Vijay Sethupathi | తమిళనాట హీట్ పెంచిన విజయ్ సేతుపతి కామెంట్లు – సీఎం విజయ్ పాలనపై కౌంటర్ అంటోన్న నెటిజన్లు
బిగ్‌బాస్ తమిళ షోలో విజయ్ సేతుపతి చేసిన కామెంట్లు తమిళనాట దుమారాన్ని రేపుతున్నాయి. సీఎం విజయ్ పాలనపై విమర్శిస్తూ అతడు ఈ కామెంట్లు చేశాడని టీవీకే కార్యకర్తలు ఫైర్ అవుతోన్నారు. ఈ వివాదంపై బిగ్‌బాస్ యాజమాన్యం రియాక్ట్ అయ్యింది. ఈ కామెంట్ల వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని అన్నారు. ప్రస్తుతం తమిళ బిగ్‌బాస్ సీజన్ 10 విజయ్ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరిస్తోన్నారు.
Entertainment | Published On Sep 15, 2026, 5.10 pm IST
Vijay Sethupathi | విజయ్ సేతుపతిని టీవీకే పార్టీ కార్యకర్తలు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అతడి సినిమాలతో పాటు బిగ్‌బాస్ షోను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విజయ్ సేతుపతిపై సీఎం విజయ్ ఫ్యాన్స్‌తో పాటు టీవీకే పార్టీ కార్యకర్తలు విమర్శలు గుప్పించడానికి బిగ్‌బాస్ షో కారణమైంది. ప్రస్తుతం తమిళ బిగ్‌బాస్ సీజన్ 10కు విజయ్ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరిస్తోన్నారు.
వీకెండ్ ఎపిసోడ్...
ఆదివారం జరిగిన వీకెండ్ ఎపిసోడ్‌లో హౌజ్ కెప్టెన్ సాథికను ఉద్దేశించి నాయకత్వం అంటే కేవలం హామీలు ఇవ్వడం మాత్రమే కాదని, సమస్యలు ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడి పోరాడే వాడే నిజమైన నాయకుడు అని విజయ్ సేతుపతి అన్నారు. సాధ్యం కానీ హామీలు ఇచ్చి...సమస్యలు ఎదురవ్వగానే ప్రతిపక్షాలను నిందించడం నాయకుడి లక్షణం కాదు అని పేర్కొన్నారు.
ఇన్‌డైరెక్ట్‌గా...
విజయ్ సేతుపతి కామెంట్లు తమిళనాట దుమారాన్ని రేపుతున్నాయి. ఇన్‌డైరెక్ట్‌గా సీఎం విజయ్ పాలనపై కౌంటర్ వేశాడని టీవీకే కార్యకర్తలు అంటున్నారు. తన వ్యాఖ్యల్లో సీఎం విజయ్ పేరుతో టీవీకే ప్రభుత్వం పేరును విజయ్ సేతుపతి ప్రస్తావించలేదు. అయినా దళపతి విజయ్ ఫ్యాన్స్ మాత్రం అతడిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
ఖజానా ఖాళీ...
డీఎంకే తప్పుడు నిర్ణయాల వల్లే ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యిందని, తాను ఇచ్చిన హామీలును కూడా అమలు చేయడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవంటూ ఇటీవల విజయ్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష డీఎంకే పార్టీపై విమర్శలు గుప్పించారు. సీఎం కామెంట్లపై బిగ్‌బాస్ షోలో విజయ్ సేతుపతి సెటైర్లు వేశాడని టీవీకే వర్గాలు అంటున్నాయి.
బిగ్‌బాస్ బ్యాన్...
బిగ్‌బాస్‌ను బ్యాన్ చేయాలని కామెంట్లు పెడుతోన్నారు. మరోవైపు ఈ వివాదంపై తమిళ బిగ్‌బాస్ టీమ్ రియాక్ట్ అయ్యింది. విజయ్ సేతుపతి కామెంట్ల వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని తెలిపింది. వాటిని వక్రీకరించొద్దు అంటూ పేర్కొన్నది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vijay – Trisha | త్రిష సడెన్ ఎంట్రీ – ముఖం చాటేసిన విజయ్ – ఇద్దరి మధ్య అసలేం జరుగుతోంది?
సెప్టెంబర్ 13, 2026

Trisha | దళపతి విజయ్ మీటింగ్ – త్రిష షూటింగ్ – ఇద్దరూ లండన్‌లోనే!
సెప్టెంబర్ 12, 2026

Jayam Ravi | వెంకటేశ్వరస్వామిగా జయం రవి – మంచు మనోజ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ
సెప్టెంబర్ 10, 2026
తాజావార్తలు
- ●Errolla Srinivas | కుంభం అనిల్ రెడ్డి, ఆంక్షా రెడ్డి, బీర్ల ఐలయ్య ఎస్సీలా?
- ●Wife Drugging Rape Case | భార్యకు తెలియకుండా 20 ఏళ్లుగా డ్రగ్స్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన భర్త
- ●September 17 | తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి
- ●Crude Oil | ముడి చమురు ముప్పు.. బ్యారెల్ ధర 150 డాలర్లకు..?
- ●Tribunal Reforms | ఖాళీల కారణంగా ట్రిబ్యునల్స్ మూతపడకూడదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన
- ●Vanteru Prathap Reddy | రేవంత్! నిన్ను ఏ భాషలో ప్రశ్నించమంటవ్

Errolla Srinivas | కుంభం అనిల్ రెడ్డి, ఆంక్షా రెడ్డి, బీర్ల ఐలయ్య ఎస్సీలా?

Wife Drugging Rape Case | భార్యకు తెలియకుండా 20 ఏళ్లుగా డ్రగ్స్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన భర్త

September 17 | తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి

Crude Oil | ముడి చమురు ముప్పు.. బ్యారెల్ ధర 150 డాలర్లకు..?



