త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CJI Surya Kant | న్యాయవ్యవస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ విమర్శలకు అతీతం కాదు : సీజేఐ సూర్య‌కాంత్‌

CJI Surya Kant | న్యాయవ్యవస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ విమర్శలకు అతీతం కాదని భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్ (CJI Surya Kant) స్ప‌ష్టం చేశారు.

D

National | Published On Sep 15, 2026, 12.18 pm IST

CJI Surya Kant | న్యాయవ్యవస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ విమర్శలకు అతీతం కాదు : సీజేఐ సూర్య‌కాంత్‌
Advertisement

CJI Surya Kant | త్రినేత్ర‌.న్యూస్ : న్యాయవ్యవస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ విమర్శలకు అతీతం కాదని భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్ (CJI Surya Kant) స్ప‌ష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో నిర్మాణాత్మకమైన విమర్శలు, పరిశీలనలు న్యాయవ్యవస్థ మరింత మెరుగ్గా పనిచేయడానికి సహాయపడతాయని పేర్కొన్నారు. సోమ‌వారం ఢిల్లీలో జ‌రిగిన 6వ రామ్ జెఠ్మ‌లానీ స్మార‌క ఉప‌న్యాస కార్య‌క్ర‌మంలో పాల్గొని ప్ర‌సంగించారు.

నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (NCERT) 8వ తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్య‌పుస్త‌కంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ (corruption in the judiciary)పై ఓ అధ్యాయాన్ని ప్రచురించ‌డం ఇటీవ‌లే తీవ్ర వివాదాస్ప‌ద‌మైన విష‌యం తెలిసిందే. ఈ వివాదాన్ని సీజేఐ ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. "న్యాయవ్యవస్థ ఒక సంస్థగా విమర్శలను వ్యతిరేకించదు.. వ్యతిరేకించలేదు కూడా" అని పునరుద్ఘాటించారు. న్యాయవ్యవస్థ పనితీరుపై నిష్పక్షపాతమైన, సమాచారంతో కూడిన, నిర్మాణాత్మకమైన‌ విమర్శలు ఎంతో అవ‌స‌ర‌మ‌ని నొక్కి చెప్పారు. వాటి ద్వారానే సంస్థాగత జ‌వాబూదారీత‌నం, స్వీయ సంస్క‌ర‌ణ‌లు సాధ్య‌మ‌వుతాయ‌ని స్ప‌ష్టం చేశారు.

న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం వేరు, ప్రజామోదం వేరు అని సీజేఐ తెలిపారు. ప్రజలు కోరుకున్న ఫలితాలు ఇవ్వడం ద్వారా విశ్వాసం లభించదని, ప్రక్రియలో నిష్పక్షపాతాన్ని పాటించడం ద్వారానే అది సాధ్యమవుతుందని తెలిపారు. తీర్పు సరైనదిగా ఉండటంతో పాటు, అది న్యాయంగా జరిగిందనే భావన ప్రజల్లో కలగాలని సీజేఐ పేర్కొన్నారు. న్యాయస్థానాలు "పరిశీలనకు, ప్రశ్నలకు, అవసరమైన చోట విమర్శలకు సిద్ధంగా ఉండాలి" అని కూడా ఆయన నొక్కి చెప్పారు.

Also Read..

గురుగ్రామ్ హిట్ అండ్ రన్ కేసు: నిందితుడు చిక్కాడు.. పదేళ్ల జైలు తప్పదా?

ఇవాళే మీ లాస్ట్ వ‌ర్కింగ్ డే.. లేవ‌గానే ఉద్యోగుల‌కు పిడుగులాంటి వార్త చెప్పిన ఒరాకిల్‌

రూ.2వేలు దాటితే యూపీఐ చార్జీలు చెల్లించాలా.. కేంద్రం స్ప‌ష్ట‌త‌..

Advertisement
Advertisement