OnePlus | వన్‌ప్లస్ ఇండిపెండెన్స్ డే సేల్.. ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..
OnePlus | భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ నూతనంగా ఇండిపెండెన్స్ డే సేల్‌ను నిర్వహిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఈ సేల్‌లో వన్‌ప్లస్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు, మిడ్ రేంజ్ ఫోన్లు, నార్డ్ సిరీస్ ఉత్పత్తులు తదితరాలపై భారీ రాయితీలను అందిస్తున్నట్లు తెలిపింది.
Technology | Published On Aug 4, 2026, 5.07 pm IST
OnePlus | భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ నూతనంగా ఇండిపెండెన్స్ డే సేల్‌ను నిర్వహిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఈ సేల్‌లో వన్‌ప్లస్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు, మిడ్ రేంజ్ ఫోన్లు, నార్డ్ సిరీస్ ఉత్పత్తులు తదితరాలపై భారీ రాయితీలను అందిస్తున్నట్లు తెలిపింది. వన్‌ప్లస్ 15ఆర్, 13ఎస్, 15, నార్డ్ సీఈ6 లైట్, నార్డ్ సీఈ6, వన్‌ప్లస్ ఎన్6, ఎన్6ఎక్స్ ఫోన్లపై ఆఫర్లను అందిస్తున్నట్లు తెలియజేసింది. ఈ సేల్‌లో వన్‌ప్లస్ 15కు చెందిన 12జీబీ, 256జీబీ మోడల్ తగ్గింపు అనంతరం రూ.81,999కి లభిస్తోంది. అలాగే 16జీబీ, 512జీబీ మోడల్ తగ్గింపు అనంతరం రూ.89,999కి అందుబాటులో ఉంది. ఆఫర్‌లో భాగంగా రూ.4వేల ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌ను ఈ మోడల్‌పై అందిస్తున్నారు.
వన్‌ప్లస్ 15, 13 ఫోన్లపై..
వన్‌ప్లస్ 15ఆర్ ఫోన్‌కు చెంఎదిన 12జీబీ, 256జీబీ మోడల్ ధర తగ్గింపు అనంతరం రూ.56,999 ఉండగా, 12జీబీ, 512జీబీ మోడల్ ధర రూ.61,999గా ఉంది. 16జీబీ, 512జీబీ మోడల్ ధర రూ.63,999గా ఉంది. ఈ ఫోన్‌కు రూ.3వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. వన్‌ప్లస్ 13ఎస్‌కు చెందిన 12జీబీ, 256జీబీ మోడల్ ధర రూ.49,999 ఉండగా, 12జీబీ, 512జీబీ మోడల్ ధర రూ.54,999గా ఉంది. దీనిపై రూ.3వేల తగ్గింపు ధరతోపాటు రూ.2వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. సేల్‌లో భాగంగా తగ్గింపు ధర అనంతరం వన్‌ప్లస్ నార్డ్ 6 ఫోన్‌కు చెందిన 8జీబీ, 256 జీబీ మోడల్‌ను రూ.41,999కు కొనుగోలు చేయవచ్చు. 12జీబీ, 256 జీబీ మోడల్‌ను రూ.47,999కి విక్రయిస్తున్నారు. దీనిపై రూ.500 ధర తగ్గింపు, రూ.2500 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నారు.
వన్‌ప్లస్ నార్డ్ ఫోన్లపై..
వన్‌ప్లస్ నార్డ్ సీఈ6కు చెందిన 8జీబీ, 128జీబీ మోడల్ ధర రూ.31,999గా ఉంది. 8జీబీ, 256జీబీ మోడల్ ధరను రూ.35,999గా నిర్ణయించారు. ఆఫర్ కింద రూ.1వేయి, ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ రూపంలో రూ.3వేల వరకు తగ్గింపును పొందవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ సీఈ6 లైట్ ఫోన్‌కు చెందిన 6జీబీ, 128జీబీ మోడల్ ధర రూ.23,749 ఉండగా, 8జీబీ, 128జీబీ మోడల్ ధర రూ.24,999గా ఉంది. 8జీబీ, 256 జీబీ మోడల్ ధరను రూ.27,999గా నిర్ణయించారు. దీనిపై రూ.1వేయి ఆఫర్ ధర తగ్గింపును, రూ.2వేల వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. వన్‌ప్లస్ ఎన్6కు చెందిన 4జీబీ, 128జీబీ మోడల్ ధర రూ.20,999గా ఉంది. 4జీబీ, 256జీబీ మోడల్ ధర రూ.22,999గా ఉంది. రూ.2వేల వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌ను దీనిపై అందిస్తున్నారు. అలాగే వన్‌ప్లస్ ఎన్6ఎక్స్ ఫోన్‌కు చెందిన 4జీబీ, 64జీబీ మోడల్ ధర తగ్గింపు అనంతరం రూ.17,499గా ఉంది. 4జీబీ, 128జీబీ మోడల్ ధర రూ.19,499గా ఉంది. దీనిపై రూ.1500 వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.
ఇయర్‌బడ్స్, ఇయర్‌ఫోన్స్, ట్యాబ్‌లపై..
ఈ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ బడ్స్ 4, బడ్స్ ప్రొ 3, నార్డ్ బడ్స్ 3ఆర్, బీడబ్ల్యూజడ్2 ఏఎన్‌సీ ఇయర్ ఫోన్స్, వన్ ప్లస్ బుల్లెట్స్ వైర్‌లెస్ జడ్3, నార్డ్ బడ్స్ 4 ప్రొ, నార్డ్ బడ్స్ 4, వన్‌ప్లస్ ప్యాడ్ లైట్, వన్‌ప్లస్ ప్యాడ్ గో 2, ప్యాడ్ 4 తదితర డివైస్‌లను సైతం తగ్గింపు ధరలకు పొందవచ్చు. వీటిపై ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌లను కూడా ఇస్తున్నారు. ఈ సేల్ ఆగస్టు 7న ప్రారంభం కానుండగా అమెజాన్ ఇండియా సైట్, వన్‌ప్లస్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్, వన్‌ప్లస్ స్టోర్ యాప్, ఎక్స్‌పీరియెన్స్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. అయితే సేల్ ముగింపు తేదీని వెల్లడించలేదు. అందువల్ల వినియోగదారులు ఆయా ఉత్పత్తులను కొనుగోలు చేయాలంటే త్వరపడాల్సి ఉంటుంది.
సంబంధిత వార్తలు

