్ర‌శ్నించింది. విద్యార్థుల నిర‌స‌న‌పై ప్ర‌శ్నించింది. అయితే, సుంద‌ర్ పిచాయ్ ఏమాత్రం స్పందించకుండా ముఖం తిప్పుకుని అక్క‌డి నుంచి ముందుకు వెళ్లిపోయారు. స‌భ నుంచి విద్యార్థులు వాకౌట్ చేస్తున్న వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Also Read..

టెక్ షాపింగ్‌లో ఏఐ జోరు.. అమెజాన్ స్మార్ట్ చాయిస్ డేస్ సేల్ ప్రారంభం

సీఎం విజ‌య్ విడాకుల కేసు మ‌రోసారి వాయిదా - భ‌ర్త‌తో తెగ‌తెంపుల‌పై సంగీత‌ యూట‌ర్న్‌?

మన వ్యక్తిత్వాన్ని.. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఆలయం పాఠ‌శాల‌: సీఎం రేవంత్ రెడ్డి

Advertisement

తాజావార్తలు

Advertisement