Google Assistant | ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇక పూర్తిగా జెమిని ఏఐ.. గూగుల్ అసిస్టెంట్‌కు గుడ్‌బై..
ఆగస్టు 7, 2026

POCO M8 Power 5G | 8000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లేతో లాంచ్ అయిన పోకో కొత్త ఫోన్.. ధర ఎంతంటే..
ఆగస్టు 5, 2026

OnePlus N6x | 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వచ్చిన వన్‌ప్లస్ ఎన్6ఎక్స్ ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు అదిరాయి..
జులై 31, 2026
తాజావార్తలు
- ●Hyderabad | అప్పు తీర్చలేదని.. 21 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లారు
- ●Meta Platforms | మెటాకు భారీ నష్టం.. 1.4 ట్రిలియన్ డాలర్ల మేర ఎఫెక్ట్..?
- ●Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన
- ●Indian Bank | ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్
- ●Shakeela | నటి షకీలాకు సర్జరీ - స్మార్ట్‌ఫోన్‌కు బానిసగా మారి.... మెడ నరాలు దెబ్బతిని..
- ●Annavaram | సత్యమే దైవం.. అన్నవరంలో సత్యనారాయణుడి వైభవం

Hyderabad | అప్పు తీర్చలేదని.. 21 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లారు

Meta Platforms | మెటాకు భారీ నష్టం.. 1.4 ట్రిలియన్ డాలర్ల మేర ఎఫెక్ట్..?

Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన

Indian Bank | ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్



